సైకో(Psychopath) వ్యక్తుల్లో కనిపించే లక్షణాలు ఇవే.. మీలో ఉన్నాయా?

Published by: Geddam Vijaya Madhuri

ఇతరులు బాధపడినా, కష్టాల్లో ఉన్నా పెద్దగా పట్టించుకోరు. వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడతారు.

తమ ప్రయోజనం కోసం తరచూ అబద్ధాలు చెబుతుంటారు. నిజం చెప్పాల్సిన అవసరం లేకపోయినా అబద్ధాలను ఆశ్రయించే అవకాశం ఉంటుంది.

తమకు కావాల్సిన పనులు చేయించుకోవడానికి ఇతరులను ప్రభావితం చేయడం లేదా ఉపయోగించుకోవడం చేస్తుంటారు.

తమ వల్ల ఇతరులకు నష్టం జరిగినా పెద్దగా బాధపడరు. గిల్టీ ఫీలింగ్ లేదా పశ్చాత్తాపం తక్కువగా ఉంటుంది.

మొదటిసారి కలిసినప్పుడు చాలా మర్యాదగా, ఆత్మవిశ్వాసంగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ వారి అసలు ప్రవర్తన తర్వాత బయటపడుతుంది.

వాగ్దానాలు చేసి నిలబెట్టుకోకపోవడం, పనులను మధ్యలో వదిలేయడం, బాధ్యతలను తప్పించుకోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

కొన్ని సందర్భాల్లో చిన్న విషయానికే తీవ్రంగా స్పందించడం లేదా దూకుడుగా ప్రవర్తించడం జరగవచ్చు.

సామాజిక నియమాలు లేదా ఇతరుల హక్కులను గౌరవించకుండా వ్యవహరించే అవకాశం ఉంటుంది.

తమ అవసరాలు, తమ లాభాల గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తారు. ఇతరుల సంక్షేమం గురించి తక్కువగా పట్టించుకుంటారు.

స్నేహాలు, ప్రేమ సంబంధాలు లేదా కుటుంబ బంధాలను స్థిరంగా కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

ఈ లక్షణాల్లో కొన్ని అప్పుడప్పుడు ఎవరిలోనైనా కనిపించవచ్చు. కేవలం ఒకటి లేదా రెండు లక్షణాలు ఉన్నాయని ఎవరినీ సైకోపాత్ అని చెప్పలేం.