అన్వేషించండి

Monsoon Risks for Diabetics : వర్షాకాలంలో మధుమేహం ఉన్నవారు ఈ ఫుడ్స్ మానేయాలి.. షుగర్ లెవెల్స్ పెంచే ఆహారాలు ఇవే

Diabetic Risk : మధుమేహం ఉన్నవారు వర్షాకాలంలో కొన్ని ఫుడ్స్​ తినకూడదని చెప్తున్నాయి పలు అధ్యయనాలు. ఇంతకీ ఆ కామన్ ఫుడ్స్ ఏంటి? వాటిని తింటే ఏమవుతుందో తెలుసుకుందాం. 

Monsoon Health Alert for Diabetics : డయాబెటిస్ ఉన్నవారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో వ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో పాటు.. ఫుడ్ విషయంలో చేసే కొన్ని మిస్టేక్స్ మధుమేహాన్ని పెంచుతాయి. కాబట్టి కొన్ని కామన్​ ఫుడ్స్​కి దూరంగా ఉంటూ.. షుగర్​ని కంట్రోల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి? వాటిని తినడం వల్ల మధుమేహం ఉన్నవారికి కలిగే నష్టాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

మధుమేహంపై మాన్​సూన్ ప్రభావం.. 

వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదిస్తుంది. హ్యుమిడిటీ ఎక్కువగా ఉండి.. జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. అంతేకాకుండా మెటబాలీజం నెమ్మదిస్తుంది. ఇది గట్ హెల్త్​ని నెగిటివ్​గా ఇంపాక్ట్ చేసి.. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. బ్లోటింగ్ సమస్యలు పెంచుతుంది. ''జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ'' ప్రకారం.. గట్ హెల్త్​ అనేది ఇన్సులిన్ సెన్సిటివిటీని నేరుగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి కొన్ని ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. 

స్ట్రీట్ ఫుడ్స్.. 

వర్షాకాలంలో స్ట్రీట్​ ఫుడ్ క్రేవింగ్స్ చాలామందికి ఉంటాయి. పకోడి, సమోస, బజ్జీలు వంటి డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్​ తింటూ ఉంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్​ను పెంచి.. షుగర్ లెవెల్స్​ను పెంచేస్తాయి. అలాగే నూనె వల్ల కూడా ఆరోగ్య ప్రమాదాలు రెట్టింపు అవుతాయి. ఇన్​ఫెక్షన్లు సోకుతాయి. 

శుభ్రత

వర్షాకాలంలో వాటర్, ఫుడ్ వల్ల టైఫాయిడ్, కలరా, ఫుడ్​ పాయిజినింగ్ వంటి వ్యాధులు కామన్​గా వస్తాయి. ఇవి కూడా మధుమైహాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. శరీరంలో ఇన్​ఫెక్షన్లు పెరిగినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరుగుతుందని హార్వార్డ్ మెడికల్ స్కూల్ స్టడీ తేల్చి చెప్పింది. కాబట్టి శుభ్రమైన ఫుడ్, నీటిని తీసుకోవాలి. 

రైస్ ఫుడ్స్

వర్షాలు పడే సమయంలో అన్నం.. బియ్యంతో తయారు చేసే ఇడ్లీ, దోశ, పుట్టు వంటివి తగ్గించి తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది శరీరంలో షుగర్ లెవెల్స్​ని పెంచుతుందని ''అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్'' తెలిపింది. ఇన్సులిన్ రెసిస్టెన్సీపై ప్రభావం పడి.. మధుమేహంపై ఎఫెక్ట్ చూపిస్తాయి. శరీరంలో షుగర్​లెవెల్స్​ని ఒకేసారి పెంచేస్తాయి. 

స్వీట్ డ్రింక్స్.. 

వెచ్చదనం కోసం టీలు, కాఫీలు ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే ప్యాక్ చేసిన జ్యూస్​లు తాగడం కూడా మంచిది కాదు. వీటిలో హిడెన్ షుగర్స్, బ్లడ్ షుగర్స్​పై ప్రభావం చూపిస్తాయి. వీటివల్ల టైప్ 1 టైప్ 2 డయాబెటిస్ సమస్యలను రెట్టింపు చేస్తుంది. అయితే వర్షాకాలంలో కూడా నీటిని తరచుగా తీసుకోవాలి. డీహైడ్రేషన్​ను తగ్గించుకునేందుకు హెర్బల్ టీలు, ఇన్​ఫ్యూజ్ చేసిన నీటిని తాగాలి. "Dehydration is a hidden trigger for blood sugar imbalance." అని మాయో క్లినిక్ తెలిపింది. 

మిగిలిన పోయిన ఫుడ్స్, పులిసిన వాటిని కూడా తినకూడదు. వాటివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదముంది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల డయాబెటిక్ కెటోయాసిడోసిస్ (DKA) సమస్యలు వస్తాయి. ఫెర్మెంట్ చేసిన ఫుడ్స్​లో సహజమైన షుగర్స్ ఉంటాయి. బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. 

సీజనల్ ఫ్రూట్స్ అయిన నేరేడు పండ్లు, జామకాయ, పియర్స్, స్ప్రౌట్స్ సలాడ్, ఉడికించిన మొక్కజొన్న వంటివి స్నాక్​గా తీసుకోవచ్చు. పసుపు, అల్లం, మెంతులు వంటివి సహజంగా షుగర్​ను అదుపులో ఉంచుతాయి కాబట్టి.. వాటిని తీసుకుంటే మంచిది. అలాగే వైద్యుల సలహాలు కూడా షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget