అన్వేషించండి

ప్రతి ఎత్తైన కారూ SUV కాదు - 'క్రాస్‌ఓవర్'కు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాల్సిందే

భారత్‌లో ప్రతి ఎత్తైన కారునూ SUVగా పిలవడం సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. క్రాస్‌ఓవర్ కార్లకు ప్రత్యేక కేటగిరీ తీసుకురావాలని, వినియోగదారులు కూడా ఈ మార్పును అంగీకరించాలని సూచిస్తున్నారు.

Crossover Cars in India in 2026: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తోంది. కాస్త ఎత్తైన బాడీ, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న దాదాపు ప్రతి కారునూ కంపెనీలు 'SUV'గా ప్రచారం చేస్తున్నాయి. అయితే నిజంగా అవన్నీ ఎస్‌యూవీలేనా? అనే ప్రశ్న ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. హ్యాచ్‌బ్యాక్ & సంప్రదాయ SUV మధ్యలో ఉండే వాహనాలకు 'క్రాస్‌ఓవర్' అనే ప్రత్యేక గుర్తింపు ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆటో నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం, భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (SIAM) వర్గీకరణలో అనేక విభిన్న స్వభావం కలిగిన కార్లు ఒకే 'యుటిలిటీ వెహికల్' విభాగంలో ఉన్నాయి. ఉదాహరణకు.. థార్, బొలెరో, గుర్ఖా, జిమ్నీ వంటి నిజమైన ఆఫ్‌రోడ్ SUVలతో పాటు ఫ్రాంక్స్, ఎక్స్‌టర్, సైరోస్, మాగ్నైట్ వంటి నగర వినియోగానికి అనువైన కార్లు కూడా అదే విభాగంలో ఉన్నాయి. కానీ థార్ & ఫ్రాంక్స్‌ను లేదా గుర్ఖా & ఎక్స్‌టర్‌ను ఒకే తరహా వాహనాలుగా పోల్చడం ఎంతవరకు సరైనదనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇది కూడా చదవండి: రూ.2,399కే స్మార్ట్ డ్రైవింగ్ అనుభవం - జియో కార్ సింక్ డివైస్ ప్రత్యేకతలు ఇవే!

క్రాస్‌ఓవర్ అంటే హ్యాచ్‌బ్యాక్ & ఎస్‌యూవీ మధ్య ఉండే బాడీ స్టైల్. ఇవి సాధారణ హ్యాచ్‌బ్యాక్‌ల కంటే ఎత్తుగా ఉంటాయి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో సంప్రదాయ ఎస్‌యూవీలంత భారీగా లేదా అంత ఆఫ్‌రోడ్ సామర్థ్యంతో ఉండవు. ఎక్కువ సందర్భాల్లో వీటిలో ఫోర్ వీల్ డ్రైవ్ (4WD) కూడా ఉండదు. అయితే నగర రోడ్లపై గుంతలు, గ్రామీణ ప్రాంతాల్లోని మట్టి రోడ్లను సులభంగా దాటే సామర్థ్యాన్ని అందిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ తరహా వాహనాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అమెరికాలో వీటిని 'క్రాస్‌ఓవర్ ఎస్‌యూవీలు'గా పిలుస్తారు. యూరప్‌లో మాత్రం 'క్రాస్‌ఓవర్' అనే పేరే ఎక్కువగా వాడుకలో ఉంది. టయోటా RAV4, నిస్సాన్ కిక్స్, హ్యుందాయ్ టక్సాన్, వోక్స్‌వ్యాగన్ టిగువాన్, ప్యూజియట్ 3008 వంటి మోడళ్లు క్రాస్‌ఓవర్లుగానే గుర్తింపు పొందాయి. లగ్జరీ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ GLA, వోల్వో XC40, ఆడి Q3 వంటి మోడళ్లు కూడా ఇదే కేటగిరీలోకి వస్తాయి. ఆయా కంపెనీలు కూడా వాటిని క్రాస్‌ఓవర్లుగానే ప్రచారం చేస్తాయి.

ఇది కూడా చదవండి: వర్షాకాలంలో కార్ డ్రైవింగ్‌ అలర్ట్ - ఈ టిప్స్ మీ తెలిస్తేనే ప్రమాదాలకు చెక్, హ్యాపీ జర్నీ

భారత మార్కెట్లో మాత్రం 'క్రాస్‌ఓవర్' అనే పదానికి ఇప్పటికీ పెద్దగా గుర్తింపు లేదు. మార్కెటింగ్ పరంగా 'ఎస్‌యూవీ' అనే పదానికి ఉన్న ఆదరణ కారణంగా దాదాపు ప్రతి ఎత్తైన కారునూ అదే పేరుతో విక్రయిస్తున్నారు. దీంతో, కార్‌ కొనేవాళ్లలో కూడా గందరగోళం ఏర్పడుతోంది. ఆఫ్‌రోడ్ సామర్థ్యం అవసరమే లేని వాళ్లు కూడా కేవలం ఎస్‌యూవీ అనే పేరు చూసి వాహనాలను ఎంచుకునే పరిస్థితి ఏర్పడుతోంది.

ప్రస్తుతం భారతీయ వినియోగదారుల అవసరాలు కూడా మారుతున్నాయి. హ్యాచ్‌బ్యాక్ కంటే ఎక్కువ స్థలం, మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ పొజిషన్ కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో భారీ ఎస్‌యూవీలను కొనుగోలు చేయాల్సిన అవసరం అందరికీ ఉండదు. అలాంటి వారికి క్రాస్‌ఓవర్ కార్లు మరింత అనువైన ఎంపికగా నిలుస్తాయి.

ఈ నేపథ్యంలో, SIAM కూడా క్రాస్‌ఓవర్ అనే ప్రత్యేక వాహన విభాగాన్ని అధికారికంగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఆటోమొబైల్ కంపెనీలు కూడా మార్కెటింగ్ కోసం ప్రతి కారునూ ఎస్‌యూవీగా ప్రచారం చేయకుండా, నిజమైన బాడీ స్టైల్‌ను స్పష్టంగా తెలియజేయాలని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన క్రాస్‌ఓవర్లు మరింత ప్రజాదరణ పొందే అవకాశం ఉందని ఆటో రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
కొత్త హ్యుందాయ్ వెర్నా కోసం రూ.3 లక్షలు లేదా రూ.5 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే EMI ఎంత మారుతుంది?
Hyundai Verna EMI: రూ.15,000 లోపు EMIతో హ్యుందాయ్‌ వెర్నా కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి?
మీ హెల్మెట్‌ వైజర్‌ పొగమంచుతో మసకబారుతోందా? పిన్‌లాక్‌ గురించి ప్రతి బైక్‌ రైడర్‌ ఈ విషయాలు తెలుసుకోవాలి
పిన్‌లాక్‌ ఉంటే చలికాలంలో కూడా మీ హెల్మెట్‌ వైజర్‌ మీద ఫాగ్‌ పేరుకుపోదు! ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసా?
Car Polish vs Wax: కారు మెరుపు కోసం పాలిష్ మాత్రమే సరిపోదు! పెయింట్ రక్షణకు వ్యాక్స్ కూడా అవసరమే!
కారు పాలిష్ చేయాలా.. వ్యాక్స్ వేయాలా? తేడా ఇదే.. ముందుగా ఏది చేయాలో తెలుసుకోండి

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget