హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ముఖ్యమైన ప్రయోజనాలు, ఫీచర్లు.. EVని ఎందుకు కొనాలో తెలిపే 10 ముఖ్యమైన పాయింట్లు

Published by: Shankar Dukanam

భారతదేశంలో దశాబ్దాలుగా నమ్మకానికి మారుపేరుగా నిలిచిన 'యాక్టివా' బ్రాండ్ నుండి వచ్చిన స్కూటర్ ఇది.

ఇందులో 2 మొబైల్/పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీలను ఇచ్చారు. హోండా స్వాపింగ్ స్టేషన్‌లో ఫుల్ ఛార్జ్డ్ బ్యాటరీలతో మార్చుకోవచ్చు.

ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 102 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు

ఇందులో 6 kW సామర్థ్యం గల పవర్‌ఫుల్ PMSM మోటార్‌ వాడారు. కేవలం 7.3 సెకన్లలోనే 0 నుండి 60 km/h వేగాన్ని అందుకోగలదు

రైడర్ అవసరాలకు తగ్గట్టుగా మూడు రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. అంతేకాకుండా, పార్కింగ్ నుంచి వెనక్కి తీయడానికి 'రివర్స్ మోడ్' ఫీచర్ కూడా ఉంది.

టాప్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/మెసేజ్ అలర్ట్స్ చూపేలా పెద్ద 7 ఇంచుల TFT స్క్రీన్ అమర్చారు.

కీ లేకుండానే స్టార్ట్ చేయడం, లాక్ చేయడం. దూరంలో ఉన్నప్పుడు కార్ల తరహాలోనే 'స్మార్ట్ కీ' టెక్నాలజీని అందించారు.

భద్రత కోసం కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు డిస్క్ బ్రేక్, ఎల్ఈడీ లైటింగ్, సైడ్ స్టాండ్ ఇంజన్ కటాఫ్ వంటి ఫీచర్లు

ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు 3 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ వల్ల గుంతల రోడ్లపై సాఫీగా ప్రయాణం