అన్వేషించండి

Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !

Cancer Risk Study: ఆఫీసులో ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఇంటి నుంచి పని చేయడం, టీవీ చూడటం లేదా మొబైల్‌పై నిరంతరం సమయం గడపడం ప్రజల దినచర్యలో భాగమైపోయింది.

Prolonged Sitting Cancer Risk Study: నేటి వేగవంతమైన జీవితంలో, గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం సర్వసాధారణమైపోయింది. ఆఫీసులో కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం, ఇంటి నుంచి పని చేయడం, టీవీ చూడటం లేదా మొబైల్ ఫోన్‌లతో సమయం గడపడం ప్రజల దినచర్యలో భాగమైపోయింది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని ఇదివరకే తేలింది. ఇప్పుడు, ఒక కొత్త అధ్యయనం ప్రకారం, లేవకుండా 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు నిరంతరాయంగా కూర్చోవడం వల్ల క్యాన్సర్‌తో మరణించే ప్రమాదం కూడా పెరుగుతుందని వెల్లడైంది. 

12 సంవత్సరాలుగా ఆరోగ్యం పర్యవేక్షణ

గ్లాస్గో విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నిర్వహించి, PLOS మెడిసిన్ అనే వైద్య పత్రికలో ప్రచురించిన ఈ అధ్యయనం, యూకే బయోబ్యాంక్‌లో నమోదు చేసుకున్న 91,000 మందికి పైగా వ్యక్తుల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించింది. ముఖ్యంగా, పాల్గొన్నవారిని ప్రశ్నలు అడగడమే కాకుండా, వారి వాస్తవ శారీరక కార్యకలాపాలు, వారు కర్చునే సమయాన్ని నమోదు చేసేందుకు, ఒక వారం పాటు ధరించడానికి మణికట్టు ట్రాకర్‌లను కూడా ఇచ్చారు. ఆ తర్వాత సుమారు 12 సంవత్సరాల పాటు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు.

ఏ వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ 

రోజంతా పదేపదే 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు కూర్చునే వ్యక్తులకు క్యాన్సర్ మరణ ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. పరిశోధకుల ప్రకారం, ఎక్కువ సేపు కూర్చునే ప్రతి అదనపు గంటకు ఈ ప్రమాదం సుమారుగా 9 నుంచి 10 శాతం పెరుగుతుంది. ఆసక్తికరంగా, రోజంతా కూర్చున్న మొత్తం గంటల సంఖ్య కంటే, లేవకుండా కూర్చున్న గంటల సంఖ్య ఎక్కువ ప్రభావం చూపింది. 

మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?

అయితే, ఈ పరిశోధన కొన్ని గుడ్‌న్యూస్‌ కూడా చెప్పింది. ఎక్కువసేపు కూర్చోవడానికి బదులుగా మధ్యమధ్యలో తేలికపాటి కార్యకలాపాలు చేయడం వల్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అధ్యయనం ప్రకారం, ఒక గంట పాటు నిరంతరాయంగా కూర్చోవడానికి బదులుగా, చిన్నగా నడవడం, ఇంటి పనులు చేసుకోవడం లేదా అటూ ఇటూ తిరగడం వంటి తేలికపాటి శారీరక కార్యకలాపాలు చేయడం వల్ల క్యాన్సర్ మరణ ప్రమాదాన్ని సుమారు 12 శాతం తగ్గించవచ్చు. అదే సమయంలో, సుమారు 30 నిమిషాల పాటు వేగంగా నడవడం వంటి కార్యకలాపాలు ఈ ప్రమాదాన్ని సుమారు 8 శాతం తగ్గించగలవు. అంతేకాకుండా, కేవలం 5 నిమిషాల తీవ్రమైన వ్యాయామం కూడా క్యాన్సర్ మరణ ప్రమాదాన్ని 22 శాతం తగ్గించడంతో సంబంధం కలిగి ఉంది.

అలవాట్లను కూడా మార్చుకోవాలి

గ్లాస్గో విశ్వవిద్యాలయంలో పబ్లిక్ హెల్త్ సీనియర్ లెక్చరర్ అయిన డాక్టర్ ఫ్రెడరిక్ హో ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు. ప్రజలు కేవలం క్రమం తప్పని వ్యాయామంపైనే కాకుండా, ఎక్కువ సేపు కూర్చునే అలవాటును మార్చుకోవడంపై కూడా దృష్టి పెట్టాలని ఆయన అంటున్నారు. ఎవరైనా ప్రతి అరగంటకు జిమ్‌కు వెళ్లలేకపోయినా, ప్రతి అరగంటకు ఒకసారి లేచి కొన్ని నిమిషాలు నడవడం లేదా తేలికపాటి కార్యకలాపాలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల కండరాల పనితీరు తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది రక్తంలో చక్కెర సమతుల్యతను దెబ్బతీస్తుంది, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. శరీరంలో వాపును వేగవంతం చేస్తుంది. అయితే, ఈ అధ్యయనం కేవలం ఒక సహసంబంధాన్ని మాత్రమే చూపిస్తుందని, ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల నేరుగా క్యాన్సర్ మరణాలు సంభవిస్తాయని నిరూపించదని పరిశోధకులు స్పష్టం చేశారు.

గమనిక: ఈ సమాచారం పరిశోధన అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయంపై ఆధారపడి ఉంది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా కొత్త కార్యాచరణ చేపట్టే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని లేదా సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Frequently Asked Questions

మొత్తం కూర్చున్న సమయం కంటే, నిరంతరాయంగా కూర్చున్న సమయం ఎక్కువ ప్రభావం చూపుతుందా?

అవును, రోజంతా కూర్చున్న మొత్తం గంటల సంఖ్య కంటే, లేవకుండా కూర్చున్న గంటల సంఖ్య క్యాన్సర్ మరణ ప్రమాదంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని పరిశోధకులు కనుగొన్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget