అన్వేషించండి

Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?

Harish Rao 15km Farmers Padayatra: సిద్దిపేటలో హరీష్ రావు 15 కి.మీ పాదయాత్రకు భారీ స్పందన వచ్చింది. దీంతో హరీష్ వ్యూహాలపై బీఆర్ఎస్‌లో సంచలన చర్చ జరుగుతోంది.

BRS Internal Politics Harish Rao:   తెలంగాణ రాజకీయాల్లో  ట్రబుల్ షూటర్ గా, గ్రౌండ్ లెవల్ మాస్ లీడర్‌గా చెరగని ముద్ర వేసుకున్న మాజీ మంత్రి  హరీష్ రావు వైఖరి ఇప్పుడు గులాబీ శ్రేణుల్లోనే కాకుండా, ప్రత్యర్థి వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.  సిద్దిపేట జిల్లా మండల స్థాయిలో హరీష్ రావు చేపట్టిన 15 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు రైతులు, ప్రజల నుంచి ఊహించని స్థాయిలో అపూర్వ స్పందన లభించింది. కాళేశ్వరం పంపులను వెంటనే ప్రారంభించి, గొదావరి జలాలతో రంగనాయక సాగర్‌ను నింపాలని డిమాండ్ చేస్తూ ఆయన నిర్వహించిన ఈ యాత్ర.. కేవలం ఒక మండల స్థాయి నిరసనలా కాకుండా, ఒక రాష్ట్ర స్థాయి ప్రజా ఉద్యమాన్ని తలపించేలా జనసందోహాన్ని ఆకర్షించింది.

హరీష్ క్రేజ్‌కు సంకేతమా? 

కేవలం ఒక మండల స్థాయిలోనే హరీష్ పిలుపునకు ఈ స్థాయిలో జనం తరలివస్తే.. ఒకవేళ ఇదే పాదయాత్రను ఆయన నియోజకవర్గ స్థాయికో లేక రాష్ట్ర స్థాయికో విస్తరిస్తే ఉండే  మాస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో గట్టిగా నడుస్తోంది. సోషల్ మీడియా బిల్డప్‌లు, పెయిడ్ ప్రచారాల కంటే క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉండే లైవ్ కనెక్టివిటీయే నాయకుడి అసలైన బలం అని హరీష్ రావు మరొకసారి నిరూపించారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చాలామంది కీలక నేతలు వ్యూహాత్మక మౌనం దాల్చినా , సోషల్ మీడియా వేదికలకే పరిమితమైనా.. హరీష్ రావు మాత్రం రోడ్డెక్కి రైతు సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయి పోరాటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

హరీష్ చుట్టూ ఎప్పుడూ పొలిటికల్ ట్రాప్ 

అయితే, హరీష్ రావు ఏం చేసినా సరే ఆయన చుట్టూ రకరకాల రాజకీయ ఊహాగానాలు, అంతర్గత సమీకరణల ప్రచారాలు ముసురుకోవడం పరిపాటిగా మారింది. ప్రజాక్షేత్రంలో ఆయన చురుగ్గా ఉంటూ భారీగా జనాన్ని సమీకరిస్తే..  పార్టీతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్, పర్సనల్ బ్రాండ్ పెంచుకోవడానికి యత్నిస్తున్నారు  అని సొంత పార్టీలోని కొందరు వ్యతిరేక వర్గీయులు ముద్రవేసే యత్నం చేస్తారు. అదే సమయానికి ఆయన కొద్దిరోజులు సైలెంట్‌గా ఉంటే.. పార్టీ నాయకత్వంపై అలిగారు, విముఖతతో ఉన్నారు అంటూ ప్రత్యర్థులు ప్రచారం మొదలుపెడతారు. ఈ రెండింటి మధ్య హరీష్ రావు సమన్వయం పాటిస్తూ, తన పని తాను చేసుకుపోతుండటం ఆయన పరిణతికి నిదర్శనం.

హరీష్ ప్లాన్లు పార్టీ కోసమే 

 హరీష్ రావు అంతర్గత వ్యూహాలు ఎప్పుడూ అంత సులభంగా బోధపడవు. ఒకవేళ హరీష్ రావు ఆలోచన ధోరణిలో చిన్నపాటి మార్పు వచ్చినా లేదా ఆయన వేరే రాజకీయ ఆలోచనల్లో ఉన్నారనే అనుమానం బీఆర్ఎస్ హైకమాండ్‌కు వస్తే.. అది కేవలం ఆ పార్టీలోనే కాక మొత్తం తెలంగాణ రాజకీయ యవనికపైనే ఒక భారీ పొలిటికల్  పెను భూకంపం  సృష్టిస్తుందనడంలో సందేహం లేదు. గులాబీ దళంలో అత్యంత కేడర్ బేస్, మాస్ అప్పీల్ ఉన్న నేత కావడంతో.. ఆయన ప్రతి కదలికపై ప్రగతి భవన్ నుంచి ఫామ్‌హౌస్ వరకు, గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు నిరంతరం నిఘా మరియు చర్చ నడుస్తూనే ఉంటాయి. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతుల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను ఆయుధంగా మలుచుకోవడంలో హరీష్ రావు సక్సెస్ అవుతున్నారు. పార్టీ పదవుల హోదా కంటే, ప్రజల్లో తనకున్న అసలైన  గ్రౌండ్ పవర్  ఏంటో నిరూపించుకోవడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. సిద్దిపేట పాదయాత్ర ద్వారా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికే కాదు, సొంత పార్టీలోని తన వ్యతిరేకులకు కూడా స్పష్టమైన సంకేతాలు పంపారని భావించవచ్చు.  మాస్ లీడర్‌షిప్‌కు ప్రత్యామ్నాయం లేదని ఆయన క్షేత్రస్థాయి ఫలితాల ద్వారా చాటిచెబుతున్నారు.

కేసీఆర్ చెప్పకపోతే నియోజకవర్గం దాటి బయటకు పోరు! 

 హాగానాలు, రాజకీయ విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా హరీష్ రావు తన సొంత శైలిలోనే  రైతు పోరాట బాట  పట్టారు. రాబోయే రోజుల్లో ఈ పాదయాత్రలను ఇతర నియోజకవర్గాలకు విస్తరిస్తే, అది బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన పునరుత్తేజంగా మారే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రజాదరణను పార్టీ నాయకత్వం ఎలా స్వీకరిస్తుంది, హరీష్‌ను ఏ రకంగా ముందుకు నడిపిస్తుంది అనేదానిపైనే బీఆర్ఎస్ భవిష్యత్ రాజకీయ వ్యూహాలు ,  తెలంగాణ రాజకీయ సమీకరణలు ఆధారపడి ఉన్నాయి.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Embed widget