అన్వేషించండి

House Fly Control Tips: ఇంట్లో ఈగలు పోవడం లేదా? శాశ్వతంగా వదిలించుకునే సీక్రెట్ టిప్స్ ఇవే!

Home Cleaning Tips: ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా, ఎన్నిసార్లు తుడిచినా ఈగలు వదలవు. గుంపులు గుంపులుగా ఇంట్లో చికాకు కలిగిస్తుంటాయి. శుభ్రం చేసిన తర్వాత కూడా ఈగలు ఎందుకు వస్తున్నాయని ఆశ్చర్యపోతుంటారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శుభ్రం చేసినా ఫ్లోర్ తేమ, ఆహార వ్యర్థాలు ఈగలను ఆకర్షిస్తాయి.
  • తులసి, లావెండర్ వంటి మొక్కలు ఈగలను సమర్థవంతంగా దూరం చేస్తాయి.
  • మూసి ఉన్న చెత్తబుట్టలు, డోర్ నెట్స్ ఈగల నివారణకు అవశ్యం.

Why Do Flies Appear After Mopping: ఫ్లోర్ క్లీనింగ్ అనేది ఇంటిని క్లీన్ చేయడంలో ఒక రోజువారీ భాగం. కానీ కొన్నిసార్లు, ఫ్లోర్‌ మెరిసిన కొద్దిసేపటికే ఈగలు గుంపులు గుంపులుగా ఇంట్లోకి రావడం మొదలుపెడతాయి. శుభ్రం చేసిన తర్వాత కూడా ఈగలు ఎందుకు వస్తున్నాయని తెలియక చాలా మంది తలలు పట్టుకుంటా ఉంటారు. నిజానికి, కేవలం ఫ్లోర్‌ క్లీనింగ్ వల్ల ఈగల సమస్య పూర్తిగా తొలగిపోదు. ఇంట్లో వాటిని ఆకర్షించే కొన్ని వస్తువులు ఉంటే, అవి మళ్లీ మళ్లీ తిరిగి వస్తాయి.

ఈగలు ఎందుకు వస్తాయి?

కుళ్ళిపోయిన ఆహారం, ఆరుబయట పడి ఉన్న చెత్త, తడి చెత్త లేదా పెంపుడు జంతువుల వ్యర్థాలు ఉన్న ప్రదేశాలకు ఈగలు ఎక్కువగా వస్తుంటాయి. అంతేకాకుండా, ఫ్లోర్ తుడిచిన తర్వాత నేలపై లేదా మూలల్లో అధిక తేమ కూడా ఈగలను ఆకర్షిస్తుంది. రాత్రిపూట ప్రకాశవంతమైన దీపాలు కూడా తరచుగా ఈగలను  ఇతర కీటకాలను ఆకర్షిస్తాయి. 

Also Read:ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు! 

వాటిని ఎలా వదిలించుకోవచ్చు?

ఈగలు మిమ్మల్ని పదేపదే ఇబ్బంది పెడుతుంటే, కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఉపశమనాన్ని అందిస్తాయి. తులసి, లావెండర్, బంతి పువ్వు, పార్స్లీ వంటి మొక్కల వాసన ఈగలకు నచ్చదు. వీటిని మీ బాల్కనీ, కిటికీ లేదా ప్రవేశ ద్వారం వద్ద ఉంచడం వల్ల ఈగల సంఖ్యను తగ్గించవచ్చు. చిన్న ఈగలను వదిలించుకోవడానికి వెనిగర్ , లిక్విడ్‌ డిష్ సోప్ మిశ్రమం కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఒక గ్లాసులో సమాన పాళ్లలో నీరు, వెనిగర్ కలిపి, కొన్ని చుక్కల లిక్విడ్‌ డిష్ సోప్ యాడ్ చేయండి. గ్లాసును ప్లాస్టిక్ ర్యాప్‌తో కప్పి, పైభాగంలో చిన్న రంధ్రాలు చేయండి. వెనిగర్ వాసన ఈగలను ఆకర్షిస్తుంది, కానీ డిష్ సోప్ వాటిని వదిలి వెళ్ళకుండా నివారిస్తుంది. 

Also Read: అధిక ధరలకు చెక్.. డిప్రెషన్, డయాబెటిస్, గుండె సహా 39 మెడిసిన్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం

దుకాణాలలో లభించే జిగురు ఉచ్చులు, ఎలక్ట్రిక్‌ లైట్‌ ఉచ్చులు, ఇంటి లోపల వాడే కొన్ని లిక్విడ్స్‌ కూడా ఈగలను నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే, ఈ లిక్విడ్స్ ఎల్లప్పుడూ సూచనల ప్రకారం ఉపయోగించాలి. గదికి మంచి వెంటిలేషన్ ఉండాలి. 

ఈ వస్తువులను శుభ్రపరచడం చాలా అవసరం.

ఈగలను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం, అవి ఇంట్లోకి ప్రవేశించకుండా, సంతానోత్పత్తి చేయకుండా నిరోధించడమే. దీనికోసం, కిటికీలు, డోర్ నెట్స్‌ సరిగా ఉంచుకోండి. చెత్తబుట్టలను ఎల్లప్పుడూ మూసి ఉంచండి, తడి వ్యర్థాలను ఇంట్లో ఎక్కువ సేపు నిల్వ ఉంచవద్దు,  ఆహారాన్ని ఎల్లప్పుడూ గాలి చొరబడని డబ్బాలలో నిల్వ చేయండి. అదనంగా, మురికి పాత్రలను సింక్‌లో ఎక్కువ సేపు వదిలివేయవద్దు, కుళ్ళిపోతున్న ఆకులు లేదా సేంద్రియ వ్యర్థాలను ఇంటి చుట్టూ ఉండనివ్వవద్దు.

Also Read: వర్షాకాలంలో కడుపులో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే ఈ పనులు చేయండి                      

Frequently Asked Questions

ఈగలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి?

కుళ్ళిన ఆహారం, చెత్త, పెంపుడు జంతువుల వ్యర్థాలు ఈగలను ఆకర్షిస్తాయి. నేలపై అధిక తేమ, రాత్రిపూట ప్రకాశవంతమైన దీపాలు కూడా ఈగల రాకకు కారణమవుతాయి.

ఈగలను వదిలించుకోవడానికి గృహ చిట్కాలు ఏమిటి?

తులసి, లావెండర్ వంటి మొక్కలు ఈగలకు నచ్చవు, వీటిని కిటికీల వద్ద ఉంచవచ్చు. వెనిగర్ మరియు లిక్విడ్ డిష్ సోప్ మిశ్రమాన్ని ఉపయోగించి చిన్న ఈగలను వదిలించుకోవచ్చు.

ఈగలు ఇంట్లోకి రాకుండా నివారించడానికి మార్గాలు ఏమిటి?

కిటికీలు, డోర్ నెట్స్ సరిగా ఉంచుకోండి. చెత్తబుట్టలు మూసి ఉంచి, తడి వ్యర్థాలను వెంటనే తొలగించండి. ఆహారాన్ని గాలి చొరబడని డబ్బాలలో నిల్వ చేయాలి.

టాప్ హెడ్ లైన్స్

Weight Loss Tips : వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
Samosa Chaat Recipe : ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు

వీడియోలు

IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget