అన్వేషించండి

NPPA New Drug Prices: అధిక ధరలకు చెక్.. డిప్రెషన్, డయాబెటిస్, గుండె సహా 39 మెడిసిన్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం

NPPA New Drug Prices: నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) డ్రగ్స్ (ప్రైసెస్ కంట్రోల్) ఆర్డర్ అంటే DPCO 2013 పరిధిలో అథారిటీ 39 కొత్త ఔషధాల రిటైల్ ధరలను నిర్ణయించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • NPPA 39 కొత్త ఔషధాల రిటైల్ ధరలు నిర్ణయించింది.
  • హైబీపీ, డయాబెటిస్, క్యాన్సర్ మందులు అందుబాటులోకి వస్తాయి.
  • దుకాణాల్లో ధరల జాబితా ప్రదర్శించాలి; అధిక ధరలకు జరిమానా.

NPPA New Drug Prices: దేశంలో సాధారణ పేషెంట్లకు మెడిసిన్ అధిక ధరల నుండి ఉపశమనం కలిగించడానికి నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) కీలక నిర్ణయం తీసుకుంది. అథారిటీ డ్రగ్స్ (ప్రైసెస్ కంట్రోల్) ఆర్డర్ అంటే DPCO 2013 పరిధిలో 39 కొత్త ఔషధాల రిటైల్ ధరలు నిర్ణయించింది. వీటిలో హై బ్లడ్ ప్రెషర్ (హై బీపీ), డయాబెటిస్, గుండె జబ్బులు (Heart Diseases), హెచ్‌ఐవి (HIV), కంటి ఇన్‌ఫెక్షన్లు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సలో వినియోగించే మెడిసిన్ ఉన్నాయి. ఈ ఔషధాలను రోగులకు మరింత అందుబాటు ధరల్లోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. 

ఇటీవల ఉత్తర్వులు జారీ

ఫార్మాస్యూటికల్స్ విభాగం తరపున 2026 జూలై 8న ఈ ధరల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దీనిని DPCO 2013 లో పారాగ్రాఫ్ 5, 11, 15 కింద నోటిఫై చేశారు. అయితే, మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఔషధాల ధరలను తగ్గించడానికి ఈ ఉత్తర్వులు కాదు. కొత్త ఔషధ ఫార్ములేషన్ల గరిష్ట రిటైల్ ధరలు నిర్ణయించడానికి జారీ చేశారని గమనించాలి. ఈ ధరలపై వర్తించే జీఎస్టీ (GST) అదనంగా వసూలు చేయనున్నారు.

పలు అవసరమైన ఔషధాల రిటైల్ ధరల నిర్ధారణ

NPPA విడుదల చేసిన జాబితాలో హై బ్లడ్ ప్రెషర్ (High BP) చికిత్సలో ఉపయోగించే Amlodipine+ Bisoprolol+ Telmisartan టాబ్లెట్ రిటైల్ ధరను ఒక్కో టాబ్లెట్‌కు రూ.14.74 గా నిర్ణయించారు. కంటి సర్జరీల తర్వాత, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల చికిత్సలో ఉపయోగించే Nepafenac+ Moxifloxacin Ophthalmic Solution మెడిసిన్ ధరను ప్రతి మిల్లీలీటర్‌కు రూ.68.64 గా నిర్ణయించారు. అలాగే గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఇచ్చే Clopidogrel+ Aspirin+ Atorvastatin ధరను ఒక్కో క్యాప్సూల్‌కు రూ6.37 గా ఫిక్స్ చేశారు.

Also Read: Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !

ఈ జాబితాలో డయాబెటిస్ చికిత్సలో ఉపయోగించే పలు ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ మెడిసిన్ ధరలను కూడా నిర్ణయించారు. వీటిలో Dapagliflozin, Metformin, Empagliflozin, Sitagliptin, Glimepiride తో పాటు Voglibose ఆధారిత ఔషధాలు ఉన్నాయి.

ఇవే కాకుండా ఇన్‌ఫెక్షన్ల చికిత్సలో ఉపయోగించే Amoxicilline+ Clavulanate టాబ్లెట్లు, డిస్పర్సిబుల్ టాబ్లెట్లు, గ్లకోమా చికిత్సలో ఉపయోగించే ఐ డ్రాప్స్, HIV థెరపీ కిట్లు, విటమిన్ డి3 ఓరల్ సొల్యూషన్, క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఉపయోగించే Imatinib Oral Solution వంటి మెడిసిన్ ధరలను కూడా నిర్ణయించారు. వీటితో పాటు NPPA జాబితాలో అత్యంత ఖరీదైన ఔషధాలలో Tenecteplase (TNK-tpa) Injection 50mg ఉంది. గుండెపోటు చికిత్సలో వినియోగించే ఈ ఇంజెక్షన్ రిటైల్ ధరను ఒక్కో వయల్ (Vial) కు రూ.60,238.27 గా నిర్ణయించారు.

దుకాణదారులు ప్రైస్ లిస్ట్‌ను ప్రదర్శించాలి

తయారీ కంపెనీలు జారీ చేసిన ప్రైస్ లిస్ట్‌ను రిటైలర్లు, డీలర్లు అందరూ తమ దుకాణాల్లో ప్రదర్శించడం తప్పనిసరి అని NPPA మరోసారి స్పష్టం చేసింది. DPCO 2013 లోని పేరా 24 (4) ను ఉటంకిస్తూ, ప్రతి రిటైలర్, డీలర్ తమ దుకాణంలో కస్టమర్లకు సులభంగా కనిపించేలా ఈ ధరల జాబితాను, అనుబంధ ధరల జాబితాను ఉంచాలని అథారిటీ పేర్కొంది.

Also Read: Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 

నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు

నోటిఫై చేసిన రిటైల్ ధరను ఏదైనా తయారీ లేదా మార్కెటింగ్ కంపెనీ ఉల్లంఘించి, ఎక్కువ వసూలు చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. NPPA ప్రకారం.. ఒకవేళ ఈ ఔషధాల రిటైల్ ధరలను ఈ ఉత్తర్వులు, అందులోని నోటీసుల ప్రకారం నిర్ణయించకపోతే, సంబంధిత కంపెనీ DPCO 2013..  ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 రూల్స్ ప్రకారం ఎక్కువ వసూలు చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది. 

Frequently Asked Questions

NPPA తీసుకున్న ఈ నిర్ణయం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?

ఔషధాల అధిక ధరల నుండి సాధారణ రోగులకు ఉపశమనం కలిగించడం, హై బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి తీవ్రమైన వ్యాధులకు వినియోగించే మందులను అందుబాటు ధరల్లోకి తీసుకురావడమే NPPA ప్రధాన లక్ష్యం.

NPPA నిర్ణయించిన ధరల పరిధిలోకి ఏ రకమైన ఔషధాలు వస్తాయి?

హై బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, గుండె జబ్బులు, హెచ్‌ఐవి, కంటి ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే 39 కొత్త ఔషధాల రిటైల్ ధరలను NPPA నిర్ణయించింది.

ఈ కొత్త నిబంధనలు ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఔషధాల ధరలను తగ్గిస్తాయా?

కాదు, ఈ ఉత్తర్వులు మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఔషధాల ధరలను తగ్గించడానికి కాదు. కొత్త ఔషధ ఫార్ములేషన్ల గరిష్ట రిటైల్ ధరలను నిర్ణయించడానికి వీటిని జారీ చేశారు.

నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే కంపెనీలకు ఏమవుతుంది?

నోటిఫై చేసిన రిటైల్ ధరను ఉల్లంఘించి ఎక్కువ వసూలు చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. లేనిచో చట్టపరమైన చర్యలు ఉంటాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget