పిల్లలతో తల్లి పాలు మాన్పించాలనుకుంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Published by: Geddam Vijaya Madhuri

తల్లి పాలు శిశువుకు ఉత్తమ ఆహారం అయినప్పటికీ.. ఒక దశ తర్వాత ఈ ప్రక్రియను ఆపాల్సి ఉంటుంది. అయితే ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా మాన్పించాలి.

తల్లి పాలను ఒక్కరోజులో పూర్తిగా ఆపేయకుండా.. క్రమంగా ఫీడింగ్ సెషన్లను తగ్గించాలి. ఇలా చేస్తే బిడ్డ కూడా కొత్త మార్పుకు సులభంగా అలవాటు పడుతుంది.

ముందుగా పగటి సమయంలో ఇచ్చే ఫీడింగ్‌లను తగ్గించి.. తర్వాత రాత్రి ఫీడింగ్‌లను తగ్గించడం మంచిది.

వయసుకు తగిన ఘన ఆహారం, పండ్ల ముద్దలు, సూప్‌లు లేదా ఇతర పోషకాహారాలను ఇవ్వడం ప్రారంభించాలి. దీంతో పిల్లలకు ఆకలి తీరుతుంది.

పాలు కావాలని అడిగినప్పుడు ఆటలు, కథలు, పాటలు లేదా ఇతర కార్యకలాపాలతో పిల్లల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నించండి.

పిల్లలు తల్లిని చూస్తేనే పాలు అడుగుతారు. అలాంటప్పుడు తండ్రి లేదా ఇతర కుటుంబ సభ్యులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి.

చాలా మంది పిల్లలు తల్లి పాలు తాగుతూ నిద్రపోతారు. అందుకే నిద్రకు ముందు కథ చెప్పడం వంటి కొత్త రొటీన్‌ను అలవాటు చేయాలి.

పాలు మాన్పించే సమయంలో కొందరు పిల్లలు చిరాకు, ఏడుపు లేదా అసహనాన్ని చూపవచ్చు. వారితో ప్రేమగా, ఓపికగా చూసుకోవాలి.

ఫీడింగ్‌ను తగ్గించిన సమయంలో కొందరు తల్లుల్లో రొమ్ముల్లో బిగుతు లేదా అసౌకర్యం కలగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వైద్యుల సలహా తీసుకోవాలి.

జలుబు, జ్వరం లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న సమయంలో తల్లి పాలు మాన్పించే ప్రయత్నం చేయకపోవడం మంచిది.

ప్రతి బిడ్డ ఒకే విధంగా స్పందించదు. కొందరు త్వరగా అలవాటు పడితే.. మరికొందరికి ఎక్కువ సమయం పట్టవచ్చు. కాబట్టి ఓపికతో ఉండాలి.