అన్వేషించండి

647km రేంజ్‌తో స్కోడా Peaq EV ఆవిష్కరణ - ఈ కారు నుంచి ఇంటికి కూడా కరెంటు వాడుకోవచ్చు

647 కి.మీ. వరకు రేంజ్ అందించే స్కోడా పీక్ EVని ప్రపంచ మార్కెట్లలో ఆవిష్కరించారు. 91kWh బ్యాటరీ, 7 సీట్ల లేఅవుట్, ప్రీమియం ఫీచర్లతో ఈ కారు వస్తోంది.

Skoda Peaq EV Price, Range And Features: భారీ రేంజ్, లగ్జరీ ఫీచర్లు, పవర్‌ఫుల్‌ బ్యాటరీ ప్యాక్‌లతో స్కోడా తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV ‘పీక్ EV’ని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 647 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల ఈ ఎలక్ట్రిక్ SUV, సుదూర ప్రయాణాలను మరింత సులభతరం చేయనుంది. ఈ రేంజ్‌ను పరిశీలిస్తే హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లి తిరిగి రావడానికి కూడా మధ్యలో ఛార్జింగ్ అవసరం లేకపోవచ్చని అంచనా వేయవచ్చు.

ప్రస్తుతం స్కోడా ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో ఇది అత్యంత ప్రీమియం మోడల్‌గా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో Kia EV9, Hyundai Ioniq 9, Volvo EX90 వంటి ఫుల్‌సైజ్ ఎలక్ట్రిక్ SUVలకు పోటీగా దీనిని తీసుకొచ్చింది. ముఖ్యంగా భారత మార్కెట్లో కూడా ఈ మోడల్‌ను ప్రవేశపెట్టే అవకాశాలను స్కోడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

వేరియంట్లు - బ్యాటరీ ఆప్షన్లు

స్కోడా పీక్ EVని 60, 90 & 90x అనే మూడు వేరియంట్లలో విక్రయించనున్నారు. బేస్ 60 వేరియంట్‌లో 63kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. ఈ మోడల్ 204 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తూ 459 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

మధ్యస్థ 90 వేరియంట్‌లో 91kWh బ్యాటరీ ప్యాక్‌ అందించారు. ఇది 286 hp శక్తిని ఉత్పత్తి చేస్తూ గరిష్టంగా 647 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇదే ఈ SUVలో అత్యధిక రేంజ్ కలిగిన వేరియంట్.

టాప్ ఎండ్ 90x వేరియంట్‌లో కూడా 91kWh బ్యాటరీనే అందించినప్పటికీ, ఇందులో డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ వ్యవస్థ ఉంటుంది. 299 hp పవర్‌ను ప్రొడ్యూస్‌ చేసే ఈ వేరియంట్ ఒక్క ఛార్జ్‌తో 613 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. కేవలం 6.7 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో కూడా పీక్ EV ఆకట్టుకుంటుంది. 91kWh బ్యాటరీని 199kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 28 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

దాదాపు 4.9 మీటర్ల పొడవు కలిగిన ఈ SUV స్కోడా తాజా Modern Solid డిజైన్ లాంగ్వేజ్‌తో కనిపిస్తుంది. ముందుభాగంలో టెక్ డెక్ ఫేస్, టీ ఆకారంలోని మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్స్, బ్లాంక్‌డ్ ఆఫ్ గ్రిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 19 నుంచి 21 అంగుళాల ఏరో ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ దీనికి మరింత ప్రీమియం లుక్ అందిస్తున్నాయి.

ఇంటీరియర్‌లో 13.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, హీటెడ్ స్టీరింగ్ వీల్, 16 స్పీకర్ల సోనోస్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంటికి కూడా విద్యుత్

అంతేకాకుండా, బైడైరెక్షనల్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా ఇంటి విద్యుత్ అవసరాలకు కూడా ఈ SUVను ఉపయోగించవచ్చు. స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్ ద్వారా వాహనాన్ని లాక్ & అన్‌లాక్ చేసే డిజిటల్ కీ ఫీచర్‌ను కూడా స్కోడా తొలిసారిగా అందిస్తోంది.

భద్రత పరంగా 10 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), ఆటో పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటాయి.

భారత్‌లో ఈ SUV లాంచ్‌పై ఇంకా అధికారిక ప్రకటన లేకపోయినా, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) రూపంలో తీసుకురావడానికి స్కోడా పరిశీలిస్తోంది. యూకే మార్కెట్లో దీని ప్రారంభ ధర 51,980 పౌండ్లు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.64.95 లక్షలు. అయితే దిగుమతి సుంకాలు కలిపితే ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది భారత మార్కెట్లోకి వస్తే, ప్రస్తుతం రూ.1.30 కోట్ల ధరతో ఉన్న కియా EV9కు ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
Toyota Glanza కొనేవాళ్లకు బోలెడన్ని EMI ఆఫర్లు.. రూ.1.60 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే చాలు!
Toyota Glanza కొనడం ఇప్పుడు చాలా సులభం, నెలకు రూ.10,000 కూడా అవసరం లేదు!
Triumph నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్! అక్టోబర్‌ 6న ఏం జరగబోతోంది?
అక్టోబర్‌ 6.. కుర్రాళ్ల కోసం దసరా ముందే వస్తోంది, వెయిట్‌ అండ్‌ వాచ్‌!
EV మార్కెట్‌లో మరోసారి సత్తా చాటిన Tata Motors.. Kia దెబ్బకు Marutiకి భారీ షాక్!
జనం ఎక్కువగా కొంటున్న ఎలక్ట్రిక్‌ కార్లు ఈ కంపెనీవే.. ఇతర బ్రాండ్ల వైపు కన్నెత్తి చూడడం లేదు!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget