అన్వేషించండి

CM Revanth Reddy Miyapur Speech: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!

Revanth Reddy Challenges KCR Modi: మియాపూర్‌లో జరిగిన ప్రజా పాలన సభలో సీఎం రేవంత్ప్ర తిపక్షాలపై విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి రాష్ట్రానికి నిధులు రాకుండా కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ఆరోపించారు.

Kishan Reddy Stopping Telangana Funds Revanth:  మియాపూర్‌లో నిర్వహించిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' బహిరంగ సభ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై  తీవ్ర విమర్శలు చేశారు.  ముఖ్యంగా కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన పదునైన విమర్శలు, సవాల్‌లు హాట్ టాపిక్ అవుతున్నాయి.  తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని విమర్శించారు.  

హైదరాబాద్ అభివృద్ధికి పక్కా ప్రణాళికలు

హైదరాబాద్ మహా నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న ఆరు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోందని, భవిష్యత్ అవసరాల కోసమే నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించామని తెలిపారు. ఢిల్లీలో కాలుష్యం, ముంబైలో వరదలు, బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలను ఉదహరిస్తూ.. హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితులు రాకుండా ఒక పద్ధతి ప్రకారం మెట్రో రెండో దశ విస్తరణ, గాజులరామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ బస్ టెర్మినల్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టబోతున్నామని ప్రకటించారు. జెండాలు, ఎజెండాలకు అతీతంగా నగరాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.

కిషన్ రెడ్డికి రాజకీయాలే ఎక్కువయ్యాయి! 

అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చేవెళ్ల, మెదక్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ ఎంపీలుగా గెలిచిన బీజేపీ నేతలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయని ధ్వజమెత్తారు. "కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ప్రధాని మోదీని తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఎందుకు అడగడం లేదు? రాష్ట్రానికి రావలసిన నిధులను రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా?" అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రధాని మోదీ గుజరాత్‌లోని సబర్మతి నదిని అభివృద్ధి చేసుకుంటే ఆహా ఓహో అనే వీరు.. తాము మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళ్లలో కట్టెలు పెడుతున్నది కిషన్ రెడ్డే 

బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య సాగుతున్న అంతర్గత బంధాన్ని ఎండగడుతూ ‘చీకటి ఒప్పందాల’పై సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము దిల్లీకి వెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంటే, దాన్ని చెడగొట్టడానికి కిషన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. "నేను ప్రధానిని కలిస్తే ఈయన పోయి కలుస్తాడు.. నేను కేంద్ర మంత్రిని కలిస్తే ఈయన పోయి కలుస్తాడు. తెలంగాణకు నిధులు రాకుండా, ప్రగతి జరగకుండా నిరంతరం కాళ్లలో కట్టెలు పెడుతున్నారు" అంటూ మండిపడ్డారు. కేసీఆర్, కిషన్ రెడ్డిల అవినీతి, అహంకార వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, ఇదే తీరు కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో ఇద్దరికీ తెలంగాణలో పుట్టగతులు లేకుండా ప్రజలు బుద్ధి చెబుతారని, మళ్లీ ఢిల్లీ మొహం చూడకుండా చేస్తారని హెచ్చరించారు.

పాలనపై చర్చకు సవాల్ 

రాష్ట్రంలో గత పదేళ్ల కేసీఆర్ పాలన, కేంద్రంలో పన్నెండేళ్ల మోదీ పరిపాలనతో పాటు కేవలం 30 నెలల తమ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎవరేం చేశారో, తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారో తేల్చుకుందాం రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తమ హయాంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరా మహిళా శక్తి ద్వారా స్టాల్స్, పెట్రోల్ బంకుల యాజమాన్య హక్కులు కల్పించామని గుర్తుచేశారు. విద్యార్థుల కోసం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామని చెబుతూ.. చేతనైతే అభివృద్ధికి సూచనలు చేయాలి తప్ప అడ్డుపడవద్దని హితవు పలికారు.   

లక్ష ఇళ్ల నిర్మాణం

 మహానగరంలో ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి విడిపించి, అక్కడ నిరుపేదల కోసం లక్ష ఎల్‌ఐజీ  , ఎమ్ఐజీ  ఇళ్లను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. గతంలో రాజీవ్ గృహకల్ప తరహాలోనే ఎక్కడికక్కడ పేదలకు సొంతింటి కలను నిజం చేస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే 24 నెలల కాలం కేవలం అభివృద్ధి, సంక్షేమంపైనే తమ ప్రభుత్వం పూర్తి దృష్టి సారిస్తుందని, రాజకీయ పగప్రతీకారాలకు తావులేకుండా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
నేడు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక భేటీ
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Telangana Graduate MLC Elections 2027: పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget