అన్వేషించండి

Bajaj Freedom 125: లక్ష రూపాయల లోపే సీఎన్జీ బైక్‌! ట్యాంక్ ఫుల్ చేస్తే 300 కిలోమీటర్లు చూడాల్సిన పని లేదు!

Bajaj Freedom 125: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్ బజాజ్‌ ఫ్రీడమ్‌ 125 బైస్‌ ఎన్జీ04 డ్రమ్‌ వేరియంట్‌ కేవలం 95000 ఎక్స్‌ రూమ్‌ ధరతో లభిస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెరుగుతున్న పెట్రోల్ ధరలకు బజాజ్ సీఎన్‌జీ బైక్ పరిష్కారం.
  • ₹95,000తో ప్రారంభమయ్యే బేస్ డ్రమ్ వేరియంట్ విడుదలైంది.
  • ద్వంద్వ ఇంధన వ్యవస్థ నెలకు ₹1500 ఇంధన ఖర్చు ఆదా.
  • మైలేజ్, పొదుపును కోరుకునే వారికి ఉత్తమమైన ఎంపిక.

Bajaj Freedom 125: ప్రస్తుతం రోజుల్లో మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీ, డైలీ కమ్యూటర్స్‌ ఎదుర్కొంటున్న అతి పెద్ద తలనొప్పి ఏంటంటే?... ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్ ధరలు. లీటర్‌ పెట్రోల్‌ వంద దాటేసి సెంచరీ కొట్టడంతో బైక్ బయటకు తీయాలంటేనే జేబులు ఖాళీ అయిపోతున్నాయి. ఈ క్రమంలో టూ వీలర్‌ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తెస్తూ, ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ  మోటార్ సైకిల్ బజాజ్‌ ఫ్రీడమ్‌ 125ను బజాజ్ ఆటో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అయితే దీని టాప్ వేరియంట్‌ ధర కాస్త ఎక్కవగా ఉందని ఫీలయ్యే వారి కోసం బజాజ్‌ ఒక సూపర్ ఆప్షన్ తీసుకొచ్చింది. అదే అత్యంత తక్కువ ధరకే లభించే బజాజ్‌ ఫ్రీడమ్‌ 125 ఎన్‌జీం04 డ్రమ్‌ వేరియంట్‌ బేస్ మోడల్‌. 

కేవలం రూ. 95000 ప్రారంభ ధరతో లభించే ఈ బేస్‌ డ్రమ్‌ వేరియంట్‌ నిజంగానే ఇండియన్ కమ్యూటర్స్‌ మార్కెట్‌లో ఒక గేమ్‌ ఛేంజర్‌ కాబోతోందా? సాధారణం పెట్రోల్‌ బైకులతో పోలిస్తే ఇది మీ నెలవారి ఖర్చులను ఏకంగా 50 శాతం వరకు ఎలా తగ్గిస్తుంది? ఈ బేస్ మోడల్‌లో బజాజ్‌ ఎలాంటి ఫీచర్స్ ఇచ్చింది. టాప్ మోడల్స్‌తో పోలిస్తే ఇందులో ఏమేం మిస్ అవుతున్నారో ప్రతి ఒక్క విషయాన్ని ఏ టూ జెడ్ క్లియర్‌ కట్‌గా ఇన్‌డెప్త్‌ విశ్లేషణ ఇక్కడ చూద్దాం. 

బడ్జెట్‌ ధరలోనే సీఎన్జీ విప్లవం

బజాజ్‌ ఫ్రీడమ్‌ 125 బైక్ మొత్తంగా మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి డ్రమ్, డ్రమ్‌ ఎల్‌ఈడీ, డిస్క్‌ ఎల్‌ఈడీ. ఇందులో ఎంట్రీ లెవెల్‌ మోడల్ అయిన ఎన్జీ04 డ్రమ్‌ వేరియంట్‌ ధరను బజాజ్‌ అత్యంత పోటీతత్వంతో 95వేలుగా నిర్ణయించింది. ఇది మిడ్‌ వేరియంట్‌ కంటే దాదాపు 10వేలు, టాప్ వేరియంట్‌ కంటే 15వేలు తక్కువ ధరకే లభిస్తుంది. 

ఈ బేస్ వేరియంట్‌ను ముఖ్యంగా కాస్ట్‌ ఎఫెక్టివ్, గరిష్ట పొదుపును ఆశించే వినియోగదారును దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు. లుక్స్ పరంగా చూస్తే, ఇదే బేస్ మోడల్‌ అయినప్పటికీ దీని ఎక్స్‌ప్రెసివ్ డిజైన్‌,రోడ్‌ ప్రెజెన్స్‌ చాలా ప్రీమియంగా ఉంటాయి. వినూత్నమైన ట్రైల్లీస్‌ ఫ్రేమ్ డిజైన్‌తో వచ్చే ఈ బైక్‌, సాధారణ సీఎన్జీ బైక్ లాంటి లుక్ అస్సలు ఉండదు. 

ఇంజన్ పెర్ఫార్మెన్స్‌, డ్యూయల్‌- ఫ్యూయల్ టెక్నాలజీ

ఈ బైక్‌ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 124.58సీసీ ఎయిర్‌ కూల్డ్‌, సింగిల్‌ సిలిండర్‌ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 9.5 పీఎస్‌ పవర్‌ను 8000 ఆర్‌పీఎమ్‌ వద్ద 9.7 ఎన్‌ఎమ్‌ పీక్స్‌ టార్క్‌ను 5000 ఆర్‌పీఎమ్ వద్ద ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్‌ మ్యాన్యువల్‌ గేర్ బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. 

ఇందులోని అసలైన మ్యాజిక్ ఏంటంటే దీని డ్యూయల్‌ ఫ్యూయల్ సిస్టమ్‌. ఈ బైక్‌లో సీటు కింద సురక్షితంగా అమర్చిన 5కేజీల సీఎన్జీ సిలిండర్‌తోపాటు ముందు వైపు ఒక 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది. బైక్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు కూడా మీరు హ్యాండిల్‌ బార్‌పై ఉండే ఒక సాధారణ స్విచ్ నొక్కడం ద్వారా సీఎన్జీ నుంచి పెట్రోల్‌కు, పెట్రోల్ నుంచి సీఎన్జీకి చాలా స్మూత్‌గా మారవచ్చు. సీఎన్జీ అయిపోతే అటోమేటిక్‌గా పెట్రోల్‌ మోడ్‌లోకి మారే లింప్ హోమ్‌ ఫంక్షన్ ఇందులో ఉంది. 

మైలేజీ లెక్కలు సంగతి ఏంటీ?

బజాజ్‌ క్లెయిమ్‌ ప్రకారం, ఈ బైక్ సీఎన్జీ మోడ్‌లో ఏకంగా 102 కిలోమీటర్లు ప్రతి కేజీకి మైలేజ్ ఇస్తుంది. అదే పెట్రోల్ మోడ్‌లో నడిపితే లీటర్‌కు 65 కిలోమీటర్లు మైలేజ్ లభిస్తుంది రెండు ఇంధనాలను పూర్తిగా నింపితే 330 కిలోమీటర్లు దూసుకెళ్లవచ్చు. 

సాధారణంగా ఒక రోజుకు 50 కిలోమీటర్లు ప్రయాణించే వ్యక్తి పెట్రోల్‌ బైక్ వాడితే, లీటరుకు 105 రూపాయలు చొప్పున నెలకు దాదాపు 2500 నుంచి 3000 వరకు ఖర్చు అవుతుంది. అదే బజాజ్‌ ఫ్రీడమ‌ 125 డ్రమ్‌ వేరియంట్‌ వాడితే, కేజీ సీఎన్జీ ధ సుమారు 85-90 అనుకున్నా, నెలు దాదాపు 1200 నుంచి 1300 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అటే ప్రతీ నెలా మీ జేబులో 1500 వరకు ఆదాయం మిగులుతుంది. 

బేస్‌ డ్రమ్‌ వేరియంట్‌ ఫీచర్స్

తక్కువ ధరకే లభిస్తోంది కాబట్టి బజాజ్‌ బేస్‌ మోడల్‌ కొన్ని ఫీచర్స్ తగ్గించింది. హయ్యర్‌ వేరియంట్‌లో హాలోజన్ బల్బ్‌ సెటప్ ఉంటుంది. అయితే టెయిల్ ల్యాంప్‌ మాత్రం ఎల్‌ఈడీగానే వస్తుంది. ఇందులో ఫుల్‌ ఎల్‌సీడీ కన్సో్‌ డిజిటల్‌ స్పీడోమీటర్‌ను ఇచ్చారు. కానీ టాప్‌ మోడల్‌లో ఉండే బ్లూటత్‌ కనెక్టివిటీ, కాల్‌/ఎస్‌ఎమ్‌ఎస్‌ అలర్ట్స్‌ ఫీచర్స్ ఇందులో ఉండవు. 

ఇంజన్ రక్షణ కోసం కింద ఉండే బాష్‌ప్లేట్‌ ఈ బేస్‌ మోడల్‌లో కేవలం షీట్‌ మెటల్‌తో వస్తుంది. అలాగే ఇందులో ఇంధన ట్యాంక్‌పై ఉండే ట్యాంక్‌ కవర్‌ ఫ్లాప్‌ మిస్ అవుతుంది. దీని రెండు చక్రాలై 80-సెక్షన్ టైర్స్‌ ఉంటాయి. టాప్ వేరియంట్‌ లాగా వెనుకవైపు లావుపాటి 120 సెక్షన్‌ టైర్ ఇందులో ఉండదు. 

రైడ్ కంఫర్ట్‌, సేఫ్టీ

బేస్‌ వేరియంట్‌ అయినప్పటికీ రైడింగ్‌ కంఫర్ట్‌, సేఫ్టీ విషయంలో బజాజ్‌ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ బైక్‌లో సెగ్మెంట్‌లోనే అత్యంత పొడవైన 785మిమి లాంగెస్ట్‌ సీట్‌ను ఇచ్చారు. దీని వల్ల రైడర్‌, పిలియన్‌ ఇద్దరూ చాలా కంఫర్టబుల్‌గా లాంగ్‌ రైడ్స్‌ చేయవచ్చు. సస్పెన్షన‌ కోసం ముందు వైపు టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌, వెనుకవైపు సెగ్మెంట్‌ ఫస్ట్‌ లింక్డ్‌ మోనోషాక్‌ సస్పెన్షన్‌ను ఇచ్చారు. ఇది గుంతల రోడ్లపై కూడా అద్భుతమైన రైడ్ క్వాలిటీని అందిస్తుంది. 

బ్రేకింగ్‌ విషయానికి వస్తే పేరుకు తగ్గట్టే ఇందులో ముందు వైపు 130 మిమి డ్రమ్ బ్రేక్‌, వెనుకవైపు 110మిమి డ్రమ్‌ బ్రేక్ అమర్చి ఉంటుంది. వీటికి తోడుగా కంబైన్డ్‌ బ్రేకింగ్ సిస్టమ్‌ టెక్నాలజీని జోడించడం వల్ల,మ మీకు వెనుక బ్రేక్ వేసినప్పుడు ముందు బ్రేక్ కూడా ఆటోమేటిక్‌గా అప్లై అయి బైక్ స్కిడ్ అవ్వకుండా సురక్షితంగా ఆగిపోతుంది. ఇక ఈ బైక్‌లోని సీఎన్జీ సిలిండర్‌ అనేది కఠినమైన PESOటెస్టులను దాటుకొని సర్టిఫై అయ్యింది. కాబట్టి భద్రతపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. 

బజాజ్‌ ఫ్రీడమ్‌ 125 డ్రమ్ వేరియంట్‌ ఎవరికి బెస్ట్ ఛాయిస్‌?

ఎవరైతే రోజుకు 40 నుంచి 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తూ, కేవలం మైలేజ్‌, ఇంధన ఖర్చుల తగ్గించాలని భావిస్తారో వారికి ఈ బేస్‌ డ్రమ్‌ మోడ్ ఒక వరప్రసాదం. ఫ్యాన్సీ, ఎల్‌ఈడీ లైట్లు, బ్లూటూ్‌ ఫీచర్లు లేకపోయినా, బైక్ కోర్ పర్పస్‌ అయిన మైలేజ్, సేవింగ్స్ విషయంలో ఇది వందకు వంద మార్కులు కొట్టేస్తుంది. రోజువారీ ఆఫీస్ గోయర్స్, డెలివీ బాయ్స్, బడ్జెట్‌ కాన్షియస్ మిడిల్ క్లాస్‌ పీపుల్‌కు ఇది మోస్ట్‌ రికమెండెడ్‌ బైక్‌. 

Frequently Asked Questions

బజాజ్ ఫ్రీడమ్ 125 ప్రత్యేకత ఏమిటి?

ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ మోటార్‌సైకిల్. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇది డ్యూయల్-ఫ్యూయల్ టెక్నాలజీతో ఇంధన ఖర్చులను 50% వరకు తగ్గిస్తుంది.

బజాజ్ ఫ్రీడమ్ 125 ఎన్‌జీం04 డ్రమ్ వేరియంట్ ప్రారంభ ధర ఎంత? దీనితో ఎంత ఆదా చేయవచ్చు?

ఈ బేస్ మోడల్ ప్రారంభ ధర రూ. 95,000. సాధారణ పెట్రోల్ బైక్ తో పోలిస్తే, ఇది నెలవారీ ఖర్చులను దాదాపు 50 శాతం వరకు తగ్గిస్తుంది, సుమారు నెలకు రూ. 1500 ఆదా చేస్తుంది.

బజాజ్ ఫ్రీడమ్ 125 మైలేజ్ ఎంత?

సీఎన్జీ మోడ్‌లో ఇది ప్రతి కేజీకి 102 కి.మీ. మైలేజీని, పెట్రోల్ మోడ్‌లో లీటరుకు 65 కి.మీ. మైలేజీని ఇస్తుంది. రెండు ఇంధనాలను పూర్తిగా నింపితే 330 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు.

బజాజ్ ఫ్రీడమ్ 125 లో డ్యూయల్ ఫ్యూయల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?

ఇందులో సీటు కింద 5కేజీల సీఎన్జీ సిలిండర్, ముందు వైపు 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంటాయి. హ్యాండిల్ బార్‌లోని స్విచ్ ద్వారా సీఎన్జీ, పెట్రోల్‌ మధ్య సులభంగా మారవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget