డయాబెటిస్ ఉన్నవాళ్లు ఉదయాన్నే ఏమి తింటే షుగర్ కంట్రోల్‌ అవుతుంది

Published by: Geddam Vijaya Madhuri

గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచి.. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడతాయి.

మెంతుల నీరు లేదా నానబెట్టిన మెంతులు తీసుకుంటే.. వాటిలోని కరిగే ఫైబర్ గ్లూకోజ్ శోషణ వేగాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు.

ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది షుగర్ స్థాయిలు స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

స్ప్రౌట్స్‌లో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడవచ్చు.

ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి నియంత్రణలో ఉండి గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉండటం వల్ల ఉదయాన్నే కొద్దిపాటి నట్స్ తినడం మంచిది.

ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను కలిపి చేసిన పోహా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

చియా సీడ్స్ లేదా ఫ్లాక్స్ సీడ్స్లోని ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి గ్లూకోజ్ నియంత్రణకు మద్దతు ఇవ్వవచ్చు.

పెసరట్టులో ప్రోటీన్, ఫైబర్‌తో నిండి ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి మంచి బ్రేక్‌ఫాస్ట్ ఎంపికగా చెప్పవచ్చు.

లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లు మితంగా తీసుకుంటే షుగర్ ఒక్కసారిగా పెరగకుండా ఉండేందుకు సహాయపడవచ్చు.

ఆహారాన్ని మితంగా తీసుకుంటూ.. వైద్యులు సూచించిన మందులు వేసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది.