అన్వేషించండి

House Cleaning Tips: ఇల్లు తుడిచినా సువాసన రావడం లేదా నీళ్ల బకెట్‌లో ఇది కలిపి చూడండి, రోజంతా రీఫ్రెష్

Floor Cleaning Tips | ఇల్లు తుడిచిన తరువాత సువాసన ఎక్కువ కాలం ఉండాలంటే చిన్న చిట్కా పాటిస్తే సరిపోతుంది. అధిక గాఢత కెమికల్స్ వినియోగించాల్సిన అవసరం కూడా లేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇంటిని తుడిచేటప్పుడు గోరువెచ్చని నీటిలో ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి.
  • వెచ్చని నీరు సువాసనను బాగా వ్యాపింపజేస్తుంది; తడి గుడ్డ పిండాలి.
  • బకెట్ శుభ్రంగా ఉంచండి, తుడిచిన తర్వాత కిటికీలు తెరవాలి.
  • దుర్వాసన తొలగించి, సువాసన పెంచడానికి వెనిగర్ వాడండి.

How To Keep House Smelling Fresh | మన ఆరోగ్యం అనేది ఇంటి పరిశుభ్రతపై సైతం ఎంతో కొంత ఆధారపడి ఉంటుంది. ఇల్లు తుడిచి, శుభ్రం చేసిన తర్వాత, ఎక్కువసేపు తాజా సువాసన ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ ఇల్లు తుడిచిన కొన్ని నిమిషాల తర్వాత వాసన మాయమైతుంది. మీ ఇంట్లో కూడా ఇలా జరిగితే, ఖరీదైన రూమ్ ఫ్రెషనర్లు లేదా కెమికల్ క్లీనర్లు కొనాల్సిన అవసరం లేదు. ఒక చిన్న చిట్కా మీ ఇంట్లో ఎక్కువసేపు సువాసన ఉండేలా చేస్తుంది.

ఈ సులభమైన చిట్కా కోసం ఎసెన్షియల్ ఆయిల్ మాత్రమే అవసరం ఉంటుంది. ఇల్లు తుడవడానికి గోరువెచ్చని నీళ్ల బకెట్‌లో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు కలపండి. ఆ తర్వాత ఆ నీటితో ఇల్లంతా శుభ్రంగా తుడవండి. నేల ఆరిపోయిన తర్వాత కూడా మీ ఫ్లోర్‌లో సహజమైన సువాసన ఎక్కువసేపు ఉంటుంది.

గోరువెచ్చని నీటితో ఇల్లు తుడవాలి

మీరు చల్లని నీళ్లకు బదులుగా గోరువెచ్చని నీటిని ఇంటిని తుడిచేందుకు ఉపయోగించాలి. అందులో మీరు వేసే ఎసెన్షియల్ ఆయిల్ సువాసన మరింత బాగా వ్యాపిస్తుంది. వేడి కారణంగా, దాని సువాసన గది మొత్తం వ్యాపిస్తుంది. నేల ఆరిపోయిన తర్వాత కూడా ఎక్కువసేపు ఉంటుంది.

ఏ ఎసెన్షియల్ ఆయిల్ వాడాలి

ఇంటికి తాజా సువాసన ఇవ్వడానికి లావెండర్, లెమన్‌గ్రాస్, యూకలిప్టస్, ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్స్ మంచి ఎంపికలుగా భావిస్తారు. . వాటి సువాసన తీవ్రంగా కాకుండా సింపుల్‌గా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎక్కువ మొత్తంలో ఆయిల్ డ్రాప్స్ వేయవలసిన అవసరం లేదని గుర్తుంచుకోండి. కొన్ని చుక్కలు వేస్తే గది మొత్తానికి సరిపోతాయి.

Also Read: Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!

తుడిచే గుడ్డను ఎక్కువ తడి వద్దు 

తుడిచే గుడ్డ చాలా తడిగా ఉండకుండా చూసుకోవాలి. నీరు త్వరగా వ్యాపించి, ఎసెన్షియల్ ఆయిల్ ప్రభావం తగ్గుతుంది. అందువల్ల, తుడిచే గుడ్డను కొద్దిగా పిండి ఇల్లు తుడుచుకోవాలి. ఇది సువాసనను బాగా వ్యాప్తి చేసి ఎక్కువసేపు మీ ఫ్లోర్ సువాసునగా ఉంచుతుంది. 

బకెట్ నీట్‌గా ఉంచుకోవాలి

చాలా సార్లు ఇల్లు తుడువడానికి ఉపయోగించే బకెట్‌ పాతది, కాస్త మురికి పేరుకుపోయినవి వాడుతుంటారు. అలా చేయడం ద్వారా మురికి లేదా దుర్వాసన ఇంటిని పాడు చేస్తుంది. ప్రతిసారి ఉపయోగించే ముందు బకెట్‌ను బాగా కడిగిన తరువాతే ఎసెన్షియల్ ఆయిల్ డ్రాప్స్ అందులో కలపాలి. దాంతో సువాసన ఎక్కువ సేపు ఉంటుంది. 

శుభ్రం చేసిన తర్వాత కిటికీలు తెరవండి

ఇల్లు తుడిచిన తర్వాత కొన్ని నిమిషాల మీ ఇంటి కిటికీలు తెరిచి ఉంచాలి. తాజా గాలితో పాటు సువాసనను ఇల్లు మొత్తం సులభంగా వ్యాపింపజేస్తుంది. మీకు కొంచెం రిఫ్రెష్‌మెంట్ అనిపిస్తుంది. 

ఈ ఒక్క దానితో పెరగనున్న ప్రభావం 

నేల మీద దుర్వాసనను పూర్తిగా తొలగించాలంటే, తుడుచే నీటిలో ఒక టీస్పూన్ వైట్ వెనిగర్ కూడా కలపవచ్చు. ఇది నేలపై ఉన్న మొండి మరకలు, దుర్వాసన లేకుండా చేయడంలో సహాయపడుతుంది. తద్వారా ఎసెన్షియల్ ఆయిల్ సువాసన గతంలో వాడిన కెమికల్స్ కంటే ఎక్కువసేపు ఉంటుంది. అవసరమైతే  కొన్ని చుక్కల మైల్డ్ లిక్విడ్ సోప్ కలుపుకున్నా పరవాలేదు. అయితే నెలకోసారి కాకుండా మూడు రోజులకు ఓసారి, కనీసం వారానికి ఒకసారైనా తడి గుడ్డతో ఇల్లు తుడుచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Frequently Asked Questions

ఇల్లు తుడిచిన తర్వాత సువాసన ఎక్కువసేపు ఉండాలంటే ఏం చేయాలి?

గోరువెచ్చని నీటిలో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు కలిపి ఇల్లు తుడవండి. నేల ఆరిపోయిన తర్వాత కూడా సహజమైన సువాసన ఎక్కువసేపు ఉంటుంది.

ఇల్లు తుడవడానికి ఏ ఎసెన్షియల్ ఆయిల్స్ మంచివి?

లావెండర్, లెమన్‌గ్రాస్, యూకలిప్టస్, ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్స్ మంచి ఎంపికలు. వాటి సువాసన ప్రశాంతంగా ఉండి, ఎక్కువ మోతాదు అవసరం ఉండదు.

ఎసెన్షియల్ ఆయిల్ సువాసనను ఎక్కువసేపు ఉంచడానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా?

ఇల్లు తుడిచేటప్పుడు గోరువెచ్చని నీరు వాడాలి. నీటిలో వైట్ వెనిగర్ కలిపితే దుర్వాసన పోయి, సువాసన ఎక్కువ కాలం ఉంటుంది. తుడిచాక కిటికీలు తెరవండి.

ఇల్లు తుడవడానికి గోరువెచ్చని నీళ్లు ఎందుకు ఉపయోగించాలి?

గోరువెచ్చని నీటితో ఎసెన్షియల్ ఆయిల్ సువాసన మరింత బాగా వ్యాపిస్తుంది. వేడి కారణంగా, దాని సువాసన గది మొత్తం వ్యాపించి ఎక్కువసేపు ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

House Cleaning Tips: ఇల్లు తుడిచినా సువాసన రావడం లేదా నీళ్ల బకెట్‌లో ఇది కలిపి చూడండి, రోజంతా రీఫ్రెష్
ఇల్లు తుడిచినా సువాసన రావడం లేదా నీళ్ల బకెట్‌లో ఇది కలిపి చూడండి, రోజంతా రీఫ్రెష్
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
Indoor Pure Air Tips: ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Embed widget