అన్వేషించండి

అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు

Delhi EV Policy 2026 ప్రకారం, 2028 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లకే రిజిస్ట్రేషన్ ఉంటుంది. EV కొనుగోలుదారులకు రూ.30 వేల వరకు ప్రోత్సాహకం ఉంటుంది.

Delhi EV policy 2.0: దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేసే దిశగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Delhi EV Policy 2026కు రాష్ట్ర మంత్రివర్గం అధికారిక ఆమోదం తెలిపింది. ఈ కొత్త పాలసీ జులై 1, 2026 నుంచి అమల్లోకి రానుండగా, మార్చి 31, 2030 వరకు అమలులో ఉంటుంది. ఈ పాలసీలో అత్యంత కీలకమైన నిర్ణయం ఏమిటంటే... 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్తగా కేవలం ఎలక్ట్రిక్ టూవీలర్లకే రిజిస్ట్రేషన్లు మాత్రమే అనుమతిస్తారు. అంటే, ఆ తేదీ తర్వాత కొత్త పెట్రోల్ & డీజిల్ టూవీలర్ల రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉండదు.

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్ కొనుగోలు చేసే వారికి గరిష్ఠంగా రూ.30,000 వరకు కొనుగోలు ప్రోత్సాహకం అందించనుంది. ఎలక్ట్రిక్ త్రీ వీలర్లకు రూ.50,000 వరకు & N1 గూడ్స్ వాహనాలకు రూ.1 లక్ష వరకు ప్రోత్సాహకం లభించనుంది. ఈ మొత్తాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇది కూడా చదవండి: ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైనే! సరికొత్త మారుతి సుజుకి 7 సీటర్ ఈవీ ఫీచర్స్ ఇవే!

స్క్రాపేజ్ బెనిఫిట్ కూడా...
కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో పాత వాహనాలను తొలగించి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి ప్రత్యేక స్క్రాపేజ్ ప్రోత్సాహకాలు కూడా అందించనున్నారు. వాహనం కేటగిరీని బట్టి రూ.5,000 నుంచి రూ.1 లక్ష వరకు స్క్రాపేజ్ బెనిఫిట్ ఇవ్వనున్నారు. దీంతో పాత కాలుష్యకారక వాహనాల స్థానంలో EVలను కొనుగోలు చేయడానికి వినియోగదారులకు మరింత ప్రోత్సాహం లభించనుంది.

ఈ పాలసీలో వాహనాల కేటగిరీల వారీగా ప్రత్యేక గడువులు కూడా నిర్ణయించారు. ఆటోరిక్షాలు & N1 గూడ్స్ వాహనాలకు మరింత ముందుగానే నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 2027 జనవరి 1 నుంచి ఢిల్లీలో కొత్తగా నమోదయ్యే ఆటోరిక్షాలు & N1 గూడ్స్ వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్ మోడళ్లే కావాలి. టూవీలర్లకు మాత్రం 2028 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.

EVల వినియోగం పెరిగే నేపథ్యంలో ఛార్జింగ్ సదుపాయాలను కూడా భారీగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఢిల్లీ వ్యాప్తంగా 30,000కు పైగా EV ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల వినియోగదారులు ఛార్జింగ్ సౌకర్యాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా EVలను సులభంగా ఉపయోగించే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: టీవీఎస్‌ ఆర్బిటర్‌ vs బజాజ్‌ చేతక్‌! బడ్జెట్‌ ఈవీ రేసులో ఏ స్కూటర్‌ కింగ్‌?

ఈ నిర్ణయం దేశ టూవీలర్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. Crisil అంచనాల ప్రకారం ఢిల్లీలో ఈ పాలసీ అమలుతో FY29 నాటికి దేశవ్యాప్తంగా టూవీలర్ అమ్మకాలలో EVల వాటా 21 నుంచి 23 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ పాలసీ లేకపోతే అది 18 నుంచి 20 శాతం మధ్యే ఉండేదని నివేదిక పేర్కొంది. అలాగే దేశవ్యాప్తంగా అదనంగా సుమారు 6 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్ల విక్రయాలకు ఈ నిర్ణయం దోహదపడే అవకాశం ఉందని విశ్లేషించింది.

ప్రస్తుతం ఢిల్లీలో నమోదైన మొత్తం వాహనాల్లో దాదాపు 67 శాతం టూవీలర్లే ఉన్నాయి. అందువల్ల ఈ నిర్ణయం దేశంలోనే అతి పెద్ద EV మార్పుల్లో ఒకటిగా నిలవనుంది. ఢిల్లీ తీసుకున్న ఈ అడుగును చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి విధానాలను అమలు చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాబోయే సంవత్సరాల్లో భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!
ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget