అన్వేషించండి

Honda Activa 125 vs Bajaj Chetak C2501: హోండా యాక్టివా125 vs బజాజ్‌ చేతక్‌ C2501! మధ్యతరగతి బాస్‌ ఎవరు?

Honda Activa 125 vs Bajaj Chetak C2501: బైక్ కొనే ముందు హోండా యాక్టివా125 పెట్రోల్ స్కూటర్, బజాజ్‌ చేతక్ C2501 ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య సమగ్ర పోలిక తెలుసుకోవడం చాలా అవసరం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోండా యాక్టివా 125 పెట్రోల్ ధర చేతక్ ఎలక్ట్రిక్ కంటే తక్కువ.
  • యాక్టివా 90కిమీ/గం వేగంతో, చేతక్ 55కిమీ/గం వేగంతో నడుస్తుంది.
  • యాక్టివా 47కిమీ/లీ మైలేజ్, చేతక్ 113కిమీ రేంజ్ ఇస్తుంది.
  • చేతక్ ఆధునిక బ్లూటూత్ ఫీచర్లను కలిగివుండగా, యాక్టివాలో తక్కువ.

Honda Activa 125 vs Bajaj Chetak C2501: మీరు కొత్త స్కూటర్ కొనే ప్లాన్‌లో ఉన్నారా అయితే మీ మైండ్ కచ్చితంగా ఒకే ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది. "సంప్రదాయ పెట్రోల్ స్కూటర్‌ కొందామా లేకా ట్రెండీ ఎలక్ట్రిక్ స్కూటర్ వైపు వెళ్దామా?" ఒకవైపు దశాబ్దాలుగా ఇండియన్ రోడ్లపై తిరుగులేని రారాజుగా వెలుగుతున్న హోండా యాక్టివా 125, మరోవైపు క్లాసిక్ లుక్స్‌తో ఎలక్ట్రిక్ ప్రపంచంలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బజాజ్‌ చేతక్‌ C2501. ఈ రెండిండిలో మీ అవసరాలకు తగ్గట్టుగా మీ జేబుకు చిల్లుపడకుండా ఉండే స్కూటర్ ఏదో తేల్చుకోవడం ఇప్పుడు ఒక పెద్ద టాస్క్‌ అయిపోయింది. బడ్జెట్‌, మైలేజ్, పెర్ఫార్మెన్స్‌లో ఏది టాప్, హోండా ఇచ్చే భరోసా బెటరా? లేకా బజాజ్ అందిచే మోడ్రన్ టెక్నాలజీ గొప్పదా? పూర్తి విశ్లేషణ ఇక్కడ చూడండి. 

మీ జేబుకు ఏది సెట్ అవుతుంది?

ఏ వాహనం కొనాలన్నా మనం మొదట చూసేది ధర. ఇక్కడ హోండా యాక్టివా 125 స్పష్టమైన ఆధిక్యాన్ని చూపిస్తోంది. దీని ఎక్స్‌షో రూమ్‌ ధర కేవలం 90,178 రూపాయలు. అదే ఆన్‌రోడ్ ధర సుమారు 1, 05, 708 రూపాయలు. ఇక బజాజ్ చేతక్‌ C 2501 విషయానికి వస్తే, దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర 1,35, 306 రూపాయలు ఉంటే ఆన్‌రోడ్‌ ప్రైస్‌ 1, 39, 926 రూపాయులుగా ఉంది. అంటే పెట్రోల్ స్కూటర్ కంటే ఎలక్ట్రిక్ చేతక్ సుమారు 34,000పైనే ఎక్కువ ఖరీదు. అయితే పెట్రోల్‌ ఖర్చులు ఉండవు కాబట్టి లాంగ్ రన్‌లో చేతక్‌ సేవింగ్స్ ఇస్తుందని మనం గుర్తించాలి. 

ఇంజిన్ పవర్‌  vs మోటార్‌ పర్ఫార్మెన్స్‌

హోండా యాక్టివా 125లో బలమైన 123. 92cc, 4-స్ట్రోక్‌ ఎస్‌ ఇంజిన్ ఉంది. ఇది 8.42పీఎస్‌ పవర్‌ను, 10.5Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీని గరిష్ట వేగం 90kmphగా ఉంది. మరోవైపు బజాచ్‌ చేతక్‌ C2501 ఒక ఎలక్ట్రిక్ హబ్‌ మోటార్‌తో వస్తుంది. దీని గరిష్ట వేగం కేవలం 55km/Hr మాత్రమే. వేగంగా వెళ్లాలనుకునే వారికి యాక్టివా బెస్ట్ ఛాయిస్‌. సిటీలో కూల్‌గా వెళ్లాలనుకునే వారికి చేతక్ సరిపోతుంది. 

మైలేజ్‌, రేంజ్ లెక్కల సంగతి ఏంటీ?

మైలేజ్ విషయంలో యాక్టివా 125 లీటర్‌కు 47kmpl మైలేజ్‌ ఇస్తుంది. దీని ఫ్యూయల్‌ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. అంటే ఫుల్ ట్యాంక్ చేస్తే దాదాపు 250కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇక చేతక్‌ C2501 ఎలక్ట్రిక్‌ రేంజ్ అద్భుతంగా ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 113కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ క్లెయిమ్‌ చేస్తోంది. దీనిని పుల్ ఛార్జ్ చేయడానికి కేవలం 3.45 గంటల సమయం మాత్రమే పడుతుంది. 

టెక్నాలజీలో ఎవరు తోపు ?

ఫీచర్ల విషయంలో చేతక్ కాస్త అడ్వాన్స్‌డ్‌గా ఉంది. ఇందులో బ్లూటూత్‌ కనెక్టివిటీ, కాల్స్, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్, హిల్ హోల్డ్, రివర్స్ అసిస్ట్‌, వంటి స్మార్ట్ పీచర్లు ఉన్నాయి. యాక్టివాలో కూడా సెమీ డిజిటల్ కన్సోల్‌, యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్, ఎక్స్‌టర్నల్‌ ఫ్యూయల్‌ ఫీలింగ్ వంటి ప్రాక్టికల్‌ ఫీచర్లు ఉన్నాయి. అయితే చేతక్ మెటల్ బాడీ దీనికి ప్రీమియం లుక్ ఇస్తుంది. 

Frequently Asked Questions

హోండా యాక్టివా 125 మరియు బజాజ్ చేతక్ C2501 మధ్య ధర వ్యత్యాసం ఎంత?

హోండా యాక్టివా 125 ఎక్స్-షోరూమ్ ధర ₹90,178 కాగా, బజాజ్ చేతక్ C2501 ధర ₹1,35,306. చేతక్ సుమారు ₹34,000 ఎక్కువ ఖరీదు.

వేగం పరంగా యాక్టివా 125 మరియు చేతక్ C2501లో ఏది ఎక్కువ?

హోండా యాక్టివా 125 గరిష్ట వేగం 90 kmph. బజాజ్ చేతక్ C2501 గరిష్ట వేగం కేవలం 55 km/hr.

మైలేజ్ లేదా రేంజ్ విషయంలో ఈ రెండు స్కూటర్లలో ఏది మెరుగు?

యాక్టివా 125 లీటరుకు 47kmpl మైలేజ్ ఇస్తుంది. చేతక్ C2501 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 113 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

టెక్నాలజీ ఫీచర్లలో ఏ స్కూటర్ ముందంజలో ఉంది?

బజాజ్ చేతక్ C2501 బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్స్, SMS అలర్ట్స్, హిల్ హోల్డ్, రివర్స్ అసిస్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లతో ముందంజలో ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hybrid SUV: 1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
Car Coolant: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
Top Car Exports From India 2026: భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా? 
భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా?
Alloy Wheel or Steel Wheel: అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!
అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget