Trump on Gaza Strip | ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలోకి అమెరికా | ABP Desam
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి సంచలన ప్రకటన వచ్చింది. ఇన్నాళ్లూ పరోక్షంగా ఇజ్రాయెల్ కు సాయమందిస్తూ పాలస్తీనా పై పోరులో సహకరిస్తున్న అమెరికా ఇక ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగనున్నట్లు అర్థమవుతోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమెన్ నెతన్యాహూతో భేటీ తర్వాత డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి సంచలన ప్రకటన చేశారు. ఏకంగా గాజా స్ట్రిప్ ను తమ అధీనంలోకి తీసేసుకుంటామని ప్రకటించారు ట్రంప్. గాజాపై ఆధిపత్యం కోసం హమాస్ తో ఏడాదిన్నరగా యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్. పాలస్తీనా సహకారంతో హమాస్ తిరుగుబాటు చేస్తుండగా...అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ చేస్తున్న భీకర యుద్ధం కారణగంా దాదాపుగా గాజా స్ట్రిప్ మొత్తం నాశనమైంది. 62వేల మంది గాజా ప్రజలు యుద్ధంలో మృతి చెందినట్లు పాలస్తీనా ప్రకటించింది. అలాంటిది ఏడాదిన్నర ఇటీవలే ఇజ్రాయెల్, హమాస్ రెండూ కాల్పుల ఒప్పందానికి అంగీకరించాయి. ఫలితంగా వేలాదిగా ప్రజలు వేరే దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. గాజా, వెస్ట్ బ్యాంక్ ఇప్పటికే పూర్తిగా ధ్వంసమవగా ఇప్పుడు గాజా స్ట్రిప్ ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేరుగా ప్రకటన చేశారు. ఫలితంగా హమాస్ మళ్లీ ఇజ్రాయెలీ సైన్యాలపై మళ్లీ తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. ఫలితంగా యుద్ధం మరింత కాలం కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. పైగా ట్రంప్ సాధారణ చర్యలకు ఇది విరుద్ధం. అమెరికా ప్రజల పన్నులు తీసుకువచ్చి యుద్ధంలో తగలేస్తున్నారంటూ తరచూ ఆరోపించే ట్రంప్...సైన్యాన్ని వెనక్కి పిలిచి యుద్ధాలను ఆపేయాలనే తత్వంతో నిర్ణయాలు తీసుకునేవారు. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా యుద్ధాన్ని కొనసాగించాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఉపద్రవాలకు దారి తీస్తుందనే ఆందోళనలకు కారణమవుతోంది.






















