అన్వేషించండి

Aprilia Tuono 457 స్పెషల్ ఎడిషన్‌ లాంచ్‌ - 457cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో కొత్త అప్‌డేట్స్

Aprilia Tuono 457 Special Edition భారత్‌లో రూ.3.99 లక్షలకు విడుదలైంది. కొత్త హ్యాండిల్‌బార్, మెరుగైన సస్పెన్షన్, ప్రీమియం ఫీచర్లు & 457cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో యువతను ఆకట్టుకోనుంది.

Aprilia Tuono 457 Special Edition Price And Features: రక్తం ఉరకలెత్తే యూత్‌ను ఆకట్టుకునే మరో స్టైలిష్ స్పోర్ట్స్ బైక్‌ను అప్రిలియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. Aprilia Tuono 457 Special Editionను అధికారికంగా విడుదల చేసింది. మహారాష్ట్రలో ఎక్స్‌షోరూమ్ ధర రూ.3.99 లక్షలుగా నిర్ణయించగా, ఇది స్టాండర్డ్ Tuono 457 కంటే కేవలం రూ.2,000 మాత్రమే ఎక్కువ. అయితే ఈ అదనపు ధరకు రైడింగ్ కంఫర్ట్ & డైలీ యూజబిలిటీని మెరుగుపరిచే పలు ప్రత్యేక అప్‌డేట్స్‌ను కంపెనీ అందించింది.

ప్రస్తుతం యువతలో లాంగ్ రైడ్స్, వీకెండ్ ట్రిప్స్ & కపుల్ రైడింగ్ కల్చర్ వేగంగా పెరుగుతోంది. అలాంటి రైడర్లను లక్ష్యంగా చేసుకుని ఈ స్పెషల్ ఎడిషన్‌ను రూపొందించినట్లు అప్రిలియా చెబుతోంది. ముఖ్యంగా రైడర్ & పిలియన్ ఇద్దరికీ మరింత సౌకర్యవంతమైన అనుభూతి అందించేలా మార్పులు చేసింది.

ఎత్తైన హ్యాండిల్‌బార్

ఈ స్పెషల్ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణ కొత్తగా అందించిన ఎత్తైన హ్యాండిల్‌బార్. దీని వల్ల రైడింగ్ పొజిషన్ మరింత నిటారుగా ఉండి, ఎక్కువసేపు ప్రయాణించినా అలసట తక్కువగా ఉంటుంది. అలాగే సస్పెన్షన్ సెటప్‌ను కూడా రీక్యాలిబ్రేట్ చేశారు. సాఫ్ట్ ఇనిషియల్ స్ట్రోక్ & సవరించిన కంప్రెషన్ డ్యాంపింగ్ వల్ల రోడ్డుపై గుంతలు, ఎత్తుపల్లాలను మరింత సౌకర్యవంతంగా ఎదుర్కోగలదు.

సీటులో కూడా ప్రత్యేక మార్పులు చేశారు. హై-రెసిలియన్స్ ఫోమ్‌ను ఉపయోగించడం వల్ల రోడ్డు నుంచి వచ్చే వైబ్రేషన్లు & ఇంజిన్ కంపనాలు తక్కువగా అనిపిస్తాయని కంపెనీ పేర్కొంది. అదనంగా అడ్జస్టబుల్ ఫ్రంట్ బ్రేక్ లివర్ & స్మోక్డ్ ఫ్లైస్క్రీన్‌ను కూడా ఈ మోడల్‌లో అందించారు.

అదే ఇంజిన్‌

అయితే ఇంజిన్ & పనితీరు పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో అదే 457cc ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 47.6 hp పవర్ & 43.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. నగర ప్రయాణాలు మాత్రమే కాకుండా హైవే రైడ్స్‌లో కూడా ఈ బైక్ అద్భుతమైన పనితీరును అందించనుంది.

ఫీచర్ల విషయానికి వస్తే 5 అంగుళాల TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఆధునిక సాంకేతికతలను కొనసాగించారు. బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ మాత్రం ఆప్షనల్ యాక్సెసరీగా అందుబాటులో ఉంటుంది.

డిజైన్ పరంగా కూడా ఈ బైక్ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. 2006 Aprilia Tuono 1000R నుంచి ప్రేరణ పొందిన మాంబా బ్లాక్ & ప్యూమా గ్రే అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లలో ఈ మోడల్‌ను అందిస్తున్నారు. స్పోర్టీ గ్రాఫిక్స్, అగ్రెసివ్ స్టైలింగ్ & ప్రీమియం ఫినిషింగ్ బైక్‌కు మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి.

ఎక్స్‌టెండెడ్‌ వారంటీ

కొత్త Tuono 457 Special Editionతో పాటు అప్రిలియా 4 సంవత్సరాలు లేదా 48,000 కిలోమీటర్ల వరకు ఎక్స్‌టెండెడ్‌ వారంటీ కూడా అందిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన Aprilia డీలర్‌షిప్‌లలో ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

స్టైలిష్ లుక్, శక్తివంతమైన ఇంజిన్, మెరుగైన కంఫర్ట్ & ప్రీమియం ఫీచర్లతో వచ్చిన Aprilia Tuono 457 Special Edition యువతకు, ముఖ్యంగా లాంగ్ రైడ్స్‌ను ఇష్టపడే కపుల్స్‌/ఫ్రెండ్స్‌కు ఆకర్షణీయమైన ఎంపికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

పెరిగింది రూ.15 వేలే.. కానీ కొత్త Ducati Monsterలో వచ్చిన మార్పులు ఇవీ!
కొత్త ఇంజిన్‌తో Ducati Monster V2.. పాత మోడల్‌కు దీనికి ఇంత తేడానా?
సింగిల్‌ ఛార్జ్‌తో 145 కి.మీ. హ్యాపీగా తిరిగిరావచ్చు.. కొత్త BGauss OoWah MAX Plus‌లో స్పెషల్ ఫీచర్లు!
145km రేంజ్ ఇచ్చే కొత్త BGauss ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌.. ఛార్జర్‌ పూర్తిగా ఉచితం
E20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లకు ముప్పే! కార్‌ కంపెనీల తనిఖీల్లో సంచలన విషయాలు
E20 పెట్రోల్‌ మీద మళ్లీ రచ్చ.. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక తేమ, రాష్ట్రాలవారీ వివరాలు లీక్‌
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Embed widget