అన్వేషించండి

1,000cc, 280hp పవర్‌తో సంచలనం - ప్రపంచంలోనే అరుదైన 8 సిలిండర్ టూస్ట్రోక్ బైక్ ఆవిష్కరణ

Veloce Motorcycles కొత్త Aperion హైపర్ బైక్‌ను ఆవిష్కరించింది. 1,000cc X8 టూస్ట్రోక్ ఇంజిన్, 280hp పవర్, 24 యూనిట్ల పరిమిత ఉత్పత్తి & రూ.97 లక్షల ధరతో ఈ బైక్ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.

Veloce Aperion revealed: టూస్ట్రోక్ మోటార్‌సైకిళ్లు దాదాపు చరిత్రలో కలిసిపోయాయని భావిస్తున్న సమయంలో UKకు చెందిన స్టార్టప్ సంస్థ Veloce Motorcycles ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే మోడల్‌ను ఆవిష్కరించింది. Aperion పేరుతో తీసుకొచ్చిన ఈ హైపర్ మోటార్‌సైకిల్ అత్యంత అరుదైన 1,000cc X8 టూస్ట్రోక్ ఇంజిన్‌తో రూపొందింది. లగ్జరీ కార్ల తరహాలో ఏకంగా 280hp పవర్‌ను ఉత్పత్తి చేసే ఈ బైక్ ఇంజినీరింగ్ పరంగా కొత్త ప్రమాణాలను సృష్టిస్తుందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.

Aperion అనే పేరు గ్రీకు పదమైన "Apeiron" నుంచి తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి అపరిమితం లేదా అంతులేనిది అనే అర్థం వస్తుంది. ఈ బైక్ సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా ఈ పేరును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: పవర్‌ఫుల్‌ 349cc ఇంజిన్‌తో కొత్త బజాజ్ డొమినార్ 400 - జంటగా దేశమంతా చుట్టి రావచ్చు!

X8 ఇంజిన్
ఈ బైక్‌లో ఉపయోగించిన X8 ఇంజిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో ఎనిమిది సిలిండర్లను రెండు V4 బ్యాంకులుగా అమర్చి, మధ్యలో గేర్‌బాక్స్‌ ఏర్పాటు చేశారు. ఈ ఇంజిన్ 12,000 rpm వద్ద ఏకంగా 280hp పవర్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉపయోగించిన సిలిండర్లు Aprilia RS125 ఆధారంగా రూపొందించారు. ఇంధన సరఫరా కోసం ఎనిమిది 24mm Dellorto కార్బ్యురేటర్లను ఉపయోగించారు. ఇవన్నీ ప్రత్యేక స్పైరల్ థ్రాటిల్ కేబుల్ వ్యవస్థ ద్వారా పనిచేస్తాయి.

సాధారణ Four Stroke ఇంజిన్లతో పోలిస్తే Two Stroke ఇంజిన్లలో లూబ్రికేషన్ వ్యవస్థ భిన్నంగా ఉండటం వల్ల X8 కాన్ఫిగరేషన్‌ను అమలు చేయడం సులభమైందని Veloce తెలిపింది. ఈ డిజైన్ కారణంగా వ్యతిరేక దిశలో పనిచేసే పిస్టన్లు ఒకేసారి కదలడం వల్ల ఇంజిన్‌లో ఉత్పత్తయ్యే కంపనలు సహజంగానే తగ్గిపోతాయి. దీంతో, ఇంత పవర్‌లో కూడా ఈ బండి అత్యంత స్మూత్‌గా పని చేస్తుందని కంపెనీ పేర్కొంది.

Aperionలో మరో ప్రధాన ఆకర్షణ ప్రత్యేకంగా రూపొందించిన రెసోనెన్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్. సాధారణంగా Two Stroke ఇంజిన్‌ల పనితీరులో ఎక్స్‌ప్యాన్షన్ ఛాంబర్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఎనిమిది ఛాంబర్లను ఒకే మోటార్‌సైకిల్‌లో అమర్చడం చాలా క్లిష్టమైన పని. దీనికి పరిష్కారంగా లేజర్ సిన్టరింగ్ టెక్నాలజీతో తయారు చేసిన ఆల్ అలాయ్ ఎగ్జాస్ట్ వ్యవస్థను కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా సాధారణ పద్ధతులతో తయారు చేయలేని అత్యంత క్లిష్టమైన ఆకృతులను రూపొందించవచ్చు.

ఈ బైక్‌లో ఇంజిన్, ఛాసిస్ & ట్రాన్స్‌మిషన్‌ను ఒకే స్ట్రక్చరల్ యూనిట్‌గా రూపొందించారు. దీంతో బైక్ బరువు తగ్గడంతో పాటు నిర్మాణ దృఢత్వం కూడా గణనీయంగా పెరిగిందని కంపెనీ చెబుతోంది.

ఇది కూడా చదవండి: లీటర్‌కు 56km మైలేజ్, భారీ స్టోరేజ్ ఇస్తున్న Suzuki Burgman Street - కానీ ఈ రెండు లోపాలు నిరాశపరుస్తాయి!

కేవలం 24 యూనిట్లే
Veloce Aperionను తొలిసారిగా లండన్‌లో నిర్వహించిన Bike Shed Moto Showలో ప్రదర్శించారు. ఈ హైపర్ బైక్ ఉత్పత్తిని కేవలం 24 యూనిట్లకే పరిమితం చేశారు. ఒక్కో బైక్ ధర £78,000గా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.97.3 లక్షలకు సమానం. ఇండియాలో ఈ డబ్బుతో దాదాపు 10 మిడిల్‌క్లాస్‌ కార్లను లేదా ఒక మంచి విల్లాను కొనవచ్చు. 2027 నుంచి Veloce Aperion డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ప్రతి బైక్‌కు UKలో రోడ్లపై నడిపేందుకు అవసరమైన MSVA సర్టిఫికేషన్ కూడా అందించనున్నారు.

ఇదిలా ఉంటే, Veloce మరో వినూత్న మోడల్ Etherealను కూడా అభివృద్ధి చేస్తోంది. ఇందులో 500cc Four Cylinder Two Stroke ఇంజిన్ ఉండగా, ఇది 12,000 rpm వద్ద 145hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. తక్కువ బరువు, వేగవంతమైన హ్యాండ్లింగ్ & మరింత చురుకైన పనితీరుపై ఈ మోడల్‌ను కంపెనీ రూపొందిస్తోంది. ఆధునిక కాలంలో Two Stroke మోటార్‌సైకిళ్లకు మళ్లీ జీవం పోసే ప్రయత్నం చేస్తోంది Veloce Motorcycles.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget