అన్వేషించండి

Kavitha Meet the Press: కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు

Kavitha: విమర్శించేది తన తండ్రి కేసీఆర్ ను కాదని..బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను మాత్రమేనని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. హైదరాబాద్ మీట్ ది ప్రెస్‌లో పలు అంశాలపై సమాధానాలిచ్చారు.

TRS Leader Kavitha: కేసీఆర్ లేకపోతే తాను లేనని తాను విమర్శించేది తన తండ్రి కేసీఆర్ ను కాదని..బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను మాత్రమేనని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ వేదికగా కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను అత్యంత భావోద్వేగంతో, స్పష్టమైన వ్యూహంతో ప్రకటించారు. తండ్రి చాటు బిడ్డగా కాకుండా, ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదిగుతానని ధీమా వ్యక్తంమ చేశారు.  తెలంగాణ సమాజంలో అన్ని అడ్డంకులను దాటుకొని  తెలంగాణ రక్షణ సేన పేరుతో ఒక బలమైన రాజకీయ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశామని కవిత  ప్రకటించారు.

జాగృతి వేరే.. రాజకీయాల కోసం రక్షణ సేన 
 
గత 20 ఏళ్లుగా సేవలందిస్తున్న  తెలంగాణ జాగృతి  ఇకపై కూడా స్వచ్ఛంద సంస్థ గానే కొనసాగుతుందని, రాజకీయ పోరాటాల కోసం మాత్రం రక్షణ సేన రంగంలో ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. సర్వోదయ తెలంగాణ సాధనే లక్ష్యంగా తమ పార్టీ అన్ని వర్గాల సమస్యలపై గొంతుకగా మారుతుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో రైతు ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.  జాగృతి జనబాట లో తాను కలిసిన ఒక రైతు, మరుసటి రోజే పంట కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒక రైతు మరణం కేవలం చిన్న వార్తగా మిగిలిపోవడం విచారకరమని, తమ ప్రభుత్వం వస్తే రైతును నిజమైన రాజుగా మారుస్తామని ఆమె ప్రతిన పూనారు.

 పాంచజన్యం - ఐదు అంచెల వ్యూహం

సర్వోదయ తెలంగాణ సాధన కోసం పాంచజన్యం  అనే ఐదు అంశాలతో కూడిన ప్రత్యేక కార్యక్రమాన్ని కవిత ప్రకటించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై తాము యుద్ధ భేరీ మోగిస్తామని, ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సమాజంలోని అసమానతలను తొలగించి, సమగ్ర అభివృద్ధి సాధించడమే ఈ పాంచజన్యం ఉద్దేశమని ఆమె వెల్లడించారు.

పాలనలో  అమ్మతనం

నేటి రాజకీయాల్లో, పరిపాలనలో  మదర్లీ టచ్ ) లోపించిందని కవిత అభిప్రాయపడ్డారు. నేను మా అమ్మలాగా పరిణితి చెందాలని భావిస్తున్నాను. ప్రభుత్వాలకు అమ్మతనం లేదు కాబట్టే ప్రజల కష్టాలు వారికి పట్టడం లేదు  అని ఆమె ఘాటుగా విమర్శించారు. పరిపాలనలో మానవీయ కోణం ఉండాలని, అప్పుడే ప్రజలకు అసలైన న్యాయం జరుగుతుదన్నారు.  

తండ్రి కేసీఆర్ వర్సెస్ పొలిటికల్ లీడర్ కేసీఆర్

తన తండ్రి పట్ల వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదని, కానీ రాజకీయ నాయకుడిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను తాను ఎప్పటికీ విమర్శిస్తానని కవిత కుండబద్దలు కొట్టారు. కుటుంబ సంబంధాలు వేరని, రాజకీయ సిద్ధాంతాలు వేరని చెబుతూ.. భవిష్యత్తులో కూడా రాజకీయపరంగా తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తన జీవిత అనుభవాలు తనకు ప్రాణం విలువను నేర్పాయని, అందుకే పూర్తి నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడతానని ఆమె ప్రకటించారు.  
 
 కవిత ఈ సమావేశం ద్వారా తన రాజకీయ వైఖరిని చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచారు. ఒకవైపు సెంటిమెంట్‌ను, మరోవైపు అభివృద్ధి అజెండాను జోడిస్తూ ఆమె వేస్తున్న అడుగులు తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget