అన్వేషించండి

Rahul Gandhi Protest: ప్రధానమంత్రి నివాసానికి రాహుల్, ప్రియాంక ఎలా దూసుకొచ్చారు? వారిని మార్గమధ్యలోనే ఎందుకు అడ్డుకోలేదు?

నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక ప్రధానమంత్రి నివాసం వద్ద ధర్నా చేయడం సంచలనంగా మారింది. ఇలాంటి ప్రణాళికను ముందే ఎందుకు పసిగట్టలేకపోయారనే చర్చ జరుగుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ పేపర్ లీక్‌పై రాహుల్, ప్రియాంక ప్రధాని ఇంటి వద్ద ధర్నా.
  • ఖర్గే పుట్టినరోజు సాకుతో, ప్రణాళిక గోప్యంగా ఉంచి ధర్నా.
  • భద్రత ఛేదించి, చర్చలు విఫలమవగా, పోలీసులు బలవంతంగా తరలించారు.

Rahul Gandhi Protest: ప్రధానమంత్రితోపాటు మంత్రులు, ఎంపీల నివాసాల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఇంటి వైపుగా వెళ్లాలనే ఆలోచన రాక ముందే భద్రతా సిబ్బంది అడ్డుకుంటారు. దాదాపు కిలోమీటర్ దూరంలోనే అడ్డుకుంటారు. అలాంటి టైట్ సెక్యూరిటీ ఉన్న ఏరియాలోకి కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక తమ పార్టీ శ్రేణులతో ధర్నాకు దిగారు. మెరుపు ధర్నాతో సెక్యూరిటీ అంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. ఇలాంటి ధర్నాలు చేసే విషయంపై అధికార పార్టీకి ముందే ఉప్పు అందుతుంది. కానీ రాహుల్, ప్రియాంక చేపట్టే నిరసన గురించి ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. అయితే దీనిపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆసక్తికరమైన విషయం చెప్పారు. 

మెరుపు ధర్నాతో షాక్ ఇచ్చిన రాహుల్, ప్రియాంక

నీట్ ప్రశ్నాపత్రం లేకేజీ వ్యవహారంలో ఐదు డిమాండ్‌లు తెరపైకి తీసుకొచ్చిన కాంగ్రెస్‌ ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించింది. ఈ నిరసనకు రాహుల్ గాంధీ, ప్రియాంక ముందుండి నడిపించారు. అయితే ఈ మెరుపు ధర్నా గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఇది కాంగ్రెస్‌ నేతలతోపాటు పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది, ఇతర ఎంపీలను కూడా షాక్‌కి గురి చేసింది. కట్టుదిట్టమైన ప్రాంతంలోకి ఆందోళనకారులతో వెళ్లడమే కాకుండా అక్కడే ధర్నాకు కూర్చోవడం చిన్న విషయం కాదని అంటున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తే ఆఖరి నిమిషం వరకు ధర్నా విషయం ఎవరికీ తెలియదని అంటున్నారు. కాంగ్రెస్ ఎంపీలకి కూడా దీని గురించి సమాచారం లేదని చెబుతున్నారు. అందుకే ఆ ధర్నాలో కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రమే ఉన్నారు. 

ఆఖరి నిమిషం వరకు బయటకు పొక్కని ధర్నా ప్లాన్ 

ఇలాంటి టైట్ సెక్యూరిటీ ఉన్న ప్రాంతాల్లో ధర్నాలకు పిలుపునిచ్చినప్పుడు కచ్చితంగా గోప్యత అవసరమని చెబుతున్నారు. పార్టీలో కానీ బయట కానీ ఏ మాత్రం చర్చ జరిగినా అధికారి పార్టీ అలర్ట్ అవుతుందని దీంతో దిగ్బంధనం చేస్తుందని అంటున్నారు. అందుకే ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆఖరి నిమిషం వరకు గోప్యత పాటించామని అంటున్నారు. 

పుట్టిన రోజు పేరుతో డైవర్ట్‌

పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టిన రోజు సందర్భంగా ఎంపీలంతా ఆయన నివాసానికి రావాలని పార్టీ నుంచి సమాచారం వచ్చింది. ఈ సమాచారం అందుకున్న నాయకులు చాలా మంది ఆయన నివాసానికి చేరుకున్నారు. అకస్మాత్తుగా రాహుల్ గాంధీ, ప్రియాంక కూడా అక్కడికి వస్తున్నారని అప్పటికప్పుడు నేతలకు తెలిసింది. దీంతో నేతలంతా అలర్ట్ అయ్యారు. పుట్టిన రోజుకు వస్తున్నట్టు చెప్పిన రాహుల్, ప్రియంక సడెన్‌గా 7, లోక్ కల్యాణ్ మార్గ్‌ వైపు వెళ్లడం ప్రారంభించారు. 

రాహుల్ ముట్టడి ప్లాన్ తెలిసి బిత్తరపోయిన కాంగ్రెస్ నేతలు 

అప్పుడుగానీ రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ప్రధానమంత్రి ఇంటి ముట్టడిల ప్లాన్ ఎంపీలకు అర్థంకాలేదు. దీని గురించి కాంగ్రెస్ అగ్రనేతలకు ఒకరిద్దరికి కూడా తెలుసు. దీంతో వారంతా రాహుల్, ప్రియాంకతోనే ఉన్నారు. ప్రధానమంత్రి ఇంటి ముట్టడి గురించి పక్కనే ఉన్న ఖర్గే ఇంట్లో ఉన్న నేతలు తెలుసుకొని రాహుల్, ప్రియాంకతో కలిసి నడిచారు. 

అధికార పార్టీకి షాక్ ఇచ్చిన రాహుల్ ధర్నా 

ఒక్కసారిగా జరిగిన మెరుపు ధర్నాతో సెక్యూరిటీ సిబ్బంది కూడా షాక్ అయ్యారు. అధికార పక్షానికి కూడా ఇది షాకింగ్‌గానే ఉంది. దీంతో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వచ్చి రాహుల్‌తో చర్చలు జరిపారు. తమ ఐదు డిమాండ్లు నెరవేర్చే వరకు అక్కడి నుంచి కదలబోమని స్ఫష్టం చేశారు. దీంతో చర్చలు విఫలమైనందన పోలీసులు జోక్యం చేసుకున్నారు. ప్రధానమంత్రి ఇంటి ముందు నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, అఖిలేష్ యాదవ్ వంటి వాటిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి గాయాలు అయ్యారు. 

Frequently Asked Questions

రాహుల్, ప్రియాంక గాంధీ ఎక్కడ ధర్నా చేశారు?

ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ కార్యకర్తలతో కలిసి మెరుపు ధర్నా చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై నిరసన తెలిపారు.

ఈ ధర్నా గురించి ముందే ఎవరికైనా తెలుసా?

లేదు, ఈ మెరుపు ధర్నా ప్రణాళికను చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచారు. అధికారి పార్టీ అలర్ట్ అవ్వకుండా కాంగ్రెస్ నేతలకు కూడా సమాచారం ఇవ్వలేదు.

ధర్నా ప్రణాళికను కాంగ్రెస్ నాయకులు ఎలా గోప్యంగా ఉంచారు?

మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సాకుతో ఎంపీలను ఆయన నివాసానికి పిలిపించారు. అక్కడి నుండి రాహుల్, ప్రియాంక ప్రధానమంత్రి నివాసం వైపు వెళ్లడంతోనే అసలు ప్లాన్ బయటపడింది.

ధర్నా అనంతరం పోలీసులు ఏమి చేశారు?

కేంద్రమంత్రి చర్చలు విఫలమవడంతో పోలీసులు రాహుల్, ప్రియాంక, ఇతర నాయకులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి గాయాలయ్యాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget