అన్వేషించండి

Kidney Problems : కిడ్నీ ఫెయిల్యూర్‌కు ముందే కనిపించే లక్షణాలు ఇవే.. ఈ వార్నింగ్ సిగ్నల్స్ లైట్ తీసుకోకండి

Early Symptoms of Kidney Problems : కిడ్నీ వ్యాధులు సైలెంట్​గా అభివృద్ధి చెందుతాయి. అందుకే అలసట, మూత్రంలో మార్పులు, వాపులు, బీపీ సమస్యలు వంటి లక్షణాలను విస్మరించకూడదని నిపుణులు చెప్తున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కిడ్నీ వ్యాధులు ఆలస్యంగా బయటపడతాయి, ముందస్తు సంకేతాలు ముఖ్యం.
  • అలసట, మూత్ర మార్పులు, వాపులు, దురద ప్రధాన లక్షణాలు.
  • మధుమేహం, బీపీ ఉన్నవారు రెగ్యులర్ కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి.
  • ముందుగా గుర్తిస్తే చికిత్స ద్వారా డయాలసిస్ అవసరం తగ్గుతుంది.

Signs of Kidney Disease : కిడ్నీ వ్యాధుల విషయంలో పెద్ద సమస్య ఏంటంటే.. ప్రారంభ దశలో చాలామందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. చాలా సందర్భాల్లో వ్యాధి తీవ్ర స్థాయికి చేరుకున్న తర్వాతే సమస్య బయటపడుతుంది. అప్పటికే కిడ్నీల పనితీరు గణనీయంగా దెబ్బతిని ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని సూచించే ముందస్తు హెచ్చరికలను గుర్తించడం చాలా ముఖ్యం అని వైద్యులు చెబుతున్నారు.

హైదరాబాద్​లోని యశోద హాస్పిటల్​లో సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్సప్లెంట్ ఫిజీషియన్ డాక్టర్ దిలీప్ M. బాబు పలు సూచనలు చేశారు. కిడ్నీల పనితీరు తగ్గినప్పుడు శరీరం ఇచ్చే లక్షణాలను విస్మరించవద్దని అంటున్నారు. అలాంటి సంకేతాలు గురించి పలు సూచనలు చేశారు. 

నిరంతరం అలసట..

కిడ్నీల పనితీరు తగ్గినప్పుడు శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అలాగే ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమైన ఎరిథ్రోపోయెటిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కూడా తగ్గవచ్చు. దీనివల్ల రక్తహీనత (అనీమియా) వచ్చే ప్రమాదం ఉంటుందని డాక్టర్ దిలీప్ తెలిపారు. ఫలితంగా బలహీనత, అలసట, ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు.

మూత్రంలో మార్పులు 

మూత్ర విసర్జనలో వచ్చే మార్పులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. రాత్రిపూట తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రంలో నురుగు కనిపించడం, రక్తం పడటం లేదా సాధారణం కంటే మూత్ర పరిమాణం గణనీయంగా తగ్గిపోవడం కిడ్నీ సమస్యలకు సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా మూత్రంలో ప్రోటీన్ కనిపించడం కిడ్నీ దెబ్బతినడానికి తొలి సూచనల్లో ఒకటిగా పరిగణిస్తామని తెలిపారు.

కాళ్లు, ముఖంలో వాపు

కిడ్నీలు శరీరంలోని అదనపు ద్రవాలు, సోడియంను సరిగా బయటకు పంపలేకపోతే శరీరంలో నీరు నిల్వ అవుతుంది. దీనివల్ల కాళ్లు, చీలమండలు, చేతులు, ముఖం లేదా కళ్ల చుట్టూ వాపు కనిపించవచ్చు. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని చెప్తున్నారు.

దురద, ఆకలి తగ్గిపోవడం

కిడ్నీల పనితీరు తగ్గినప్పుడు శరీరంలో టాక్సిన్లు పేరుకుపోతాయి. దీంతో దురద, పొడి చర్మం, వికారం, వాంతులు, ఆకలి తగ్గడం, నోటిలో లోహపు రుచి రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరిలో ఎటువంటి కారణం లేకుండానే బరువు పెరగడం లేదా తగ్గడం కూడా జరగవచ్చు.

బీపీ అదుపులో లేకుంటే..

కిడ్నీ వ్యాధులు, అధిక రక్తపోటు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. కిడ్నీ సమస్యల వల్ల బీపీ పెరగవచ్చు. అలాగే అధిక రక్తపోటు వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మందులు వాడుతున్నా బీపీ అదుపులోకి రాకపోతే కిడ్నీల ఆరోగ్యాన్ని కూడా టెస్ట్ చేయించుకోవాలని అంటున్నారు డాక్టర్ దిలీప్. 

ఎవరికి ప్రమాదం ఎక్కువ?

మధుమేహం, హైబీపీ, ఊబకాయం, గుండె జబ్బులు ఉన్నవారు.. అలాగే కుటుంబంలో కిడ్నీ వ్యాధుల చరిత్ర ఉన్నవారు.. 50 ఏళ్లు దాటినవారిలో కిడ్నీ సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం అవసరం.

ముందుగానే ఇలా గుర్తించండి.. 

కిడ్నీ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడానికి కొన్ని సాధారణ పరీక్షలు ఉపయోగపడతాయి. రక్తపోటు పరీక్ష, మూత్ర పరీక్ష, సీరం క్రియాటినిన్ పరీక్ష, ఈజీఎఫ్‌ఆర్ (eGFR) పరీక్షల ద్వారా కిడ్నీల పనితీరును అంచనా వేయవచ్చు. కిడ్నీ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్సను వెంటనే ప్రారంభించవచ్చు. దీంతో వ్యాధి వేగంగా ముదరకుండా అడ్డుకోవచ్చు. అలాగే కిడ్నీ ఫెయిల్యూర్, డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరం వచ్చే ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చని సూచిస్తున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్, ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget