Habit of Shaking Legs While Sitting: కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతున్నారా? ఈ అలవాటు మీ లక్, ఆరోగ్యం, భవిష్యత్తును ఎలా మార్చేస్తుందో తెలుసా?
Leg Shaking Habit: కాళ్లు ఊపే అలవాటు చాలామందికి ఉంటుంది. కొందరికి ఏకంగా అలవాటుగా మారిపోతుంది. కాసేపు కూడా కుదురుగా కూర్చోలేరు. ఇంతకీ ఈ అలవాటు మంచిదేనా?

Habit of shaking legs while sitting: మంచంపై కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా, సోఫాపై కూర్చున్నా.. ఆపకుండా కాళ్లూపే అలవాటు కొందరికి ఉంటుంది. కాసేపు కూడా కాలు కదపకుండా కూర్చోలేరు.. కొందరికి తమ కాలు కదుపుతున్నాం అనే ఆలోచన కూడా రాదు..అప్రయత్నంగా కాళ్లూపుతూనే ఉంటారు..అదో అలవాటుగా మారిపోతుంది. కేవలం కాళ్లు ముడుచుకుని కూర్చున్న కొద్దిక్షణాలు తప్ప..మిగిలిన సమయం మొత్తం కాళ్లూపుతూనే ఉంటారు..
ఈ అలవాటు మంచిదా, కాదా?
ఆధ్యాత్మికవేత్తలు ఏం చెబుతున్నారు?
ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?
కాళ్లు ఊపే అలవాటు శారీరీకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అస్థితరతను సూచిస్తుంది. పండితులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, ఆరోగ్య నిపుణులు దీనిని దోషంగా భావిస్తారు. దీనివెనుకున్న తాత్వికతను, ఆధ్యాత్మిక పరిణామాలను, ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా?
ఆధ్యాత్మిక దృక్పథం
మన శరీరం సూక్ష్మశక్తి కేంద్రం. ప్రాణశక్తి, కుండలిని, చక్రాలు స్థిరంగా ఉండాలంటే శరీరం శాంతంగా ఉండాలి. కాళ్లు ఊపడం చంచలత్వానికి నిదర్శనం..అంటే మనస్సు అస్థిరతను, ప్రాణశక్తి క్షయాన్ని సూచిస్తుంది
గ్రహాల ప్రభావం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ఈ అలవాటు.. చంద్రుడి స్థానాన్ని అశుభంగా మార్చేస్తుంది. చంద్రుడు మనఃకారకుడు అని చెబుతారు. చంద్రుడి స్థానం అశుభంగా మారడం అంటే జీవితంలో టెన్షన్, అశాంతి, అనవసర ఖర్చులు ఎదురవుతాయి. కెరీర్లో ముందు అడుగు వేసే అవకాశాలపై ప్రభావం పడుతుంది. సంపద తగ్గిపోతుంది.
ఆరోగ్యంపై ప్రభావం
శక్తి కాళ్ల ద్వారా భూమికి ప్రవహించాలి. అవసరంగా కాళ్లు ఊపడం వల్ల పాజిటివ్ ఎనర్జీ భంగపడుతుంది. ధ్యానం , ప్రార్థన , జపం సమయంలోనూ ఏకాగ్రత తగ్గిపోతుంది. రజోగుణాన్ని తగ్గించి సత్వగుణాన్ని పెంచుకోవాలంటే ఈ అలవాటు వదిలిపెట్టాలి
కాళ్లు ఊపడం అలవాటు కాదు లోపలి సమస్య
కాళ్లు ఊపే అలవాటు ఉన్నవారికి మంచి నిద్రపట్టదు. నిద్రపోయినా అలసటగా అనిపిస్తుంది, ఏకాగ్రత లోపిస్తుంది
ఐరన్ లోపం, డోపమిన్ అసమతుల్యత, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు వస్తాయి
ఇంకా..రక్తప్రసరణ సమస్యలు, హృదయ సంబంధిత సమస్యలు, మూడ్ స్వింగ్స్ ఎదురవుతాయి
ఆయుర్వేదం ప్రకారం ఈ అలవాటు వాతదోషాన్ని పెంచుతుంది. శరీరంలో అస్థిరత, నొప్పులు, జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది.
ఏం చేయాలి?
కాళ్లు ఊపుతున్నప్పుడు మీకు మీరే గమనించి ఆపేందుకు ప్రయత్నించండి. అలవాటుని అంత సులభంగా వదులుకోలేరు..అందుకే కాళ్లు ఊపాలి అనిపించినప్పుడు బదులుగా లోతైన శ్వాస తీసుకోండి. కాసేపు కాళ్లు ముడుచుకుని నేలపై కూర్చోండి. ధ్యానం చేయండి. గురు,రాహు, శని శాంతి మంత్రం జపించండి.
ఆరోగ్యపరంగా..ఐరన్, మెగ్నీషియం, విటమిన్ D చెక్ చేయించుకోండి. నిత్యం వ్యాయామం చేయండి
కూర్చునేటప్పుడు పాదాలు స్థిరంగా ఉంచండి..శాంతం భవ అనిమనసులో జపించండి
ఈ అలవాటు చిన్నదిగా కనిపించినా అంతర్గతంగా మనసు, శరీరం, ఆత్మల సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది. స్థిరత్వం ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక ప్రగతి సాధించగరు. ఈ అలవాటు వదిలితేనే సంపద, ఆరోగ్యం, కెరీర్లో ఉన్నతి లభిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.
శరీరం స్థిరమైతే మనస్సు స్థిరమవుతుంది - మీకు ఈ అలవాటు ఉంటే మార్చుకునేందుకు ఈ క్షణం నుంచి ప్రయత్నించండి
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
Before You Go
Vinayaka Chavithi 2025 Bala Gangadhar Tilak Ganesh Festivals History | చవితి ఉత్సవాలను ప్రారంభించిన వ్యక్తి తిలక్ | ABP Desam
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















