అన్వేషించండి

Joint Pain During Monsoon : వర్షాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు ఎక్కువ అవుతాయి? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Monsoon and Joint Health : వర్షాకాలంలో కీళ్ల నొప్పులు పెరగడం చాలా మందిలో సాధారణంగా కనిపించే సమస్య. దీనికి కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో, నిపుణుల సూచనలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వర్షాకాలంలో చాలామందికి కీళ్ల నొప్పులు, నడుం నొప్పులు అధికమవుతాయి.
  • వాతావరణ పీడనం తగ్గడం, తేమ కీళ్ల నొప్పులను అధికం చేస్తాయి.
  • వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువు, వెచ్చదనం, ఆహారం నొప్పిని తగ్గిస్తాయి.
  • తీవ్రమైన, నిరంతర కీళ్ల నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

Arthritis and Joint Pain in Monsoon : వర్షాకాలం రాగానే చాలామందికి కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, కాళ్ల నొప్పులు ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్, పాత గాయాలు, కీళ్ల సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో ఎక్కువ అసౌకర్యాన్ని ఎదుర్కొంటుంటారు. వర్షం నేరుగా కీళ్లను దెబ్బతీయకపోయినా, వాతావరణంలో వచ్చే మార్పులు కీళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలంలో కీళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతాయి?

వర్షాలు పడే ముందు, వర్షాకాలంలో వాతావరణ పీడనం (Atmospheric Pressure) తగ్గుతుంది. దీనివల్ల కీళ్ల చుట్టూ ఉన్న కణజాలాలు స్వల్పంగా ఉబ్బే అవకాశం ఉంటుందని యశోద హాస్పిటల్స్​లో సీనియర్ కన్సల్టెంట్ రొబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్, ట్రోమా అండ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్​గా చేస్తోన్న డాక్టర్ అభిషేక్ బెర్లీ తెలిపారు. దీని ఫలితంగా కీళ్లపై ఒత్తిడి పెరిగి నొప్పి, బిగుతు ఎక్కువగా అనిపించవచ్చన్నారు. అలాగే వాతావరణంలో తేమ (Humidity) పెరగడం, ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కండరాలు బిగుసుకుపోయి కీళ్ల కదలికలు తగ్గుతాయని.. దీంతో నొప్పి మరింత తీవ్రంగా అనిపించవచ్చని తెలిపారు.

సాధారణంగా కనిపించే లక్షణాలు

వర్షాకాలంలో కీళ్ల సమస్యలు ఉన్నవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించవచ్చని డాక్టర్ అభిషేక్ తెలిపారు. కీళ్లలో బిగుతుగా అనిపించడం, వాపు రావడం, నొప్పి పెరగడం, నడవడంలో లేదా కదలడంలో ఇబ్బంది, మెట్లు ఎక్కడం, దిగడంలో ఇబ్బందులు, మోకాళ్లు, తుంటి భాగం, నడుం, చేతి కీళ్లలో అసౌకర్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా పాత ఫ్రాక్చర్లు ఉన్నవారిలో ఈ మార్పులు ఎక్కువగా ఉంటాయి. 

కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి ఏం చేయాలి?

వానాకాలంలో వచ్చే కీళ్ల నొప్పులను దూరం చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని డాక్టర్ అభిషేక్ తెలిపారు. కీళ్ల ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని తెలిపారు. నడక, యోగా, స్ట్రెచింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు కీళ్ల కదలికలను మెరుగుపరుస్తాయి. కండరాలను బలంగా ఉంచుతాయి. అలాగే చాలా సేపు కూర్చోవడం వల్ల కీళ్ల బిగుతు పెరుగుతుంది. కాబట్టి మధ్య మధ్యలో లేచి కొద్దిసేపు నడవడం మంచిదని సూచిస్తున్నారు. 

అధిక బరువు మోకాళ్లు, తుంటి వంటి బరువు కీళ్లపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది. అందుకే ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యమని చెప్తున్నారు. చల్లటి వాతావరణంలో కండరాలు బిగుసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వెచ్చని దుస్తులు ధరించడం, అవసరమైతే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. 

ఫుడ్ జాగ్రత్తలు

వర్షాకాలంలో దాహం తక్కువగా అనిపించినా శరీరానికి అవసరమైన నీటిని తీసుకోవాలి. సరైన హైడ్రేషన్ కీళ్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పండ్లు, కూరగాయలు, నట్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారాలు కీళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడవచ్చు.

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలంటే..

కీళ్ల నొప్పి నిరంతరం వస్తున్నా, వాపు, ఎర్రబారడం, నడవలేకపోవడం లేదా రోజువారీ పనులు చేయడంలో ఇబ్బంది ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇవి అంతర్గత కీళ్ల సమస్యలకు సంకేతాలు కావచ్చు. ఈ లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

ఆరోగ్యం గురించిన ఇతర సలహాలు, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 4 :దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు నైవేద్యం.. శ్రీ మహాచండీ దేవికి ఇలా లడ్డూలు చేసి పెట్టేయండి
దసరా నవరాత్రుల్లో నాలుగో రోజు నైవేద్యం.. శ్రీ మహాచండీ దేవికి ఇలా లడ్డూలు చేసి పెట్టేయండి
Overnight Oats Recipe : కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
Body Itching : శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget