టీవీఎస్‌ ఆర్బిటర్‌ vs హోండా యాక్టివా ఇ, రెండింటిలో బెస్ట్ ఈవీ స్కూటర్ ఏది?

Published by: Khagesh

టీవీఎస్ స్కూటర్‌ యూత్‌ను టార్గెట్ చేస్తూ డిజైన్ చేశారు. హండా యాక్టివా ఇ మాత్రం ఫ్యామిలీ వినియోగదారులను టార్గెట్ చేశారు.

హోండా యాక్టివా ఇలో స్వాపబుల్ బ్యాటరీలు ఉంటాయి. టీవీఎస్ ఆర్బిటర్‌లో ఫిక్స్డ్‌ బ్యాటరీ ప్యాక్ లేదా హై కెపాసిటీ రిమూవబుల్ బ్యాటరీలు ఇస్తున్నారు.

టీవీఎస్‌ ఒకసారి ఛార్జ్ చేస్తే 130 నుంచి 140 కిలోమీటర్ల వరకు సర్టిపైడ్ రేంజ్ అందిస్తుంది. హోండా యాక్టివా ఇ 100ప్లస్‌ కి.మీ రేంజ్ ఇస్తుంది.

టీవీఎస్ ఆర్బిటర్ గరిష్ట స్పీడ్ 85 కిలోమీటర్‌లు. హోండా యాక్టివా ఇ 75 నుంచి 80 కిలోమీటర్ల వేగమే.

టీవీఎస్ ఆర్టిటర్‌ కేవలం 1.5 గంటల్లోనే 80 శాతం ఛార్జ్ అవుతుంది. హోండా యాక్టివా ఇ బ్యాటరీలను స్వాప్ చేయాల్సి ఉంటుంది.

టీవీఎస్ ఆర్బిటర్‌లో ఫుల్ ఫేస్‌ హెల్మెట్‌ పట్టేంత స్పేస్ ఉంది. యాక్టివా ఇ లో బూట్ స్పేస్ తక్కువగా ఉంది.

రెండు బైక్స్‌లో కాంబి బ్రేకింగ్ సిస్టమ్ లేదా వేరియంట్‌ను బట్టి ఫ్రట్‌ డిస్క్ బ్రేక్ ఆప్షన్ ఉంటాయి.

రెండు స్కూటర్‌లోనూ ముందువైపు టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌ వెనుకవైపు మోనో షాక్ సస్పెన్షన్‌ అందిస్తారు.

హైదరాబాద్‌లో యాక్టివా ఈవ ధర 1,35,000 నుంచి 1,50,000 ఉంది. టీవీఎస్ ఆర్బిటర్‌ 1,40, 000 నుంచి 1,65,000 ఉంది.