అన్వేషించండి

Best Yoga Poses for Joint Health : కీళ్ల నొప్పులను దూరం చేసే సింపుల్ యోగాసనాలు ఇవే.. రోజూ చేస్తే మంచి ఉపశమనం!

Simple Yoga Asanas For Joint Pain : కీళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే రోజూ ఈ ఆసనాలు వేస్తే కచ్చితంగా ఉపశమనం ఉంటుందని యోగా నిపుణులు చెప్తున్నారు. అవేంటో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కీళ్ల నొప్పులు తగ్గడానికి యోగా ఆసనాలు మంచి పరిష్కారం.
  • ఈ ఆసనాలు కీళ్ల కదలిక, బలం, ఫ్లెక్సీబులిటీని పెంచుతాయి.
  • తీవ్రమైన నొప్పులుంటే వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.
  • సరైన ఆహారం, బరువు నియంత్రణతో యోగా ఫలితాలిస్తుంది.

Daily Yoga for Joint Pain : ప్రస్తుతం చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చాలామంది కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం, వయసు పెరగడం, అధిక బరువు లేదా ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల కీళ్ల నొప్పులు రావచ్చు. ఇలాంటప్పుడు కొన్ని యోగాసనాలను రెగ్యులర్గా చేస్తే కీళ్ల కదలికలు మెరుగుపడి.. నొప్పులు తగ్గడంతో పాటు శరీరానికి ఫ్లెక్సీబులిటీ కూడా పెరుగుతుంది. మరి కీళ్ల నొప్పులకు ఉపశమనం కలిగించే యోగాసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తడాసనం


Best Yoga Poses for Joint Health : కీళ్ల నొప్పులను దూరం చేసే సింపుల్ యోగాసనాలు ఇవే.. రోజూ చేస్తే మంచి ఉపశమనం!

తడాసనం శరీర భంగిమను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మోకాళ్లు, చీలమండలు, నడుముపై ఒత్తిడిని తగ్గించి శరీర సమతుల్యతను పెంచుతుంది. రోజూ కొన్ని నిమిషాలు ఈ ఆసనం చేయడం వల్ల కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.

వృక్షాసనం 


Best Yoga Poses for Joint Health : కీళ్ల నొప్పులను దూరం చేసే సింపుల్ యోగాసనాలు ఇవే.. రోజూ చేస్తే మంచి ఉపశమనం!

ఒక కాలిపై నిలబడి చేసే ఈ ఆసనం కాళ్ల కండరాలను బలపరుస్తుంది. మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలకు బలం పెంచడంతో పాటు కీళ్లకు మద్దతు ఇస్తుంది. అలాగే శరీర సమతుల్యత కూడా మెరుగుపడుతుంది.

భుజంగాసనం 


Best Yoga Poses for Joint Health : కీళ్ల నొప్పులను దూరం చేసే సింపుల్ యోగాసనాలు ఇవే.. రోజూ చేస్తే మంచి ఉపశమనం!

భుజంగాసనం వెన్నెముక, భుజాలు, నడుము భాగాలను బలపరుస్తుంది. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరచి కీళ్ల బిగుతును తగ్గించడంలో సహాయపడుతుంది.

మార్జర్యాసనం


Best Yoga Poses for Joint Health : కీళ్ల నొప్పులను దూరం చేసే సింపుల్ యోగాసనాలు ఇవే.. రోజూ చేస్తే మంచి ఉపశమనం!

మార్జర్యాసనం యోగా భంగిమ వెన్నెముక కదలికలను మెరుగుపరుస్తుంది. మెడ, భుజాలు, వెన్నెముక కీళ్లలో ఉండే బిగుతును తగ్గించి శరీరానికి ఫ్లెక్సీబులిటీని అందిస్తుంది.

త్రికోణాసనం


Best Yoga Poses for Joint Health : కీళ్ల నొప్పులను దూరం చేసే సింపుల్ యోగాసనాలు ఇవే.. రోజూ చేస్తే మంచి ఉపశమనం!

త్రికోణాసనం కాళ్లు, నడుము, వెన్నెముక భాగాలను స్ట్రెచ్ చేస్తుంది. కీళ్ల చుట్టూ రక్తప్రసరణ పెరిగి నొప్పులు తగ్గేందుకు దోహదపడుతుంది.

వీరభద్రాసనం


Best Yoga Poses for Joint Health : కీళ్ల నొప్పులను దూరం చేసే సింపుల్ యోగాసనాలు ఇవే.. రోజూ చేస్తే మంచి ఉపశమనం!

వీరభద్రాసనం కాళ్ల కండరాలను బలపరచి మోకాళ్లకు మద్దతు ఇస్తుంది. కీళ్ల స్థిరత్వాన్ని పెంచి రోజువారీ పనులు సులభంగా చేయడానికి సహాయపడుతుంది.

బాలాసనం 


Best Yoga Poses for Joint Health : కీళ్ల నొప్పులను దూరం చేసే సింపుల్ యోగాసనాలు ఇవే.. రోజూ చేస్తే మంచి ఉపశమనం!

బాలాసనం శరీరానికి విశ్రాంతిని అందించే యోగాసనం. నడుము, మోకాళ్లు, హిప్స్‌పై ఒత్తిడిని తగ్గించి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

సేతు బంధాసనం


Best Yoga Poses for Joint Health : కీళ్ల నొప్పులను దూరం చేసే సింపుల్ యోగాసనాలు ఇవే.. రోజూ చేస్తే మంచి ఉపశమనం!

సేతు బంధాసనం వెన్నెముక, మోకాళ్లు, హిప్స్ కీళ్లను బలపరుస్తుంది. శరీర కదలికలను మెరుగుపరచి కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.

యోగా చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటే వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతే యోగా ప్రారంభించాలి. అలాగే ఆసనాలను నెమ్మదిగా చేయాలి. నొప్పి పెరిగితే వెంటనే ఆపేయాలి. యోగా చేసే ముందు కాస్త వార్మప్ చేయాలి. శ్వాసను సక్రమంగా తీసుకుంటూ, క్రమం తప్పకుండా ఆసనాలు వేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కీళ్ల నొప్పులు పూర్తిగా తగ్గడానికి యోగా ఒక్కటే పరిష్కారం కాకపోయినా.. సరైన ఆహారం, బరువు నియంత్రణ, వైద్యుల సూచనలతో పాటు యోగా చేస్తే కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కీళ్ల సమస్యల, నొప్పులకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలకోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget