Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
Walk Barefoot at Home : ఇంట్లో చెప్పులు వేసుకోవాలా లేక చెప్పులు లేకుండా నడవడం మంచిదా? ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. ఎలా నడిస్తే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనమో.. పరిశోధనలు ఏమి చెప్తున్నాయో చూసేద్దాం.

- నేల, వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి ఇంట్లో చెప్పులు అవసరం.
- చెప్పులు లేకుండా నడవడం పాద కండరాలు బలపరిచి, సమతుల్యత పెంచుతుంది.
- గట్టి నేలపై చెప్పులు లేని నడక పాదాలకు హానికరం, నొప్పిని పెంచుతుంది.
- మధుమేహులు, ఇతరులు మంచి చెప్పులు ధరించి ఇన్ఫెక్షన్లు నివారించాలి.
Walking Barefoot vs Wearing Slippers at Home : సాధారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్తే కచ్చితంగా చెప్పులు వేసుకుంటాము. కానీ ఇంట్లోనే చెప్పులు వేసుకోవడం అంటే కొందరు నో చెప్తారు. మరికొందరు హాయిగా ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటారు. అసలు ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేదా చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి మంచిదా? ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. ఈ అంశంపై పరిశోధనలు ఏమి చెప్తున్నాయో.. ఇంట్లో చెప్పులు వేసుకోవడం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో ఇంట్లో చెప్పులు వేసుకోవడం అనే అంశంపై చాలా పరిశోధనలు జరిగాయి. అయితే అవి పూర్తిగా మంచిది అని చెప్పలేదు. అలా అని వేసుకోకూడదని తేల్చలేదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే దీనికి సమాధానం మీ ఇంట్లోని నేల రకం, మీ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందట.
Also Read : ప్రీ-డయాబెటిస్ ఉందా? ఈ ఫుడ్స్ మానేసి.. ఇవి తింటే మధుమేహం రాదట, ఫాలో అయిపోండి
కండరాలు బలపడేందుకు.. ఏది బెస్ట్?
పరిశోధన ప్రకారం.. అప్పుడప్పుడు చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాల్లోని చిన్న కండరాలు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల పాదం పట్టు బలపడుతుంది. పాదపు వంపునకు మంచి ఆధారం లభిస్తుంది. కాలివేళ్లకు బలం పెరుగుతుంది. పాదాలు స్ట్రాంగ్ అయితే శరీర సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఎక్కువసేపు నడిచినా లేదా నిలబడినా కూడా అలసటను తగ్గిస్తాయి.
మీరు గడ్డి, మట్టి లేదా ఇతర సహజ ఉపరితలాలపై చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఈ ప్రయోజనం మరింత స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. కానీ చాలామంది తమ ఇళ్లలో మార్బుల్, టైల్స్ లేదా సిమెంట్‌తో చేసిన గట్టి నేలలు ఉంటాయి. అటువంటి ఉపరితలాలపై ఎక్కువసేపు చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాల మడమలు, వంపులపై అదనపు ఒత్తిడి పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇప్పటికే ప్లాంటార్ ఫాసైటిస్, చదునైన పాదాలు లేదా మడమ నొప్పి ఉన్నవారికి చెప్పులు లేకుండా నడవడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది.
Also Read : మధుమేహం, కంటి ఆరోగ్యం మధ్య సంబంధం ఏంటి? అపోహలు vs వాస్తవాలు
చెప్పుల ఎంపిక ఎలా ఉండాలంటే..
ఆర్చ్ సపోర్ట్ ఉన్న మంచి నాణ్యత గల చెప్పులు ధరించడం వల్ల శరీర బరువు పాదాలపై సమానంగా పంపిణీ అవుతుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల పాదాలపై భారం తగ్గడంతో పాటు, చీలమండలు, మోకాలు, నడుము, తుంటిపై భారం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఎక్కువసేపు నిలబడి పనిచేసే వారికి.. మంచి కుషనింగ్, ఆర్చ్ సపోర్ట్ ఉన్న స్లిప్పర్లు పాదాల, నడుము నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.
కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీర స్థానాన్ని గ్రహించే సామర్థ్యం (ప్రొప్రియోసెప్షన్) మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది. దీనివల్ల మెరుగైన సమతుల్యత, నడక, శరీర నియంత్రణ సాధ్యమవుతాయి. ముఖ్యంగా యువతలో మంచి శరీర భంగిమను, సమన్వయాన్ని కాపాడుకోవడానికి ఈ అలవాటు ఎంతో సహాయపడుతుంది.
Also Read : వర్షాకాలంలో మధుమేహం ఉన్నవారు ఈ ఫుడ్స్ మానేయాలి.. షుగర్ లెవెల్స్ పెంచే ఆహారాలు ఇవే
ఆ తప్పు చేయకండి..
సాధారణంగా రబ్బరు చెప్పులు వేసుకుంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదని చెప్తున్నాయి పరిశోధనలు. ఆర్చ్ సపోర్ట్, సరైన కుషనింగ్ లేని పలుచని చెప్పులు, చెప్పులు లేకుండా నడవడం కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయని తేల్చారు. ఇలాంటి స్లిప్పర్లు పాదాలకు తగినంత ఆధారాన్ని ఇవ్వవని.. వాటిని ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల నొప్పి, సమతుల్యత కోల్పోవడం, పడిపోయే ప్రమాదం పెరగవచ్చు. అందువల్ల ఎల్లప్పుడూ మంచి కుషనింగ్, ఆర్చ్ సపోర్ట్ ఉన్న స్లిప్పర్లను ఎంచుకోవాలి.
మధుమేహ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మధుమేహం ఉన్నవారు ఇంట్లో చెప్పులు లేకుండా నడవడం ప్రమాదకరం. చాలా మంది రోగులకు పాదాలలో స్పర్శజ్ఞానం తక్కువగా ఉంటుంది. కాబట్టి వారు చిన్న గాయాలు, కోతలు లేదా రాపిడిలను కూడా గమనించకపోవచ్చు. అటువంటి చిన్న గాయాలు తరువాత తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారవచ్చు. కాబట్టి మధుమేహం ఉన్నవారు కచ్చితంగా చెప్పులు వాడాలి. ఎల్లప్పుడూ సౌకర్యవంతమైన, సురక్షితమైన చెప్పులు వేసుకోవాలి.
Also Read : ప్రీడయాబెటిస్‌లో కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. లేకుంటే మధుమేహం, ఇతర ప్రాణాంతక సమస్యలు తప్పవు
ఇంట్లో చెప్పులు వేసుకుంటే ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయా?
ఇంటి నేల శుభ్రంగా కనిపిస్తున్నంత మాత్రాన అది పూర్తిగా క్రిమిరహితంగా ఉన్నట్లు కాదు. నేలలపై దుమ్ము, తేమ, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు ఉండవచ్చు. కాబట్టి ఎక్కువసేపు చెప్పులు లేకుండా నడవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా అథ్లెట్స్ ఫుట్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల పాదాల రక్షణ కోసం ఇంట్లో కూడా శుభ్రమైన, సౌకర్యవంతమైన స్లిప్పర్లను ధరించడం ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు.
మధుమేహం గురించిన మరిన్ని హెల్త్ టిప్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దీనిని క్లిక్ చేయండి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























