Fenugreek Seeds : జుట్టు, స్కిన్, ఆరోగ్యానికి మెంతులు మంచివే అయినా.. కొందరు వీటిని తినకూడదట, ఎందుకంటే?
Fenugreek Side Effects : మెంతులు ఆరోగ్యానికి మంచివే అయినా.. వాటిని కొందరు తీసుకోకపోవడమే మంచిదని చెప్తున్నారు నిపుణులు. మరి వీటిని ఎవరు తినకూడదో.. కారణాలు ఏంటో చూసేద్దాం.

- మెంతులు అధిక మోతాదులో గర్భిణీలు, శస్త్రచికిత్స చేయించుకునేవారికి హానికరం.
- రక్తస్రావ నివారణ, డయాబెటిస్ మందులు వాడేవారు జాగ్రత్తగా ఉండాలి.
- జీర్ణ సమస్యలు, థైరాయిడ్ మందుల వారూ వైద్యుల సలహా తీసుకోవాలి.
Fenugreek Seeds Side Effects : మెంతులు తరచుగా ఉపయోగించే మసాలా దినుసుల్లో ఒకటి. మెంతుల్లో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, బ్లడ్ షుగర్ నియంత్రణ, బరువు నిర్వహణకు హెల్ప్ చేస్తాయని నమ్ముతారు. అలాగే జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా మంచిదిగా భావించి.. రాత్రుళ్లు మెంతులు నానబెట్టి.. మెంతులు, మెంతుల నీటిని తీసుకుంటుంటారు.
అయితే మెంతులను వంటల్లో మసాలాగా ఉపయోగించడం వేరు.. నానబెట్టి గింజలు, పొడి లేదా సప్లిమెంట్‌ల రూపంలో తీసుకోవడం వేరు. ఎందుకంటే కొన్ని మందులతో కలిపి మెంతులను అధికంగా తీసుకోవడం వల్ల మంచికి బదులు ఇబ్బందులు రావచ్చట. మరి ఎవరు మెంతులను ఎక్కువగా తీసుకోకూడదో.. తీసుకుంటే జరిగే పరిణామాలు ఏంటో చూసేద్దాం.
Also Read : మెంతులు నానబెట్టి తాగాలా? మరిగించి తీసుకుంటే ఇంకా మంచిదా? నిపుణుల సలహాలు ఇవే
గర్భిణీలు
ప్రెగ్నెన్సీ సమయంలో మెంతులను అధిక మొత్తంలో లేదా సప్లిమెంట్‌ల మాదిరిగా తీసుకోవడం మంచిది కాదు. మెంతులు గర్భాశయంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే వైద్యుల సూచన లేకుండా ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.
ఆపరేషన్ చేయించుకునేవారు
శస్త్రచికిత్స చేయించుకోబోతున్నవారు రెగ్యులర్‌గా మెంతుల సప్లిమెంట్లు తీసుకుంటుంటే ముందుగానే వైద్యుడికి చెప్పాలి. మెంతులు రక్తం గడ్డకట్టే ప్రక్రియపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని సందర్భాల్లో రక్తస్రావం ప్రమాదం పెరగవచ్చు.
బ్లడ్ థిన్నర్స్ వాడేవారు
వార్ఫరిన్, అసిట్రోమ్ వంటి రక్తం గడ్డకట్టడాన్ని ప్రభావితం చేసే మందులు తీసుకునేవారు మెంతులను అధిక మొత్తంలో తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. మందులతో కలిపి తీసుకున్నప్పుడు రక్తస్రావానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Also Read : మెంతులు, మందారంతో హెయిర్ ఆయిల్.. జుట్టు సమస్యలు దూరం చేసుకునేందుకు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండిలా
జీర్ణ సమస్యలు ఉంటే
మెంతులు కొందరిలో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కలిగించవచ్చు. ముఖ్యంగా IBS లేదా సెన్సిటివ్ గట్ ఉన్నవారు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు.
డయాబెటిస్ మందులు వాడేవారు
మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే ప్రభావం కలిగి ఉండవచ్చు. కాబట్టి ఇన్సులిన్ లేదా గ్లిమెపైరైడ్ వంటి డయాబెటిస్ మందులు తీసుకునేవారు మెంతులను అధికంగా తీసుకుంటే బ్లడ్ షుగర్ మరీ తగ్గిపోయే అవకాశం ఉండొచ్చు. అందుకే రెగ్యులర్‌గా తీసుకోవాలనుకుంటే వైద్యుల సలహా తీసుకోండి.
Also Read : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
థైరాయిడ్ మందులు వేసుకుంటే..
థైరాయిడ్ మందులు వాడేవారు మెంతులను మందు తీసుకునే సమయంలోనే తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఫైబర్, ఇతర భాగాలు కొన్ని మందుల శోషణపై ప్రభావం చూపుతాయి. కాబట్టి మెంతులు, థైరాయిడ్ మందుల మధ్య కనీసం రెండు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి.
మెంతులు సహజమైనవి, ఆరోగ్యకరమైనవి అయినా.. వాటిని తీసుకునేముందు కచ్చితంగా ఆహార నిపుణుల సలహా తీసుకోవాలి. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటే.. ఏదైనా కొత్త ఆహారం డైట్లో చేర్చుకోవాలనుకుంటే ముందుగా వైద్యుల సూచనలు తీసుకోవాలి. మెంతులు తీసుకోవాలి కచ్చితంగా అనుకుంటే లిమిటెడ్గా మాత్రమే తీసుకోవాలి. మోతాదుకు మించి తీసుకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Also Read : మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















