అన్వేషించండి

Kidney Disease Deaths : 2040 నాటికి కిడ్నీ వ్యాధులే మరణాలకు 5వ ప్రధాన కారణమా? లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Chronic Kidney Disease : మూత్రపిండాల వ్యాధులు చాలా సైలెంట్​గా వ్యాపిస్తున్నాయని.. 2040 నాటికి మరణాల్లో టాప్ 5 ప్రధాన కారణాల్లో ఒకటిగా మారనుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు, కొత్త చికిత్సలు కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నాయి.

Rising Kidney Disease Worldwide : మన శరీరంలోని మూత్రపిండాలు పగలు, రాత్రి అవిశ్రాంతంగా పనిచేస్తాయి. ఇవి రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడంలో, శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడటంలో, రక్తపోటును నియంత్రించడంలో, ఎముకలు, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి పూర్తి ఆరోగ్యంలో కిడ్నీల పనితీరుకు చాలా ముఖ్యపాత్ర ఉంటుంది. 

అయితే వీటిని పనితీరు కాస్త డిస్టర్బ్ అయినా.. చాలా ఇబ్బందులకు గురి అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మూత్రపిండాల పనితీరు క్షీణించడం ప్రారంభమైనప్పుడు.. ప్రారంభ దశలలో శరీరం తరచుగా ఎటువంటి స్పష్టమైన సంకేతాలను ఇవ్వదు. అందుకే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిని సైలెంట్​గా పరిగణిస్తారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల వ్యాధులు పెరుగుతున్నాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. 

షాకింగ్ విషయాలు

'ది లాన్సెట్' అనే వైద్య పత్రికలో ఇటీవలే దీని గురించిన మూడు పరిశోధనా అధ్యయనాలు ప్రచురించారు. వాటి ప్రకారం.. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 788 నుంచి 844 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని షాకింగ్ విషయం తెలిపారు. అంతేకాకుండా 2040 నాటికి ఇది ప్రపంచవ్యాప్తంగా మరణానికి ఐదవ ప్రధాన కారణం కావచ్చని తెలిపారు.

కిడ్నీ వ్యాధులు పెరగడానికి కారణాలు..

మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, వృద్ధాప్యం వంటి కారకాలు మూత్రపిండాల వ్యాధులు పెరగడానికి కారణమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా నేటి జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా మూత్రపిండాలపై అదనపు భారాన్ని మోపుతున్నాయంటూ హెచ్చరించారు. పైగా కిడ్నీ వ్యాధులు తరచుగా ప్రారంభ దశలలో ఎటువంటి లక్షణాలు లేకుండానే ముదిరిపోతున్నాయని.. అందుకే సకాలంలో వ్యాధిని నిర్ధారించడం కీలకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది.

ముందుగానే గుర్తించేందుకు..

మూత్రపిండాల వ్యాధిని నిర్ధారించడానికి ఇప్పుడు కొత్త సాంకేతికతలు ఉపయోగిస్తున్నారని లాన్సెట్ మొదటి అధ్యయనం నివేదించింది. గ్లోమెరలర్ ఫిల్ట్రేషన్ రేట్ టెస్ట్​లు, అల్బుమినూరియా టెస్ట్​లు, అధునాతన ఇమేజింగ్, ఏఐ, ఇతర ఆధునిక పద్ధతులు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడంలో సహాయపడుతున్నాయని తెలిపింది. వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే.. మూత్రపిండాలను అంత మెరుగ్గా రక్షించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

పురుషులలో, స్త్రీలలో కిడ్నీల వ్యాధుల మధ్య తేడాలు ఇవే

మరో అధ్యయనం ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. మూత్రపిండాల వ్యాధి స్త్రీ, పురుషులను ఒకే విధంగా ప్రభావితం చేయదని పరిశోధకులు కనుగొన్నారు. మూత్రపిండాల నిర్మాణం, వ్యాధి పురోగతి, చికిత్సకు ప్రతిస్పందన వేర్వేరుగా ఉండవచ్చని తెలిపారు. 

ఈ లక్షణాలు లైట్ తీసుకోకూడదు..

స్టెడ్‌ఫాస్ట్ న్యూట్రిషన్ వ్యవస్థాపకుడు అమన్ పూరి ప్రకారం.. చెడు ఆహారపు అలవాట్లు మూత్రపిండాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. అధిక ప్రోటీన్ ఆహారం, అధిక ఉప్పు, స్వీట్స్, అనారోగ్యకరమైన కొవ్వుల తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై అదనపు భారాన్ని మోపుతుందని అంటున్నారు. దీంతో చేతులు, పాదాలు లేదా కళ్ల చుట్టూ నిరంతర వాపు, మూత్రంలో మార్పులు, నురుగుతో కూడిన మూత్రం, నిరంతర అలసట, ఆకలి లేకపోవడం, నోటిలో లోహపు రుచి, రాత్రిపూట కండరాల నొప్పులు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని ఆయన హెచ్చరిస్తున్నారు.

కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చికిత్సలు

మూడవ అధ్యయనం ఆశాజనకంగా ఉంది. SGLT2 ఇన్హిబిటర్లు, గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1 రిసెప్టర్ అగోనిస్ట్‌లు, ఇతర అధునాతన చికిత్సల వంటి కొత్త మందులు, మూత్రపిండాల వ్యాధి పురోగతిని నెమ్మదింపజేయడంలో ఆశాజనకమైన ఫలితాలను చూపించాయని వెల్లడించింది. ఈ మందులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడవచ్చు. అయితే రోగులకు తరచుగా మధుమేహం, ఊబకాయం మరియు గుండె జబ్బులు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయని, వీటికి సమగ్ర చికిత్స అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.

కిడ్నీల ఆరోగ్యం గురించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Height Growth in Children : పిల్లల ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి? ఆహారం, నిద్ర, వ్యాయామంపై వైద్యులు చెప్పిన విషయాలివే
పిల్లల ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి? ఆహారం, నిద్ర, వ్యాయామంపై వైద్యులు చెప్పిన విషయాలివే
Monsoon Skin Problems : వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎందుకు పెరుగుతాయి? లక్షణాలు, నివారణ చిట్కాలు చెప్పిన డెర్మటాలజిస్ట్
వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎందుకు పెరుగుతాయి? లక్షణాలు, నివారణ చిట్కాలు చెప్పిన డెర్మటాలజిస్ట్
Drink Too Much Tea : టీ ఎక్కువగా తాగుతున్నారా? నిద్రలేమి, రక్తహీనతతో పాటు ఈ సమస్యలు రావొచ్చంటున్న వైద్యులు
టీ ఎక్కువగా తాగుతున్నారా? నిద్రలేమి, రక్తహీనతతో పాటు ఈ సమస్యలు రావొచ్చంటున్న వైద్యులు
Reduce Blood Sugar Levels : మందులు లేకుండానే షుగర్ లెవెల్స్ తగ్గాలా? రోజుకు 15 నిమిషాలు ఈ పని చేస్తే చాలు అంటున్న నిపుణులు
మందులు లేకుండానే షుగర్ లెవెల్స్ తగ్గాలా? రోజుకు 15 నిమిషాలు ఈ పని చేస్తే చాలు అంటున్న నిపుణులు
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay Wife Sangeetha Reunion: త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
Mumbai Doctor Controversy: చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
SINGA: గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
Anil Ravipudi: జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
Crime Thriller Series OTT : డబుల్ మర్డర్స్... ట్విస్టులతో ఇన్వెస్టిగేషన్ - ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
డబుల్ మర్డర్స్... ట్విస్టులతో ఇన్వెస్టిగేషన్ - ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
Meenakshi Natarajan Court Case: మీనాక్షి నటరాజన్‌ కేసు పిటిషన్‌ను ఫిర్యాదుదారుకు రిటర్న్ చేసిన నాంపల్లి కోర్టు - కేసు లేనట్లే - జరిగిపోయిన నష్టం భర్తీ ఎలా?
మీనాక్షి నటరాజన్‌ కేసు పిటిషన్‌ను ఫిర్యాదుదారుకు రిటర్న్ చేసిన నాంపల్లి కోర్టు - కేసు లేనట్లే - జరిగిపోయిన నష్టం భర్తీ ఎలా?
Standup Comedy Controversy: ప్లేట్ బిర్యానీ జోక్‌తో తిరగబడిన టెకీ లైఫ్ - లేడీస్ విషయంలో అంతే - 370 బిర్యానీ వైరల్ స్టోరీ ఇదిగో !
ప్లేట్ బిర్యానీ జోక్‌తో తిరగబడిన టెకీ లైఫ్ - లేడీస్ విషయంలో అంతే - 370 బిర్యానీ వైరల్ స్టోరీ ఇదిగో !
Kadiri Shadi Mahal Dispute: కదిరిలో షాదీమహల్‌కు తాళం - ఎమ్మెల్యే కబ్జా ప్లాన్‌లో భాగమే - వైసీపీ సంచలన ఆరోపణలు
కదిరిలో షాదీమహల్‌కు తాళం - ఎమ్మెల్యే కబ్జా ప్లాన్‌లో భాగమే - వైసీపీ సంచలన ఆరోపణలు
Embed widget