Naga Chaitanya Thandel Real Story Ramarao | చైతూ రిలీజ్ చేస్తున్న తండేల్ కథ ఇతనిదే | ABP Desam
ఫిబ్రవరి 7న నాగచైతన్య నటించిన తండేల్ సినిమా వస్తోంది. సాయిపల్లవి, చైత్యన జంటగా నటించిన తండేల్ సినిమా కథ ఓ రియల్ స్టోరీ. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కే. మత్య్సలేశం గ్రామానికి రామారావు అనే వ్యక్తి కథనే తండేల్ సినిమా కోసం తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా చెందిన మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్ కు వెళ్తుంటారు. అలా 2018లో మత్స్యలేశం గ్రామానికి చెందిన 22 మత్స్యకారులు గుజరాత్ సముద్రంలో వేట చేస్తూ పొరపాటున పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లిపోయారు. ఫలితంగా అక్కడి మెరైన్ పోలీసులు రామారావుతో పాటు మిగిలిన మత్స్యకారులను అరెస్ట్ చేసి పాకిస్థాన్ లోని కరాచీ జైలుకు తరలించారు. అక్కడ అనేక ఇబ్బందులు పడిన రామారావు..ఆ తర్వాత ప్రభుత్వాల చర్చలతో విడుదలయ్యారు. రామారావు అతని తోటి మత్స్యకారులు పాకిస్థాన్ జైలులో అనుభవించిన చిత్రహింసలు, ఎదుర్కొన్న సమస్యల ఆధారంగానే తండేల్ సినిమా తీశారు. నాటి అనుభవాలను, తన కథను తండేల్ సినిమాగా తీస్తున్న వైనాన్ని రియల్ తండేల్ రామారావు మాటల్లోనే విందాం.





















