PM Modi Maha Kumbh 2025 | మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన ప్రధాని మోదీ | ABP Desam
144ఏళ్లకు ఓసారి వచ్చే మహాకుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవిత్ర స్నానం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ప్రయాగరాజ్ కు చేరుకున్న మోదీ...తొలుత త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. కాషాయపు చొక్కా, ట్రాంక్ ప్యాంట్, మెడలో రుద్రాక్షమాలలతో మోదీ పవిత్ర స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం అర్పించారు. ఆ తర్వాత మోదీ మహాపూజలో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ టోపీతో మోదీ మహాకుంభమేళా మహాపూజలో పాల్గొనటం విశేషం. పితృదేవతలకు పూజలు నిర్వహించిన తర్వాత అక్కడే సాధు సంతువులతో మోదీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. మోదీ రాక సందర్భంగా భద్రతబలగాలు భారీ ఏర్పాట్లు చేశారు. రోజుకు రెండు నుంచి మూడుకోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న చోట మోదీకి భద్రత కల్పించటం కత్తి మీద సాముకాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, భద్రతా బలగాలు ఏర్పాట్లు చేశాయి. మోదీ స్నానం చేసే ఘాట్ లో మరెవ్వరూ లేకుండా మొత్తం ఖాళీగా ఉంచారు. మోదీ మాత్రమే స్నానం చేసేలా ముందస్తు ఏర్పాట్లు చేశారు.





















