ఖర్జూరం ఎవరు తినకూడదు? రోజుకు ఎన్ని తింటే ఆరోగ్యానికి మంచిది?

Published by: Geddam Vijaya Madhuri

ఖర్జూరంలో ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయినా కొందరు ఎక్కువగా తీసుకోవద్దని చెప్తున్నారు నిపుణులు.

ఖర్జూరంలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల షుగర్ ఉన్నవారు ఒకేసారి ఎక్కువ ఖర్జూరాలు తినకూడదు.

ఖర్జూరాల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు ఎక్కువగా తింటే అదనపు కేలరీలు పెరుగుతాయి.

ఖర్జూరాల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. కొన్ని కిడ్నీ వ్యాధుల్లో శరీరంలో పొటాషియం స్థాయిలను నియంత్రించాల్సి ఉంటుంది.

ఒకేసారి ఎక్కువ ఖర్జూరాలు తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

కొందరిలో ఖర్జూరాలు తిన్న తర్వాత దురద, చర్మంపై దద్దుర్లు లేదా ఇతర అలర్జీ లక్షణాలు కనిపించవచ్చు. అలాంటి వారు వీటిని తీసుకోకపోవడం మంచిది.

ఖర్జూరాలు ఆరోగ్యకరమైనవే అయినా చిన్నపిల్లలకు ఎక్కువగా ఇస్తే కడుపు నిండిపోవడంతో ఇతర పోషకాహారాలను తినకపోవచ్చు.

పెద్దలు రోజుకు 2 నుంచి 4 ఖర్జూరాలు తినవచ్చు. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు లేదా క్రీడాకారులు కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవచ్చు.

ఉదయం అల్పాహారంతో పాటు లేదా స్నాక్‌గా ఖర్జూరాలు తింటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. రోజంతా చురుకుగా ఉంటారు.

ఖర్జూరాలను పాలు, బాదం, వాల్‌నట్స్ వంటి వాటితో కలిపి తీసుకుంటే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా లభిస్తాయి.

ఆరోగ్యానికి మంచిదని ఎక్కువ ఖర్జూరాలు తినడం సరైంది కాదు. అధిక కేలరీలు, చక్కెరలు శరీరానికి అదనపు భారం కావచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాతో డైట్లో చేర్చుకోండి.