అలసటగా అనిపిస్తోందా? కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

శరీరంలో ఐరన్ లోపం అలసటకు ప్రధాన కారణం కావచ్చు.

నీరు తక్కువ తాగడం వల్ల కూడా శరీరం బలహీనంగా అనిపిస్తుంది.

ఒత్తిడి, ఆందోళన శక్తిని తగ్గిస్తుంది.

పోషకాహారం తీసుకోకపోవడం వల్ల శరీరం అలసిపోతుంది.

డయాబెటిస్ వంటి వ్యాధులు కూడా అలసటను పెంచుతాయి.

సరైన నిద్ర లేకపోవడం వల్ల రోజంతా అలసటగా ఉంటుంది.

అధిక కెఫిన్ లేదా క్రమరహిత జీవనశైలి కూడా ప్రభావితం చేస్తుంది.

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరం అలసటగా మారిపోతుంది.