అన్వేషించండి

Telangana Political Narrative : రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?

Congress Coordination: తెలంగాణలో అప్పులపై సాగుతున్న ఓపెన్ డిబేట్ రాజకీయం కాంగ్రెస్‌కు సెల్ఫ్ గోల్‌గా మారింది. సీఎం రేవంత్ స్ట్రాటజీని అర్థం చేసుకోకుండా మంత్రులు బీఆర్ఎస్ ట్రాప్‌లో పడిపోయారు.

Telangana Congress Coordination Failure Debts Open Debate:  తెలంగాణ రాజకీయాల్లో గత రెండు రోజులుగా నడుస్తున్న  ఓపెన్ డిబేట్  హైడ్రామా అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో తీవ్ర చర్చకు దారితీసింది. అప్పుల లెక్కల విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వేసిన అడుగులు, చివరకు అధికార పార్టీనే డిఫెన్స్‌లోకి నెట్టేలా మారడం వెనుక ఒక స్పష్టమైన సమన్వయ లోపం  కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  ఆలోచించే పొలిటికల్ స్ట్రాటజీ ఒకలైన్ లో ఉంటే.. క్యాబినెట్ మంత్రులు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు మరొకలా ఉండటమే ఈ పొలిటికల్ మిస్-ఫైర్‌కు ప్రధాన కారణమని భావిస్తున్నారు.

అసెంబ్లీ వేదికగా చర్చలకు రేవంత్ సవాల్ 

నిజానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటరీ, అసెంబ్లీ సాంప్రదాయాలను బాగా వంటబట్టించుకున్న నేత. ఆయన ప్రతిపక్షాలకు విసిరే సవాళ్లు ఎప్పుడైనా సరే  అసెంబ్లీ వేదికగానే ఉంటాయి. ఎందుకంటే, అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా అధికారిక డేటా, స్పీకర్ పోడియం, మైక్ కంట్రోల్ ఉండే సభలోనే చర్చకు ప్రాధాన్యత ఇస్తుంది. సభలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, శ్వేతపత్రం ఇచ్చినప్పుడు ప్రతిపక్షాన్ని కార్నర్ చేయడం ఈజీ. రేవంత్ రెడ్డి కాన్సెప్ట్ కూడా అదే.  దమ్ముంటే అసెంబ్లీకి రండి, తేల్చుకుందాం  అనడం వెనుక పూర్తి హోంవర్క్, అధికారిక అధికారాలు ఉంటాయి.  సీఎం రేవంత్ రెడ్డి మైండ్ గేమ్‌ను, ఆయన అండర్ కరెంట్ స్ట్రాటజీని అర్థం చేసుకోవడంలో సీనియర్ మంత్రులు పూర్తిగా విఫలమయ్యారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన పొలిటికల్ స్టేట్‌మెంట్‌ను వ్యక్తిగత సవాల్‌గా తీసుకుని కొందరు మంత్రులు రోడ్డుపైకి రావడం కాంగ్రెస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది.

జూపల్లి ప్రకటనను అడ్వాంటేజ్‌గా తీసుకున్న బీఆర్ఎస్ 

మంత్రి జూపల్లి కృష్ణారావు ఏకపక్షంగా  నేనే తెలంగాణ భవన్‌కు వస్తా అని ప్రకటించడం, ఆ తర్వాత గన్ పార్క్ అమరవీరుల స్థూపం అనడం, చివరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వేదికను మార్చడం వంటి పరిణామాలు అధికార పార్టీలో ఉన్న అభద్రతా భావాన్ని, అయోమయాన్ని క్యాడర్‌కు స్పష్టం చేశాయి. సీఎం ఒక వ్యూహంతో ముందుకు వెళ్తుంటే, మంత్రులు వ్యక్తిగత ప్రతిష్టల కోసం వీధి చర్చలకు వేదికలు ప్రకటించి చివరకు పోలీసు బలగాల సహాయంతో ప్రతిపక్ష నేతలను గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేయించాల్సి వచ్చింది. సవాల్ విసిరిన అధికార పార్టీనే చివరకు శాంతిభద్రతల పేరుతో వెనక్కి తగ్గడం ద్వారా బీఆర్ఎస్‌కు అనూహ్యమైన పొలిటికల్ మైలేజ్ లభించింది.

కాంగ్రెస్ రాజకీయ పరిస్థితుల్ని వినియోగించుకున్న కేటీఆర్, హరీష్ రావు 

ఈ సమన్వయ లేమిని పక్కాగా ఉపయోగించుకోవడంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు నూటికి నూరు శాతం సఫలమయ్యారు. జూపల్లి కోసం తెలంగాణ భవన్‌లో ఖాళీ కుర్చీ వేసి మీడియా ముందు కూర్చోవడం ద్వారా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా పంపారు. మరోవైపు హరీష్ రావు ఆర్‌బీఐ, కాగ్ నివేదికలతో పాటు స్వయంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన పాత వీడియో క్లిప్పింగ్స్‌ను వాట్సాప్ ద్వారా జూపల్లికి పంపి,  ప్రభుత్వ డేటాలోనే స్పష్టత లేదు, మీ మంత్రుల వద్ద సరైన లెక్కలు లేవు  అని నిరూపించే ప్రయత్నం చేశారు. దీనివల్ల కాంగ్రెస్ నేతలు హోంవర్క్ లేకుండా ఆవేశపడ్డారనే ఇంప్రెషన్ పడింది.

కాంగ్రెస్ అంతర్గత సమన్వయలోపాన్ని దిద్దుకోవాల్సిందే! 

కాంగ్రెస్ అధిష్టానం , సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఈ అంతర్గత సమన్వయ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం కనిపిస్తోందంటున్నారు.  అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం విసిరే ప్రతి చిన్న ట్రాప్‌లోనూ మంత్రులు చిక్కుకుపోతే.. ప్రభుత్వ పాలన పక్కకుపోయి కేవలం రోజువారీ వివాదాలకే పరిమితం కావాల్సి వస్తుంది. ప్రెస్ మీట్లు, వీధి సవాళ్ల ద్వారా అప్పుల లెక్కలు తేలవనే కనీస సత్యాన్ని మంత్రులు గుర్తించాలి. ఇలాంటి విషయాలను శాసనసభ వేదికగానే ఎదుర్కోవాలనే రేవంత్ రెడ్డి మార్క్ రూట్‌ను మంత్రులు ఎప్పుడు తెలుసుకుంటారు? ఒక పద్ధతి ప్రకారం పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లకుంటే.. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఇలాంటి మరిన్ని మైండ్ గేమ్స్‌తో అధికార పార్టీని నిరంతరం డిఫెన్స్‌లోకి నెడుతూనే ఉంటుంది. 

టాప్ హెడ్ లైన్స్

AP New Political Parties: ఏపీలో కొత్త పార్టీల హడావుడి - రాజకీయం అంటే అంత సులువా? టీడీపీ, వైసీపీ ఓట్లను చీల్చగలవా?
ఏపీలో కొత్త పార్టీల హడావుడి - రాజకీయం అంటే అంత సులువా? టీడీపీ, వైసీపీ ఓట్లను చీల్చగలవా?
KTR Complaints to Rahul Gandhi: రేవంత్‌పై రాహుల్‌కు కేటీఆర్ వరుస ఫిర్యాదులు - చర్యలు తీసుకోరని తెలిసీ బిఆర్ఎస్ వేస్తున్న మైండ్ గేమ్ ఏంటి?
రేవంత్‌పై రాహుల్‌కు కేటీఆర్ వరుస ఫిర్యాదులు - చర్యలు తీసుకోరని తెలిసీ బిఆర్ఎస్ వేస్తున్న మైండ్ గేమ్ ఏంటి?
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
Embed widget