విద్యార్థుల్లో ఆత్మహత్య(Suicide) ఆలోచనలు పెరగడానికి కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

పరీక్షలు, మార్కులు, ర్యాంకుల కోసం అధిక ఒత్తిడి ఎదుర్కొనే విద్యార్థుల్లో మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది.

పరీక్షల్లో ఫెయిల్ కావడం లేదా ఆశించిన ఫలితాలు రాకపోవడం కొందరిలో తీవ్ర నిరాశకు దారితీయవచ్చు.

తమపై పెట్టుకున్న లేదా కుటుంబం నుంచి వచ్చే అధిక అంచనాలు కొందరు విద్యార్థులకు మానసిక భారం కావచ్చు.

స్నేహితులు, కుటుంబ సభ్యులతో భావాలను పంచుకోలేకపోవడం వల్ల ఒంటరితనం పెరిగే ప్రమాదం ఉంది.

డిప్రెషన్, ఆందోళన (Anxiety), తీవ్రమైన ఒత్తిడి వంటి సమస్యలు ఆత్మహత్య ఆలోచనల ప్రమాదాన్ని పెంచవచ్చు.

పాఠశాల, కళాశాల లేదా ఆన్‌లైన్‌లో వేధింపులకు గురికావడం విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు.

స్నేహాలు, ప్రేమ సంబంధాలు లేదా కుటుంబ సంబంధాల్లో ఏర్పడే సమస్యలు కొందరిలో భావోద్వేగ క్షోభకు కారణమవుతాయి.

తగినంత నిద్ర లేకపోవడం, ఫోన్ లేదా సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించడం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

ఉద్యోగాలు, కెరీర్, ఆర్థిక పరిస్థితుల గురించి అధికంగా ఆలోచించడం వల్ల కొందరు విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతారు.

మానసిక సమస్యలను బలహీనతగా భావించి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నిపుణులతో మాట్లాడకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేయవచ్చు.

పిల్లలు మూభావంగా, మూడ్ స్వింగ్స్తో ఇబ్బంది పడుతుంటే తల్లిదండ్రులు వారిని అడిగి సమస్యను తెలుసుకోవాలి.