అన్వేషించండి

Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి

నీట్ పోరాటంలో జెన్-జీ సాధించిన విజయాన్ని అభినందిస్తూ రేవంత్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. చట్టసభల్లో యువతకు ప్రాతినిధ్యం కోసం 21 ఏళ్లకు తగ్గించాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ అక్రమాలపై యువత పోరాటాన్ని సీఎం రేవంత్ కొనియాడారు.
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా యువత విజయమన్నారు, డిమాండ్లు వినిపించారు.
  • ఎన్నికల వయోపరిమితి 21 ఏళ్లకు తగ్గించి తీర్మానం పంపుతామన్నారు.

TPCC Candlelight Rally Supporting GenZ | హైదరాబాద్: జెన్ జీ పోరాటంతో కేంద్రం దిగొచ్చిందని, తద్వారా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ముమ్మాటికీ యువత సాధించిన విజయమని, ఈ క్రెడిట్ కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకోవడం లేదన్నారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనతో పాటు ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన అమానుష లాఠీచార్జీని నిరసిస్తూ, జెన్-జీ (Gen-Z) విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా తెలంగాణ కాంగ్రెస్ (TPCC) ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు సాగిన ఈ క్యాండిల్ ర్యాలీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, వేలాది మంది యువతీ యువకులు తరలివచ్చారు.


Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి

యువత పోరాటానికి ప్రధాని మోదీ తలవంచక తప్పలేదు

ర్యాలీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నీట్ అక్రమాలపై జెన్-జీ యువత జరిపిన సుదీర్ఘ పోరాటమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ యువ విప్లవానికి తలవంచక తప్పలేదని, అయితే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే సమస్య పూర్తవలేదని స్పష్టం చేశారు. పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే పరిహారం చెల్లించాలని, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై మోపిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ విజయాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోదని, ఇది పూర్తిగా భారత యువత సాధించిన చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు.

21 ఏళ్లకే ప్రజాప్రతినిధి అయ్యేలా తీర్మానం చేసి పంపుతాం..

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని తగ్గించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సివిల్ సర్వీసెస్‌లో 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్‌లు కాగలిగినప్పుడు, చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేందుకు కూడా 21 ఏళ్ల వయోపరిమితిని నిర్ణయించాలని సూచించారు. ఆగస్టు మొదటి వారంలో నిర్వహించే తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాల్లో ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు తగ్గించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ప్రకటించారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ఈ బిల్లు ఆమోదం పొందేలా కృషి చేస్తామని, 30 శాతం ఉన్న జెన్-జీ యువతకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లభించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also Read: Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  

దేశ భవిష్యత్తు యువతరమైన జెన్-జీ (Gen-Z) చేతిలోనే ఉందని, ఈ దేశం వారిదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జంతర్ మంతర్ నుంచి జెన్-జీ యువత పార్లమెంటు వరకు తమ గళాన్ని వినిపించేలా ఎదగాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని, అలాగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు తగ్గించారని గుర్తుచేశారు. దీనివల్ల 21 ఏళ్లకే త్రివేండ్రం మేయర్‌గా ఓ యువతి బాధ్యతలు స్వీకరించగలిగారని తెలిపారు.

సివిల్ సర్వీసెస్ అర్హత వయస్సు 21 ఏళ్లు ఉన్నందున, తెలుగు అమ్మాయి శ్రీలక్ష్మి 21 ఏళ్లకు, మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య 22 ఏళ్లకు ఐఏఎస్ సాధించారని, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ 32 ఏళ్ల క్రితమే యువ వయస్సులో ఐపీఎస్ సాధించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మన దేశంలో అసెంబ్లీకి పోటీ చేయడానికి 25 ఏళ్లు, రాజ్యసభకు 30 ఏళ్ల అర్హత ఉండగా.. జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో 18 ఏళ్లకే, సింగపూర్‌లో 21 ఏళ్లకే పోటీ చేసే హక్కు ఉందని వివరించారు.

 

 

Frequently Asked Questions

కొవ్వొత్తుల ర్యాలీ ఎందుకు నిర్వహించారు?

నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా, జెన్-జీ విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా ఈ ర్యాలీ జరిగింది.

విద్యాశాఖ మంత్రి రాజీనామా గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు?

జెన్-జీ యువత పోరాటం వల్లే కేంద్రం దిగొచ్చిందని, తద్వారా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది యువత సాధించిన విజయమన్నారు.

పేపర్ లీక్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమని డిమాండ్ చేశారు?

పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నికలలో పోటీ చేయడానికి వయోపరిమితి గురించి సీఎం రేవంత్ రెడ్డి ఏం ప్రతిపాదించారు?

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసే వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని ఆయన ప్రతిపాదించారు. 21 ఏళ్లకే ఐఏఎస్, ఐపీఎస్ కాగలిగినప్పుడు, ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే వయస్సు కూడా అంతే ఉండాలన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget