Honda Activa EV ఎక్స్‌షోరూమ్, ఆన్‌రోడ్ ధర మధ్య వ్యత్యాసం ఎంత

Published by: Shankar Dukanam

భారత్‌లో అత్యధికంగా విక్రయాలు జరుపుకునే స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి. ఇది ఈవీ రూపంలోనూ లభిస్తుంది.

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ (Honda Activa EV) ప్రధానంగా రెండు వేరియంట్లలో లభిస్తుంది.

హోండా యాక్టివా ఈవీ పూర్తి ఛార్జింగ్‌పై సుమారు 100 కిలోమీటర్ల నుండి 102 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.

హైదరాబాద్‌లో Honda Activa e ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,19,912 వరకు ఉంది.

పీఎం ఈ డ్రైవ్ కింద రూ.5 వేలు డిస్కౌంట్ తరువాత హైదరాబాద్‌లో Honda Activa e ఆన్‌రోడ్ ధర 1,22,852 రూపాలుగా ఉంది.

ఎక్స్‌షోరూమ్ నగదు తరువాత ఆర్టీవో ఛార్జీలు 1,500, ఇన్సూరెన్స్‌కు రూ. 6,440 చెల్లించాలి.

ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్‌రోడ్ ధరల మధ్య వ్యత్యాసం రూ. 8 వేలకు పైగా ఉండగా.. రూ.5 వేలు డిస్కౌంట్ వల్ల వ్యత్యాసం రూ.3 వేలకు తగ్గింది

హోండా యాక్టివా ఈవీలో ఎకానమీ (Eco), నార్మల్ (Normal), స్పోర్ట్స్ (Sports) అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.

ఇందులో హోండాకు చెందిన 2 స్వాపబుల్ బ్యాటరీలను ఉపయోగించారు.