బరువు తగ్గాలంటే ఉదయాన్నే ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవచ్చా?

Published by: Geddam Vijaya Madhuri

ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి అధికంగా తినడం తగ్గుతుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.

కొన్ని పరిశోధనల్లో ఆపిల్ సైడర్ వెనిగర్‌ తీసుకున్నవారిలో స్వల్పంగా బరువు తగ్గినట్లు గుర్తించాయి. అయితే ఇది పూర్తిగా బరువు తగ్గించకపోవచ్చు.

భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరగకుండా చేయడంలో ఇది కొంత సహాయపడవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్ తాగితే మెటబాలిజం ఒక్కసారిగా పెరిగి బరువు వేగంగా తగ్గిపోతుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు.

వ్యాయామం, సమతుల్య ఆహారం లేకుండా కేవలం ఆపిల్ సైడర్ వెనిగర్‌తో బరువు తగ్గడం సాధ్యం కాదు.

కొందరికి జీర్ణక్రియ మెరుగుపడినట్లు అనిపించవచ్చు. అయితే అందరికీ ఒకే విధమైన ఫలితాలు రావు.

ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఎప్పుడూ నీటిలో కలిపి మాత్రమే తీసుకోవాలి. నేరుగా తాగితే గొంతు, దంతాల ఎనామెల్ దెబ్బతినే ప్రమాదం ఉంది.

అధిక మోతాదులో తీసుకుంటే కడుపులో మంట, వికారం, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

డయాబెటిస్, బీపీ లేదా ఇతర మందులు వాడేవారు ఆపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.

బరువు తగ్గాలంటే కేలరీల నియంత్రణ, క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్ర, ఒత్తిడి నియంత్రణ ప్రధాన పాత్ర పోషిస్తాయి.