కాఫీ తాగడం మానేస్తే ఆరోగ్యానికి మంచిదా? కాదా?

Published by: Geddam Vijaya Madhuri

కాఫీలో ఉండే కెఫిన్‌కు శరీరం అలవాటు పడితే.. ఒక్కసారిగా మానేసినప్పుడు తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు.

కెఫిన్ ప్రభావం తగ్గుతుంది కాబట్టి.. రాత్రిళ్లు త్వరగా నిద్రపోవడం, గాఢ నిద్ర రావడం వంటివి జరుగుతాయి.

ఎక్కువగా కాఫీ తాగే వారిలో గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన పెరగడం కనిపించొచ్చు. కాఫీ మానేస్తే ఇవి తగ్గే అవకాశం ఉంటుంది.

కాఫీ వల్ల వచ్చే తాత్కాలిక ఎనర్జీ బూస్ట్ లేకపోయినా.. రోజంతా శక్తి స్థాయిలు సమతుల్యంగా ఉండొచ్చు.

కాఫీ కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతుంది. దాన్ని మానేస్తే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు కొందరిలో తగ్గవచ్చు.

కెఫిన్ కారణంగా పెరిగే హార్ట్ రేట్ కొంతమందిలో తగ్గి, గుండె సాధారణంగా పనిచేయవచ్చు.

కాఫీ స్వల్ప డయూరెటిక్‌గా పనిచేస్తుంది. కాఫీ మానేస్తే తరచూ యూరిన్‌కు వెళ్లడం తగ్గొచ్చు.

కాఫీ వల్ల పళ్లపై ఏర్పడే మరకలు తగ్గి, పళ్ల సహజ రంగు కొంతవరకు నిలిచి ఉండవచ్చు.

కొంతమందిలో కెఫిన్ తాత్కాలికంగా బీపీని పెంచుతుంది. కాఫీ మానేస్తే బీపీ స్థిరంగా ఉండేందుకు సహాయపడవచ్చు.

ప్రారంభంలో అలసట, చిరాకు ఉన్నా, కొన్ని వారాల తర్వాత శరీరం కెఫిన్ లేకుండానే సహజంగా పనిచేయడం ప్రారంభిస్తుంది.

రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు మిల్క్ లేని కాఫీ కూడా మంచిదేనని చెప్తారు నిపుణులు. మానేసినా మంచిదే అంటున్నారు.