అన్వేషించండి

Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి

Normal Fever vs Dengue: వర్షాకాలంలో వచ్చే ప్రతి జ్వరమూ సాధారణమైనది కాదు. సీజనల్ జ్వరం మరియు డెంగ్యూ లక్షణాల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం ద్వారా సమయానికి సరైన పరీక్షలు, చికిత్స చేయించుకోవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వర్షాకాలంలో సాధారణ జ్వరం, దగ్గు, అలసట వంటివి వస్తాయి.
  • డెంగ్యూలో తీవ్ర జ్వరం, కీళ్లనొప్పి, ఎర్రటి మచ్చలుంటాయి.
  • చిగుళ్ల నుండి రక్తస్రావం, విపరీతమైన బలహీనత డెంగ్యూ లక్షణాలు.
  • జ్వరం తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించండి.

Monsoon Fever | మండుటెండలు, చెమటలు, వేడి, ఉక్కపోత తరువాత భారత్‌లో వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాకాలం ఎండ వేడి నుండి ఎంత ఉపశమనాన్ని ఇస్తుందో, అదే స్థాయిలో  అనేక వ్యాధులను కూడా తీసుకొస్తుంది. వర్షాకాలం మొదలవ్వగానే చాలా ఇళ్లలో జ్వరం, జలుబు, దగ్గు బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ వర్షాకాలంలో సీజనల్ జ్వరం రావడం అనేది చాలా సాధారణం. కొన్ని మందులు వాడుతూ, చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇది నయమవుతుంది. 

కానీ ఈ సీజన్‌లో జ్వరం వచ్చిందంటే అది కేవలం సీజనల్ జ్వరమే అని భావించకూడదు. చాలా సార్లు ఇది డెంగ్యూ లేదా మలేరియా వంటి అనారోగ్య సమస్యల ప్రారంభ లక్షణాలను కూడా సూచించవచ్చు. వీటిని గుర్తించడం కొంచెం కష్టమని చెప్పాలి. ఇలాంటి సమయంలో మీకు ఏ జ్వరం వచ్చిందనే అవగాహన ఉంటే, సమయానికి చికిత్స ప్రారంభించాలి. 

నార్మల్ ఫీవర్ లక్షణాలు

వర్షాకాలంలో వచ్చే సీజనల్ జ్వరం విషయానికి వస్తే, దీని ప్రారంభ లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి. మీకు ఒళ్లు నొప్పులు, సాధారణ దగ్గు, గొంతు నొప్పితో పాటు కాస్త అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో కేవలం సరైన విశ్రాంతి, మెడిసిన్, క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జ్వరం 2 నుంచి 3 రోజుల్లో అదే తగ్గుతుంది. అలాగే ఈ సమయంలో పేషెంట్‌కు ఆకలి తగ్గుతుంది. కళ్ల ముందు ఇష్టమైన పదార్థాలున్నా ఏమీ తినాలి అనిపించదు. ఈ లక్షణాలు మినహా సీజనల్ జ్వరంలో ఇతర ప్రత్యేక లక్షణాలు ఉండవు. కేవలం మంచి ఆహార అలవాట్లు, బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. వానలో తడవకపోవడంతో పాటు క్రమం తప్పకుండా వేడి నీరు తాగుతూ ఉండాలి. జ్వరం ఉన్నప్పుడు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. లేకపోతే నీరసం ఎక్కువై మరింత అనారోగ్యం బారిన పడతారు. 

Also Read: Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!

డెంగ్యూ లక్షణాలను ఎలా గుర్తించాలి
ఒకవేళ డెంగ్యూ అయితే సాధారణ జ్వరం కంటే చాలా తీవ్రమైన జ్వరం ఉంటుంది. అకస్మాత్తుగా శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. ఇందులో ఒళ్లు నొప్పులతో పాటు కీళ్లు, కండరాలలో విపరీతమైన నొప్పి వస్తుంటుంది. దీనిని గుర్తించడానికి సులువైన మార్గం ఏమిటంటే, ఈ వ్యాధి సమయంలో మీ శరీరంపై చిన్న చిన్న ఎరుపు రంగు మచ్చలు (దద్దుర్లు) వస్తాయి. అలాగే చిగుళ్లు లేదా ముక్కు నుండి రక్తం కారడం, విపరీతమైన నీరసం, వాంతులు లాంటి సమస్యలు కనిపిస్తాయి. జ్వరం 3 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉన్నా, ఏమాత్రం తగ్గకపోయినా, శరీర ఉష్ణోగ్రత పదే పదే విపరీతంగా పెరిగినా లేదా శరీరంపై మచ్చలు కనిపించినా డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. రక్త పరీక్షలో ప్లేట్‌లెట్స్ కౌంట్‌ తప్పనిసరిగా చెక్ చేయించాలి.

గమనిక (Disclaimer): పరిశోధనా అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. దీనిని వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా మాత్రం భావించవద్దు. మీరు ఏదైనా కొత్త విధానాన్ని లేదా వ్యాయామం చేసేముందు, మెడిసిన్ తీసుకునే ముందు తప్పనిసరిగా సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Frequently Asked Questions

వర్షాకాలంలో సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటి?

వర్షాకాలం జ్వరం, జలుబు, దగ్గు వంటి అనేక వ్యాధులను తెస్తుంది. ఈ సీజన్‌లో జ్వరం రావడం సర్వసాధారణం.

సాధారణ జ్వరం, డెంగ్యూ జ్వరాలను ఎలా గుర్తించాలి?

సాధారణ జ్వరానికి ఒళ్లు నొప్పులు, దగ్గు, అలసట ఉంటాయి. డెంగ్యూలో తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులు, శరీరంపై ఎర్ర మచ్చలు వస్తాయి.

వర్షాకాలంలో వచ్చే సాధారణ జ్వరం లక్షణాలు ఏమిటి?

ఒళ్లు నొప్పులు, సాధారణ దగ్గు, గొంతు నొప్పి, అలసట, ఆకలి తగ్గడం వంటివి సాధారణ జ్వరం లక్షణాలు. సరైన విశ్రాంతితో 2-3 రోజుల్లో ఇది తగ్గుతుంది.

డెంగ్యూ జ్వరం యొక్క కీలక లక్షణాలు ఏమిటి?

తీవ్రమైన జ్వరం, కీళ్లు, కండరాల నొప్పి, శరీరంపై ఎర్ర మచ్చలు, చిగుళ్లు/ముక్కు నుండి రక్తం కారడం, వాంతులు డెంగ్యూ లక్షణాలు. జ్వరం 3 రోజులు తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Weight Loss Tips : వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
High BP : అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
Yoga Poses for Lower Back : నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
నడుమునొప్పి ఇబ్బంది పెడుతుందా? నిద్రలేవగానే ఈ 5 ఆసనాలు వేయండి.. చాలా రిలీఫ్ వస్తుంది
Advertisement

వీడియోలు

IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget