అన్వేషించండి

కొత్త లుక్‌లో TVS Ntorq 125 - హైదరాబాద్, విజయవాడలో ఆన్‌రోడ్ ధరలు ఇవే

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌కు కొత్త కలర్స్ & గ్రాఫిక్స్‌ను కంపెనీ పరిచయం చేసింది. హైదరాబాద్ & విజయవాడలో డిస్క్ & రేస్ ఎడిషన్ వేరియంట్ల ఆన్‌రోడ్ ధరలను తెలుసుకోండి.

TVS Ntorq 125 Price And Features: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, తన పాపులర్‌ స్పోర్టీ స్కూటర్ ఎన్‌టార్క్ 125కు కొత్త కలర్స్ & గ్రాఫిక్స్‌ను పరిచయం చేసింది. ఎన్‌టార్క్ 125లో అత్యంత అందుబాటు ధరలో లభించే డిస్క్ & రేస్ ఎడిషన్ వేరియంట్లకు ఈ కొత్త రంగులను అందించింది. కొత్త కలర్స్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన నెగెటివ్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అందించడం విశేషం. కొత్త ఫీచర్లతో స్కూటర్ మరింత స్టైలిష్‌గా కనిపించడంతో పాటు టెక్నాలజీ పరంగానూ మరింత మెరుగైంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 డిస్క్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధరను రూ.82,500గా నిర్ణయించగా, రేస్ ఎడిషన్ ధర రూ.87,950గా ఉంది. కొత్త రంగులను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీ, ఇంజిన్ & ఇతర మెకానికల్ అంశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

డిస్క్ వేరియంట్ ఇప్పుడు బ్లాక్, వైట్ & గ్రే రంగుల్లో లభిస్తోంది. వీటిపై యెల్లో & ఆరెంజ్ గ్రాఫిక్స్‌ను జోడించి మరింత ఆకర్షణీయమైన లుక్ ఇచ్చారు. మరోవైపు... రేస్ ఎడిషన్ బ్లూ, రెడ్ & గ్రీన్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. వీటికి స్పోర్టీ స్టైల్ గ్రాఫిక్స్‌ను అందించి యువతను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.

ఇది కూడా చదవండి: హీరో ప్యాషన్ ప్లస్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌, బ్లూటూత్ డిస్‌ప్లే కూడా - కొత్త వేరియంట్‌లో అదిరే ఫీచర్లు

ఈ రెండు వేరియంట్లలోనూ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కొత్త నెగెటివ్ LCD డిస్‌ప్లేను TVS అందించింది. కంపెనీ సొంత మొబైల్ యాప్ ద్వారా స్కూటర్‌ను స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతో కాల్ అలర్ట్స్, నావిగేషన్ & ఇతర ఉపయోగకరమైన సమాచారం డిస్‌ప్లేపై చూడొచ్చు.

ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న అదే 124.8cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో స్కూటర్ కొనసాగుతోంది. మంచి పనితీరు & స్పోర్టీ రైడింగ్ అనుభవం కారణంగా ఎన్‌టార్క్ 125 యువతలో మంచి ఆదరణ పొందుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కూటర్ ఆన్‌రోడ్ ధరలు: CNG ఆటోమేటిక్ కారు కొనాలని చూస్తున్నారా ? ఈ లిస్ట్ చూసి డిసైడ్ అవ్వండి

హైదరాబాద్‌లో డిస్క్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.82,500 కాగా, RTO ఛార్జీలు రూ.11,400 & సమగ్ర బీమా రూ.6,181, ఇతర ఖర్చులు కలిపి ఆన్‌రోడ్ ధర సుమారు రూ.1,02,000 అవుతుంది.

విజయవాడలో ఇదే డిస్క్ వేరియంట్‌ ఎక్స్ షోరూమ్ ధర రూ.82,500. RTO ఛార్జీలు రూ.11,400, 10 శాతం సెస్ రూ.1,140, సమగ్ర బీమా రూ.6,151, ఇతర ఖర్చులు కలిపి ఆన్‌రోడ్ ధర సుమారు రూ.1,03,000 అవుతుంది.

ఇది కూడా చదవండి: 

రేస్ ఎడిషన్ (TVS Ntorq 125 Race Edition‌) విషయానికి వస్తే... హైదరాబాద్‌లో ఎక్స్ షోరూమ్ ధర రూ.87,950. ఆర్టీఓ ఛార్జీలు రూ.12,054 & సమగ్ర బీమా రూ.6,285, ఇతర ఖర్చులు కలిపి ఆన్‌రోడ్ ధర సుమారు రూ.1,08,000 అవుతుంది.

విజయవాడలో రేస్ ఎడిషన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.87,950. ఆర్టీఓ ఛార్జీలు రూ.12,054, 10 శాతం సెస్ రూ.1,205, సమగ్ర బీమా రూ.6,253, ఇతర ఖర్చులు కలిపి ఆన్‌రోడ్ ధర సుమారు రూ.1,09,000 అవుతుంది.

కొత్త రంగులు, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ డిస్‌ప్లే వంటి మార్పులతో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఇప్పుడు మరింత స్టైలిష్‌గా మారింది. కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ వేరియంట్లు మంచి ఎంపికగా నిలిచే అవకాశముంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget