Prediabetes : ప్రీడయాబెటిస్‌లో కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. లేకుంటే మధుమేహం, ఇతర ప్రాణాంతక సమస్యలు తప్పవు
Lifestyle Changes for Prediabetes : షుగర్ రానంతవరకు ఓకే కానీ వస్తే జీవితాంతం సఫర్ అవ్వాలి. ప్రీడయాబెటిస్ అనేది దానికి డెడ్ లైన్ లాంటిది. అందుకే ఆ సమయంలో జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలి.

Reversing Prediabetes : డయాబెటిస్ ఒక్కసారివస్తే జీవితాంతం మందులు వేసుకోవాల్సి వస్తుంది. తీసుకునే ఆహారం నుంచి లైఫ్స్టైల్లో ఎన్నో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇంతేకాకుండా అది ప్రాణాంతక సమస్యలను పెంచుతుంది. మధుమేహం వస్తే ఇవన్నీ తప్పదు. కానీ అసలు మధుమేహం రాకుండా ఉంటే.. ఇంకా మంచిదికదా. పైగా ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా షుగర్ వచ్చేస్తుంది కాబట్టి.. ఓ హెల్తీ లైఫ్‌స్టైల్‌ని యుక్త వయసు నుంచే అలవాటు చేసుకుంటే మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు. కనీసం ప్రీడయాబెటిస్ సమయంలో అయినా లైఫ్స్టైల్లో మార్పులు చేయాలని సూచిస్తున్నారు.
జెనిటిక్స్గా వచ్చే మధుమేహాన్ని ఆపడం కష్టమే కానీ.. లైఫ్స్టైల్లోని మార్పులతో దానిని దూరం చేసుకోవచ్చు. అలాగే అసలు డయాబెటిస్ రాకుండా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. తీసుకునే ఫుడ్ విషయం నుంచి శారీరకంగా కొన్ని మార్పులు.. మానసికంగా కొన్ని మార్పులు చేస్తే డయాబెటిస్ వచ్చే సమస్యే ఉండదని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ ప్రీడయాబెటిస్ సమయంలో ఎలాంటి మార్పులు చేస్తే డయాబెటిస్ రాకుండా ఉంటుందో.. ఎలాంటి జాగ్రత్తలు లైఫ్ సేవింగ్ అవుతాయో.. వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సమతుల్య ఆహారం : చాలామంది తీసుకునే ఫుడ్‌పై శ్రద్ధ పెట్టరు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే కచ్చితంగా తీసుకునే ఆహారంపై దృష్టి పెట్టాలి. బ్యాలెన్డ్స్ డైట్ తీసుకోవాలి. డైట్లో కూరగాయాలు, పండ్లు, లీన్ ప్రొటీన్, హెల్తీ ఫ్యాట్స్, పప్పులు ఉండేలా చూసుకోవాలి.
కార్బోహైడ్రేట్స్ : షుగర్ రావడంలో కార్బోహైడ్రేట్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి మీరు తీసుకునే రైస్‌పై కచ్చితంగా దృష్టి పెట్టాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే బ్రౌన్ రైస్, క్వినోవా, మల్టీగ్రైన్ బ్రెడ్‌తో మీరు రైస్‌ని రిప్లేస్ చేయవచ్చు. ఒకవేళ అన్నం తీసుకున్నా.. దానిని లిమిటెడ్‌గా తీసుకోవచ్చు.
హెల్తీ ఫ్యాట్స్ : నట్స్, సీడ్స్, అవకాడో, ఆలివ్ ఆయిల్, నెయ్యి వంటి వాటిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని కూడా మీ శరీరానికి అవసరమయ్యేంతా తీసుకుంటే మంచిది. మోతాదుకు మించి తీసుకోకూడదు.
అన్‌హెల్తీ ఫుడ్స్ : షుగర్ డ్రింక్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్‌కి వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి మంచి రుచినే ఇచ్చినా.. మధుమేహాన్ని కూడా పెంచుతాయి.
హైడ్రేషన్ : డీహైడ్రేట్ కాకుండా శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచేందుకు రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగాలి. డీహైడ్రేషన్ కూడా మధుమేహానికి దారి తీస్తుంది.
శారీరకంగా చేయాల్సిన మార్పులివే..
ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉంటే.. మధుమేహం అవకాశాలను దూరం చేసుకోవచ్చు. కాబట్టి వారంలో కనీసంలో 150 నిమిషాలు అయినా ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలా ఏది అయినా చేస్తూ యాక్టివ్‌గా ఉండాలి. రోజుకు కనీసం 8000 అడుగులు వేస్తూ రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి.
వయసు పెరిగే కొద్ది కండరాలు బలహీన పడతాయి. ఇది షుగర్ అవకాశాలను పెంచుతుంది. కాబట్టి మజిల్ గ్రోత్ కోసం స్వ్కాట్స్, పుష్ అప్స్ వంటి స్ట్రెంత్ ట్రైయినింగ్ వ్యాయామాలు కూడా రొటీన్లో భాగం చేసుకోవాలి.
బరువు
అధిక బరువు డయాబెటిస్ అవకాశాలను పెంచుతుంది. బీపీ కూడా రావొచ్చు. కాబట్టి బరువు పెరగకుండా ఉండేలా చూసుకోండి. లేదా బరువును తగ్గించుకోండి. డైట్లో మార్పులు, ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బరువు కూడా సింపుల్‌గానే తగ్గొచ్చు.
మానసికంగా..
షుగర్ రావడంలో ఒత్తిడి కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. అంతేకాకుండా రోజుకు 7 నుంచి 8 గంటలు రాత్రి నిద్రఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
మరిన్ని జాగ్రత్తలు
రెగ్యులర్ చెకప్స్ : షుగర్ సమస్యను గుర్తించేందుకు 3 నుంచి 6 ననెలలకోసారి హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. దీనివల్ల ఆరోగ్య పరిస్థితి చేజారకుండా ఉంటుంది.
స్మోకింగ్ : స్మోకింగ్ టైప్ 2 డయాబెటిస్ సమస్యను పెంచుతుంది కాబట్టి. మొత్తానికి మానేస్తే మంచిది.
మందు : ఆల్కహాల్ శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్‌ని తగ్గిస్తుంది. కాబట్టి దానిని కంట్రోల్ చేయాలి.
విటమిన్ డి : శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. ఇది శరీరంలో తక్కువైనా కూడా టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశముంది కాబట్టి. ఉదయాన్నే సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి పొందండి. లేదా వైద్యుల సూచనల మేరకు సప్లిమెంట్స్ తీసుకోవాలి.
ఇవన్నీ రెగ్యులర్‌గా ఫాలో అయితే డయాబెటిస్‌ని కచ్చితంగా దూరం చేసుకోవచ్చు. అయితే పూర్తిగా రాకుండా ఉండదనే గ్యారెంటీ లేదు. శరీరతత్వాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. హెల్తీ రొటీన్‌ని ఫాలో అయితే పూర్తి ఆరోగ్యానికి మంచిది కాబట్టి.. వైద్యుల సలహాలతో లైఫ్స్టైల్లో ఈ మార్పులు చేసేయండి.
Also Read : బరువు తగ్గడానికి నడిస్తే మంచిదా? సైక్లింగ్ బెటరా? దేనివల్ల త్వరగా బరువు తగ్గుతారంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

