అన్వేషించండి

కొత్త Yezdi Scrambler రివ్యూ: పవర్‌ఫుల్ ఇంజిన్, తక్కువ బరువు ప్లస్‌లు - ఈ రెండు లోపాలు మైనస్‌లు!

2026 Yezdi Scrambler బైక్‌లో కొత్త ఇంజిన్, మెరుగైన రైడ్ క్వాలిటీ, తక్కువ బరువు, అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అయితే కొనే ముందు తెలుసుకోవాల్సిన 2 ముఖ్యమైన లోపాలు కూడా ఉన్నాయి.

2026 Yezdi Scrambler Price And Specifications: భారత ద్విచక్ర వాహన మార్కెట్లో స్క్రాంబ్లర్ బైక్‌లకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఈ సెగ్మెంట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు Classic Legends తాజాగా 2026 Yezdi Scramblerను కొన్ని కీలక మార్పులతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త స్టైలింగ్, అప్‌డేటెడ్ ఇంజిన్, తగ్గిన బరువు & ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్‌లు, స్విచబుల్ ABS వంటి ఆధునిక ఫీచర్లతో ఈ బైక్‌ను అప్‌గ్రేడ్ చేసింది.

ఈ బైక్‌ను కళ్లు మూసుకుని కొనేయొచ్చా? లేక కొన్ని విషయాల్లో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందా? 2026 Yezdi Scrambler కొనడానికి 4 ప్రధాన కారణాలు & కొనకుండా ఉండడానికి 2 కారణాలు ఇవే.

కొనడానికి 4 కారణాలు

1. శక్తివంతమైన లో & మిడ్ రేంజ్ పనితీరు

కొత్త Yezdi Scramblerలో 334cc ఇంజిన్‌ను అప్‌డేట్ చేశారు. ఇది 30 Hp పవర్ & 30 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా, తక్కువ వేగాల్లో కూడా ఇంజిన్ స్పందన చాలా మెరుగ్గా ఉంది. 

సిటీ ట్రాఫిక్‌లో 4వ గేర్‌లోనే గంటకు 25 కిలోమీటర్ల వేగం నుంచి సాఫీగా పికప్ అందించడం ఈ ఇంజిన్ ప్రత్యేకత. మిడ్ రేంజ్ పనితీరు కూడా బలంగా ఉండటంతో గతంలో వచ్చిన యెజ్డీ ఇంజిన్లతో పోలిస్తే ఇది అత్యంత రిఫైన్డ్ యూనిట్‌గా కనిపిస్తోంది.

2. మెరుగైన రైడ్ క్వాలిటీ

సస్పెన్షన్ సెటప్‌ను Classic Legends పూర్తిగా రీట్యూన్ చేసింది. స్ప్రింగ్ & డ్యాంపింగ్ సెట్టింగ్‌లలో చేసిన మార్పుల వల్ల రోడ్లపై గుంతలు, ఎత్తుపల్లాలను మరింత సౌకర్యంగా ఎదుర్కొంటుంది.

తక్కువ వేగాల్లో కూడా బైక్ స్థిరత్వం మెరుగ్గా ఉండటం గమనించదగ్గ విషయం. లైట్ ఆఫ్-రోడింగ్ లేదా వీకెండ్ అడ్వెంచర్ రైడ్‌లకు కూడా ఈ బైక్ సరిపోతుంది.

3. గణనీయంగా తగ్గిన బరువు

గత మోడల్‌లో ఉన్న డ్యూయల్ ఎగ్జాస్ట్ వ్యవస్థను తొలగించి సింగిల్ ఎగ్జాస్ట్‌ను అమర్చారు. దీంతో బైక్ బరువు దాదాపు 10 కిలోల వరకు తగ్గింది.

ప్రస్తుతం కర్బ్ వెయిట్ 184 నుంచి 186 కిలోల మధ్య ఉంది. కాగితంపై చూసేందుకు ఈ బరువు ఎక్కువగా కనిపించినప్పటికీ, రోడ్డుపై నడిపేటప్పుడు చాలా తేలికగా అనిపిస్తుంది. కొత్త రైడర్లకు కూడా ఇది సులభంగా హ్యాండిల్ చేయగలిగే బైక్‌గా ఉంటుంది.

4. డబ్బుకు తగిన విలువ

2026 Yezdi Scrambler ఎక్స్ షోరూమ్ ధర రూ.2 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ కలర్ ఆప్షన్‌కు రూ.2.09 లక్షల వరకు ఉంటుంది.

ఈ ధరలో Triumph Scrambler 400 X & Royal Enfield Scram 440 వంటి ప్రత్యర్థులతో పోలిస్తే గణనీయమైన ధర ప్రయోజనం ఉంది. తక్కువ బడ్జెట్‌లో మెరుగైన స్క్రాంబ్లర్ బైక్ కోరుకునేవారికి ఇది ఆకర్షణీయమైన ఎంపిక.

తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్‌ ధరలు:

Legacy Black ₹ 2,55,000 వరకు

Rogue Red and OG Yellow ₹ 2,72,000 వరకు

Rally Blue ₹ 2,75,000 వరకు

కొనకుండా ఉండడానికి 2 కారణాలు

1. స్క్రాంబ్లర్‌కు తగ్గంత భారీ రూపం లేదు

కొత్త స్టైలింగ్ బాగున్నప్పటికీ స్క్రాంబ్లర్ బైక్‌గా కనిపించాల్సినంత పెద్దగా ఈ బైక్ అనిపించదు.

ప్రత్యేకించి, పొడవైన రైడర్లకు ఎర్గోనామిక్స్ కొంత ఇరుకుగా అనిపించే అవకాశం ఉంది. మోకాళ్లు ఎక్కువగా వంగిన స్థితిలో ఉండటం & దీర్ఘ ప్రయాణాల్లో టెయిల్‌బోన్ వద్ద ఒత్తిడి పెరగడం కొంత అసౌకర్యంగా మారవచ్చు.

2. ఎలక్ట్రానిక్ ఫీచర్లలో గ్లిచ్‌లు

కొత్త ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్‌లు & ABS వంటి ఫీచర్లు కాగితాలపై ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవ వినియోగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి.

రైడింగ్ మోడ్ మార్చడానికి ఎక్కువ సమయం పట్టడం, కొన్ని సందర్భాల్లో మోడ్‌లు మారకపోవడం వంటి ఇబ్బందులు కనిపించాయి. అలాగే సైడ్ స్టాండ్ మడిచిన తర్వాత కూడా సెన్సార్ యాక్టివ్‌గా ఉండి బైక్ స్టార్ట్ కాకపోవడం వంటి సమస్యలు పరీక్షల్లో బయటపడ్డాయి.

ఈ కారణంగా ప్రస్తుత ఎలక్ట్రానిక్ ప్యాకేజ్ ఉపయోగకరమైన ఫీచర్‌గా కంటే అదనపు చికాకుగా అనిపించే అవకాశం ఉంది.

తుది మాట

2026 Yezdi Scrambler గత మోడల్‌తో పోలిస్తే అన్ని కీలక విభాగాల్లో గణనీయంగా మెరుగుపడింది. శక్తివంతమైన ఇంజిన్, మెరుగైన రైడ్ క్వాలిటీ, తగ్గిన బరువు & పోటీ ధర దీని ప్రధాన బలాలు. అయితే ఎలక్ట్రానిక్ వ్యవస్థల్లో ఉన్న చిన్నపాటి లోపాలు & కొంత ఇరుకైన ఎర్గోనామిక్స్‌ను కూడా కొనుగోలుదారులు పరిగణనలోకి తీసుకోవాలి. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Engine Layout: మీ కారు ఇంజిన్ ఎక్కడుంది? ముందు, వెనుక లేదా మధ్యలో.. ప్లేస్‌మెంట్‌ను బట్టి మారనున్న డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌!
మీ కారు ఇంజిన్‌ ముందు వైపు ఉందా, మధ్యలో ఉందా.. డ్రైవింగ్‌లో వచ్చే తేడా ఏంటి?
Car Tyre Pressure: కారు టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ చిన్న తప్పు వల్ల మైలేజీ తగ్గడమే కాదు, ప్రమాదం పెరుగుతుంది!
టైర్ ప్రెజర్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా? మైలేజీ, బ్రేకింగ్, టైర్ లైఫ్‌ మీద ఎంత ప్రభావమో తెలుసా?
Moto Guzzi The Trip: 457cc ఇంజిన్‌, 47.6hp పవర్‌తో కొత్త రెట్రో రెట్రో రోడ్‌స్టర్.. ఫీచర్లు, కలర్ ఆప్షన్లు
బైక్‌ పేరు Moto Guzzi The Trip.. 457cc ఇంజిన్‌తో వస్తున్న కొత్త ఇటలీ మోటార్‌సైకిల్‌
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget