అన్వేషించండి

హీరో ప్యాషన్ ప్లస్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌, బ్లూటూత్ డిస్‌ప్లే కూడా - కొత్త వేరియంట్‌లో అదిరే ఫీచర్లు

హీరో మోటోకార్ప్ కొత్త ప్యాషన్+ డిస్క్ వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్లూటూత్ డిజిటల్ డిస్‌ప్లే, i3S టెక్నాలజీ, 71 km మైలేజ్‌తో వచ్చిన ఈ బైక్ ఫీచర్లు, ధర & ప్రత్యేకతలు తెలుసుకోండి.

Hero Passion+ Disc variant Price And Features: హీరో మోటోకార్ప్, తన ప్రీమియం 100cc కమ్యూటర్ బైక్ ప్యాషన్+కు కొత్త డిస్క్ వేరియంట్‌ను మన మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త హీరో ప్యాషన్+ డిస్క్ వేరియంట్ ధర రూ.84,128 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్యాషన్+ డ్రమ్ వేరియంట్ కంటే ఈ మోడల్ ధర మాత్రమే రూ.3,800 ఎక్కువ. 

కొత్త ప్యాషన్+ డిస్క్ వేరియంట్‌లో ప్రధాన ఆకర్షణ 240 మిల్లీమీటర్ల ఫ్రంట్ డిస్క్ బ్రేక్. గతంలో ఉన్న 130 మిల్లీమీటర్ల డ్రమ్ బ్రేక్ స్థానంలో దీనిని అందించారు. దీంతో బ్రేకింగ్ పనితీరు మరింత మెరుగవుతుందని, సేఫ్టీ పెరుగుతుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఇది మరింత భద్రతను అందించనుంది.

బ్లూటూత్ సపోర్ట్‌
ఈ కొత్త వేరియంట్‌లో మరో ప్రధాన ఆకర్షణ బ్లూటూత్ సపోర్ట్‌ ఉన్న పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకుంటే కాల్ అలర్ట్స్, SMS నోటిఫికేషన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్లు & లో ఫ్యూయల్ వార్నింగ్ వంటి ఉపయోగకరమైన సమాచారం కూడా డిస్‌ప్లే మీద కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: క్లాసిక్ లుక్, అద్భుతమైన పవర్.. లాంగ్ రైడ్‌లకు ఈ 3 బైక్‌లో మీకు ఏది బెస్ట్

హీరో ప్యాషన్+లో 97.2cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 8 hp శక్తిని 8,000 rpm వద్ద & 8.05 Nm టార్క్‌ను 6,000 rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇంధనాన్ని ఆదా చేసే హీరో ఐత్రీఎస్ (i3S) స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. కంపెనీ తెలిపిన ప్రకారం ఈ బైక్ లీటరుకు 71 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. సాధారణ & జాగ్రత్తగా నడిపితే ఈ మైలేజ్‌ను సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ & వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లను అమర్చారు. ట్యూబులర్ స్టీల్ క్రేడిల్ ఫ్రేమ్‌పై ఈ బైక్‌ను నిర్మించారు. కొత్త డిస్క్ వేరియంట్ బరువు 116 కిలోలు కాగా, డ్రమ్ వేరియంట్ కంటే ఇది ఒక కిలో ఎక్కువ.

ఇది కూడా చదవండి: టైర్‌పై ఈ అక్షరాన్ని నిర్లక్ష్యం చేస్తే భారీ ప్రమాదమే!, దాని అర్థం తెలుసా - బీమా క్లెయిమ్ కూడా రాకపోవచ్చు!

భద్రత కోసం సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. గేర్‌లో ఉన్న సమయంలో సైడ్ స్టాండ్ దించిన వెంటనే ఇంజిన్ ఆగిపోతుంది. అలాగే ఇంజిన్ పైన చిన్న స్టోరేజ్ క్యూబీతో పాటు USB ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందించడం డైలీ రైడర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.

రంగులు
కొత్త హీరో ప్యాషన్+ డిస్క్ వేరియంట్... రెడ్, బ్లూ, బ్లాక్ & గ్రే రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు కొత్త గ్రాఫిక్స్‌తో మరింత ఆకర్షణీయమైన లుక్‌ను కంపెనీ ఇచ్చింది. ప్రస్తుతం హీరో 100cc బైక్‌లలో ప్యాషన్+ డిస్క్ & స్ప్లెండర్ ఎక్స్‌టెక్ డిస్క్ మాత్రమే ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో అందుబాటులో ఉన్నాయి. హోండా & బజాజ్ 100cc బైక్‌లలో ఈ ఫీచర్ లేకపోవడం హీరోకు అదనపు ప్రయోజనంగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
ట్రయంఫ్ ట్రాకర్ 400 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్.. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్ వ్యవస్థల నిజమైన పనితీరు ఇదే!
100 కి.మీ. వేగం 7.55 సెకన్లలోనే.. Triumph Tracker 400 సూపర్‌ పెర్ఫార్మెన్స్‌!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో దిగొచ్చిన ధరలు, పూర్తి లెక్క ఇదిగో
టాటా EVలపై భారీ తగ్గింపు.. కొత్త స్కీమ్‌తో రూ.7.30 లక్షల వరకు ఆదా!

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Athletics Gold Rush: ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Bowling Coach Reunion: చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Embed widget