అన్వేషించండి

లీటర్‌కు 56km మైలేజ్, భారీ స్టోరేజ్ ఇస్తున్న Suzuki Burgman Street - కానీ ఈ రెండు లోపాలు నిరాశపరుస్తాయి!

కొత్త సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125 స్కూటర్ స్టైలిష్ డిజైన్, 56 కి.మీ. వరకు మైలేజ్, 24.6 లీటర్ల స్టోరేజ్‌తో ఆకట్టుకుంటోంది. అయితే ABS లేకపోవడం, స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ లేకపోవడం మైనస్‌లుగా మారాయి.

Suzuki Burgman Street Price And Features: భారత మార్కెట్లో ప్రీమియం 125cc స్కూటర్లలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఎనిమిదేళ్ల తర్వాత ఈ స్కూటర్‌కు భారీ అప్‌డేట్ ఇచ్చిన సుజుకి, కొత్త డిజైన్, పెద్ద స్టోరేజ్ స్పేస్, TFT డిస్‌ప్లే వంటి ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా మార్చింది. అయితే కొన్ని కీలక ఫీచర్లను తొలగించడం కూడా చర్చనీయాంశమైంది. మరి కొత్త బర్గ్‌మన్ స్ట్రీట్ కొనడానికి ఉన్న ప్రధాన కారణాలు ఏమిటి? ఏ అంశాలు నిరాశపరుస్తాయి? తెలుసుకుందాం.

కొనడానికి 3 ప్రధాన కారణాలు

ఆకర్షణీయమైన డిజైన్ & భారీ స్టోరేజ్

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త బర్గ్‌మన్ స్ట్రీట్ మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది. షార్ప్ డిజైన్, కొత్త హెడ్‌ల్యాంప్, మెరుగైన ప్రొపోర్షన్స్ స్కూటర్‌కు ప్రీమియం లుక్‌ తీసుకొచ్చాయి. ఫ్యూయల్ ఫిల్లర్‌ను బయట భాగంలో ఏర్పాటు చేయడం రోజువారీ వినియోగంలో సౌకర్యాన్ని పెంచింది.

24.6 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ ఈ స్కూటర్‌లో ప్రధాన ఆకర్షణ. ఇందులో రెండు ఫుల్ ఫేస్ హెల్మెట్లు కూడా సులభంగా పెట్టుకోవచ్చు. ముందు భాగంలో రెండు స్టోరేజ్ కంపార్ట్‌మెంట్లు, USB ఛార్జింగ్ పోర్ట్, అదనపు స్టోరేజ్ బాక్స్ అందుబాటులో ఉన్నాయి. టాప్ వేరియంట్‌లో కీ లెస్ ఇగ్నిషన్, TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ & కాల్ నోటిఫికేషన్లు కూడా లభిస్తాయి.

అద్భుతమైన మైలేజ్‌తో స్మూత్ ఇంజిన్

124cc ఇంజిన్ బర్గ్‌మన్ స్ట్రీట్‌కు ఎప్పటి నుంచో ప్రధాన బలం. ఈ కంపెనీ, తాజా వెర్షన్‌లో కూడా అదే బలాన్ని కొనసాగింది. గరిష్ట పవర్ సంఖ్యలను పెంచకపోయినా, నగర ప్రయాణాలకు అనుకూలంగా పవర్ డెలివరీని మెరుగుపరిచింది.

10 నుంచి 90 కిలోమీటర్ల వేగం మధ్య ఇంజిన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. వేగంగా వెళ్లాలన్నా ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడి పడదు. మైలేజ్ విషయంలో కూడా మంచి ఫలితాలు కనిపించాయి. సిటీ రైడింగ్‌లో లీటర్‌కు 50.1 కిలోమీటర్లు, హైవేపై 56.6 కిలోమీటర్లు, సాధారణ వినియోగంలో 53 కిలోమీటర్లకు పైగా మైలేజ్ అందించినట్లు పరీక్షల్లో తేలింది.

ట్రాఫిక్‌లో సులభమైన రైడింగ్

పెద్ద బాడీ, ఎక్కువ వీల్‌బేస్ ఉన్నప్పటికీ ట్రాఫిక్‌లో ఈ స్కూటర్ చాలా తేలికగా అనిపిస్తుంది. యూ-టర్న్‌ల సమయంలో హ్యాండిల్ మోకాళ్లకు తగలదు. 775 మిల్లీమీటర్ల సీట్ హైట్ కారణంగా చాలా మంది రైడర్లు రెండు కాళ్లను నేలపై సులభంగా ఉంచగలరు. దీంతో రద్దీ రోడ్లలో కూడా స్కూటర్‌ను సులభంగా నడపవచ్చు. సిటీ యూజర్లకు ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా చెప్పొచ్చు.

ఇది కూడా చదవండి: లక్ష రూపాయల లోపే సీఎన్జీ బైక్‌! ట్యాంక్ ఫుల్ చేస్తే 300 కిలోమీటర్లు చూడాల్సిన పని లేదు!

కొనకుండా ఆగడానికి 2 ప్రధాన కారణాలు

స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ లేదు

పాత బర్గ్‌మన్ EXలో ఉన్న సైలెంట్ స్టార్ట్ & ఆటో స్టార్ట్-స్టాప్ టెక్నాలజీని కొత్త బర్గ్‌మన్ స్ట్రీట్‌లో తొలగించారు. ప్రస్తుతం ఆ ఫీచర్లు కావాలంటే పాత ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన EX వేరియంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. 125cc సెగ్మెంట్‌లో ఈ టెక్నాలజీ క్రమంగా సాధారణంగా మారుతున్న నేపథ్యంలో కొత్త మోడల్‌లో లేకపోవడం కొంత నిరాశ కలిగించే అంశం.

ABS లేకపోవడం

కొత్త బర్గ్‌మన్ స్ట్రీట్‌లో అత్యంత పెద్ద లోపం ABS లేకపోవడమే. సింగిల్ ఛానల్ ABS ఆప్షన్ కూడా అందుబాటులో లేదు. ముఖ్యంగా ఈ ధర స్థాయిలో ఇది పెద్ద మైనస్‌గా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బర్గ్‌మన్ కంటే తక్కువ ధరలో లభించే సుజుకి యాక్సెస్ టాప్ వేరియంట్లలో ABS అందుబాటులో ఉంది. ప్రీమియం స్కూటర్‌గా మార్కెటింగ్ చేస్తున్న బర్గ్‌మన్‌లో ఈ ఫీచర్ లేకపోవడాన్ని చాలామంది వినియోగదారులు ప్రశ్నించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Aprilia Tuono 457 స్పెషల్ ఎడిషన్‌ లాంచ్‌ - 457cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో కొత్త అప్‌డేట్స్

ధర ఎంత?

కొత్త సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.02 లక్షల నుంచి రూ.1.13 లక్షల వరకు ఉంది.

హైదరాబాద్ ఆన్‌రోడ్ ధరలు (సుమారుగా):

బర్గ్‌మన్ స్ట్రీట్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ – రూ.1.19 లక్షలు

బర్గ్‌మన్ స్ట్రీట్ రైడ్ కనెక్ట్ TFT ఎడిషన్ – రూ.1.32 లక్షలు

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర నగరాల్లో కూడా కాస్త అటుఇటుగా ఇవే ధరలు ఉన్నాయి.

ఫైనల్‌గా కొనొచ్చా?

స్టైలిష్ డిజైన్, అద్భుతమైన మైలేజ్, భారీ స్టోరేజ్, నగర ట్రాఫిక్‌లో సులభమైన రైడింగ్ కోరుకునే వారికి కొత్త సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ మంచి ఎంపికగా నిలుస్తుంది. అయితే ABS & స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ తప్పనిసరిగా కావాలనుకునే వారు ఇతర ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
స్టైలిష్‌ లుక్‌, 260km వరకు రేంజ్‌, 114kmph టాప్ స్పీడ్‌ - Avore నుంచి మూడు కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లు
స్పోర్టీ లుక్‌తో అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 260km రేంజ్‌, కేవలం రూ.799కే మీ సొంతం!
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Mahindra Scorpio N ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్లు.. ఈ కొత్త ఫీచర్లు చూస్తే కొనాలనిపించాల్సిందే!
లాంచ్‌కు ముందే ఫుల్‌గా లీకైన మహీంద్ర స్కార్పియో N.. థార్‌ రాక్స్‌ తరహా ఫీచర్లతో వస్తున్న కొత్త SUV
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget