అన్వేషించండి

Fenugreek Water : మెంతులు నానబెట్టి తాగాలా? మరిగించి తీసుకుంటే ఇంకా మంచిదా? నిపుణుల సలహాలు ఇవే

Drink Fenugreek Water : మెంతులు ఆరోగ్యానికి చాలామంచి ప్రయోజనాలు ఇస్తాయి. అయితే వీటిని నానబెట్టి తీసుకుంటే మంచిదా? లేదంటే మరిగించి తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 

Soaked or Boiled Fenugreek Water : మెంతులను ఆరోగ్యం కోసం ఎన్నో శతాబ్ధాలుగా సహజమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకుంటారు. అలాగే ఫుడ్ రుచిని పెంచుకునేందుకు వివిధ వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి షుగర్ కంట్రోల్, బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలు ఇస్తాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. మరి దీనిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

మెంతులును నానబెట్టాలా? మరిగించి తాగాలా?

మెంతులను నానబెట్టి తాగినా.. మరిగించి తాగినా ఈ రెండింటికీ వేర్వేరు ప్రయోజనాలు ఉన్నాయి. మీ ఆరోగ్య అవసరాన్ని బట్టి ఏది బెస్ట్ అనేది మీరు ఎంచుకునే దానిని బట్టి ఉంటుంది. 

నానబెట్టిన మెంతులు నీటి ప్రయోజనాలు..

మెంతులను రాత్రి నీటిలో నానబెడితే.. అందులోని నీటిలో కరిగే పోషకాలు (soluble nutrients) బయటకు వస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. మెటబాలిజం యాక్టివ్ అయి బరువు నియంత్రణకు సహాయపడుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు రోజూ దీనిని తీసుకోవచ్చు. రుచి మైల్డ్‌గా ఉండటం వల్ల ఎవరికైనా ఇది బాగా సెట్ అవుతుంది.

మెంతులు మరిగించి తాగితే.. 

మెంతులను నీటిలో మరిగిస్తే వాటిలోని యాక్టివ్ కంపౌండ్స్, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా విడుదలవుతాయి. ఈ నీటిని తాగితే శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లేలా డిటాక్స్ చేస్తుంది. జలుబు, దగ్గు, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే ఈ నీరు రుచి కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి రోజూ తాగడం కొందరికి కష్టం కావచ్చు.

పోషకాల పరంగా తేడాలు ఇవే

నానబెట్టిన మెంతులు నీటిలో సహజ ఎంజైమ్స్ నిల్వ ఉంటాయి. కాబట్టి ఇవి కడుపునకు తేలికగా ఉంటుంది. మరిగించిన మెంతులు నీటిలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా విడుదలవుతాయి. కానీ వేడి వల్ల సున్నితమైన పోషకాలు తగ్గవచ్చు. 

సింపుల్‌గా చెప్పాలంటే..

రోజూ తాగాలంటే నానబెట్టిన మెంతి నీరు మంచిది. అవసరమైనప్పుడు ఔషధంలా వాడాలంటే మరిగించిన నీరు బెస్ట్. బరువు తగ్గాలనుకునేవారికి.. నానబెట్టిన మెంతులు నీరు మంచి ఆప్షన్. డిటాక్స్, జలుబు, దగ్గు ఉంటే.. మరిగించిన మెంతులు నీరు మంచిది. మధుమేహం ఉండేవారికి రెండూ మంచివేనని చెప్తున్నారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

మెంతులు నీరు తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మెంతులను కచ్చితంగా కడిగి ఉపయోగించాలి. రోజుకు ఒక చిన్న గ్లాస్ తాగితే సరిపోతుంది. అధికంగా తాగితే లో బీపీ, లో షుగర్ వచ్చే అవకాశం. గర్భిణీలు ఇప్పటికే లో బ్లడ్ షుగర్ ఉన్నవారు, కొత్తగా ప్రారంభించాలనుకునేవారు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
Multani Mitti for Hair : ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
ముల్తానీ మట్టి తలకు అప్లై చేయవచ్చా? లాభాలు, నష్టాలు ఇవే
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget