Delhi Election Exit Poll: ఢిల్లీ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీకే ఎడ్జ్ అంటున్న ఎగ్జిట్ పోల్స్
Delhi Election Exit Poll Results 2025: ఢిల్లీలో ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది.

Delhi Elections Exit Poll Result 2025 : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్నదానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమయింది. పోలింగ్ ముగియడంతో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తున్నాయి. పోరాటం హోరాహోరీగా సాగినా భారతీయ జనతా పార్టీకే ఎడ్జ్ ఉందని ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 32 -37
బీజేపీకి -35-40
కాంగ్రెస్ -0-1
చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 25 -28
బీజేపీకి -39-44
కాంగ్రెస్ -02-03
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 10-19
బీజేపీకి -51-60
కాంగ్రెస్ 00-00
పీ మార్గ్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 21 -31
బీజేపీకి -39-49
కాంగ్రెస్ -00-01
పోల్ డైరీ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 18 -25
బీజేపీకి -42 - 50
కాంగ్రెస్ -00-02
పోల్స్ ఇన్ సైట్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 25 -29
బీజేపీకి -40 - 44
కాంగ్రెస్ -00-01
వీ ప్రిసైడ్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 46-52
బీజేపీకి - 18-23
కాంగ్రెస్ -00-01
టైమ్స్ నౌ జేవీసీ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 22 - 31
బీజేపీకి -39-45
కాంగ్రెస్ -00-02
మైండ్ బ్రింక్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 44-49
బీజేపీకి -21-25
కాంగ్రెస్ -00-01
ఆబ్సల్యూట్ పొలిటికో అంచనా ఇదే
హైదరాబాద్ సంస్థ ఆబ్సల్యూట్ పొలిటికో కూడా బీజేపీదే విజయం అని తేల్చింది. ఈ ఎన్నికల్లో కాషాయం విజయం ఏకపక్షమేనని ప్రకటించింది. ఈ సంస్థ చేసిన సర్వే ప్రకారం బీజేపీకి 43 నుంచి 52 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆమ్‌ఆద్మీ పార్టీకి 15-27 సీట్లే లభిస్తాయని అంచనాలు వేస్తోంది. కాంగ్రెస్‌కు అతికష్టమ్మీద రెండు సీట్ల వరకు వచ్చే అవకాాశం ఉందని తేల్చింది.
ఎగ్జిట్ పోల్స్‌లో చాలా వరకూ బీజేపీకే అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. రెండు ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఎనిమిదో కౌంటింగ్ జరగనుంది.
Live Minute-by-Minute Updates on the Delhi Assembly Election#DelhiElections2025 #Politics #DelhiAssemblyElection2025 #DelhiElectionshttps://t.co/EMp0hxYM7m
— ABP LIVE (@abplive) February 5, 2025
ఇటీవల హర్యానాలో జరిగిన ఎన్నికల్లో ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా నిజం కాలేదు. అన్ని ఎగ్దిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని ప్రకటించాయి. కానీ అక్కడ పూర్తిస్థాయిలో బీజేపీ విజయం సాధించింది. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ కొంత వరకూ నిజం అయ్యాయి. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఫలితం ఎలా వస్తుందన్నది ఎనిమిదో తేదీన క్లారిటీ వస్తుంది.





















