మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోలేకపోతుంది. దీంతో రాత్రి మధ్యలో అకస్మాత్తుగా మెలకువ వచ్చే అవకాశం ఉంది.
తెల్లవారుజామున శరీరంలో కార్టిసోల్ (స్ట్రెస్ హార్మోన్) స్థాయిలు సహజంగానే పెరగడం ప్రారంభమవుతుంది. కొందరిలో ఇది ముందుగానే పెరిగి నిద్రకు అంతరాయం కలిగించవచ్చు.
మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్‌ల నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో నిద్ర నాణ్యత దెబ్బతిని మధ్యలో మెలకువ రావచ్చు.
రాత్రి ఆలస్యంగా తినడం లేదా కొన్ని సందర్భాల్లో రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం వల్ల కూడా నిద్ర భంగం కలగవచ్చు.
సాయంత్రం లేదా రాత్రి టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది.
నిద్రలో శ్వాస తాత్కాలికంగా ఆగిపోవడం వల్ల మెదడు అప్రమత్తమై తరచూ మెలకువ వచ్చే అవకాశం ఉంటుంది.
పడుకునే ముందు ఎక్కువ నీరు తాగడం, కొన్ని ఆరోగ్య పరిస్థితులు లేదా వయసు పెరగడం వల్ల రాత్రి యూరిన్ కోసం లేవాల్సి రావచ్చు.
చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉన్న గదిలో నిద్ర నాణ్యత తగ్గి రాత్రి మధ్యలో మెలకువ రావచ్చు.
ముఖ్యంగా మహిళల్లో గర్భధారణ, మెనోపాజ్ లేదా ఇతర హార్మోన్ల మార్పులు నిద్రకు అంతరాయం కలిగించవచ్చు.
వయసు పెరిగే కొద్దీ నిద్ర తేలికగా మారుతుంది. అందువల్ల రాత్రి 2 నుంచి 4 గంటల మధ్య మెలకువ రావడం సాధారణంగా కనిపించవచ్చు.
అప్పుడప్పుడు ఇలా మెలకువ రావడం సాధారణమే. కానీ వారానికి అనేకసార్లు జరుగుతూ, తిరిగి నిద్ర పట్టకపోతే జాగ్రత్త.
పగటిపూట అలసట, ఏకాగ్రత లోపం ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.