అన్వేషించండి

TVS Orbiter vs Bajaj Chetak:టీవీఎస్‌ ఆర్బిటర్‌ vs బజాజ్‌ చేతక్‌! బడ్జెట్‌ ఈవీ రేసులో ఏ స్కూటర్‌ కింగ్‌?

TVS Orbiter vs Bajaj Chetak:టీవీఎస్ మోటార్స్‌ నుంచి సరికొత్తగా వచ్చిన మినిమలిస్టిక్‌ డిజైన్ స్కూటర్‌ ఆర్బిటర్‌, బజాజ్ ఐకానిక్‌  చేతక్‌ ఈవీ మధ్య ఉన్న సమగ్ర పోలికను ఇక్కడ చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టీవీఎస్ ఆర్బిటర్, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్‌లో పోటీ.
  • ఆర్బిటర్ ఆధునిక ఫీచర్లు, చేతక్ ప్రీమియం నాణ్యతతో విభిన్నంగా నిలిచాయి.
  • రేంజ్, టెక్నాలజీ, విభిన్న ధర విధానాలతో వినియోగదారుల ఎంపిక సులువు.
TVS Orbiter vs Bajaj Chetak:భారత్‌ టూవీలర్ ఎలక్ట్రిక్ మార్కెట్‌ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ ట్రాన్స్‌ఫార్మేషన్ గుండా వెళ్తోంది. నిన్న మొన్నటి వరకు కేవలం స్టార్టప్‌ బ్రాండ్ల హవా నడిచిన ఈ రంగంలోకి... ఇప్పుడు దశాబ్దాల చరిత్ర ఉన్న దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు తమ ఆల్ట్రా మోడర్ అస్త్రాలతో రంగంలోకి దూకాయి. ఒక వైపు , మినిమలిస్టిక్‌ డిజైన్, ఏరోడైనిమిక్స్‌ బాడీ, వినూత్నమైన బాస్‌ మోడల్‌తో బడ్జెట్‌ ఈవీ సెగ్మెంట్‌ను షేక్ చేయడానికి వచ్చిన సరికొత్త టీవీఎస్‌ ఆర్బిటర్‌. మరోవైపు సరికొత్త ప్రీమియం మెటల్ బాడీతో, లగ్జరీ లుక్స్‌తో రీ-డిఫైన్ చేసిన ఆల్‌టైమ్ క్లాసిక్‌ బజాజ్ చేతక్‌ ఎలక్ట్రిక్. ఈ రెండు దిగ్గజాలలో మీ డైలీ కమ్యూటింగ్‌కు ఏది పక్కాగా సెట్ అవుతుందో చూద్దాం. 
 
పెట్రోల్‌ రేట్లతో విసిగిపోయిన మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీస్‌ నుంచి... టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్‌, ఫంకీ లుక్స్‌ కోరుకునే జెన్‌జీ అండ్ ఆల్ఫా జనరేషన్ వరకు అందరినీ ఆకట్టుకోవడానికి  రెండు స్కూటర్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఒకరు తక్కువ ధరకే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఇస్తుంటే, ఇంకొకరు సాలిడ్‌ బిల్డ్‌ క్వాలిటీతో రోడ్లపై తిరుగులేని పట్టును ప్రదర్శిస్తోంది. 

మెటల్ బాడీ క్లాసిక్‌ vs ఫ్యూచరిస్టిక్‌ మినిమిలిస్టిక్‌ లుక్‌

డిజైన్ లాంగ్వేజ్‌ విషయానికి వస్తే, ఈ రెండు ఈవీలు పూర్తిగా భిన్నమైన ధోరణులను కలిగి ఉన్నాయి. బజాజ్‌ చేతక్‌ తన ఐకానిక్‌ రెట్రో ఎలిగెంట్‌ లుక్‌ను అలాగే కాపాడుకుంటూ వచ్చింది. దీని అత్యంత పెద్ద ప్లస్ పాయింట్‌ దీని వల్ల గాలి వల్ల వచ్చే ప్రతిఘటన తగ్గి రేంజ్‌లో దాదాపు పది శాతం మెరుగుదల కనిపిస్తుందని టీవీఎస్ పేర్కొంది. 

స్పేస్‌ , ప్రాక్టికాలిటీ, యూజబిలిటీ

టీవీఎస్ ఆర్బిటర్‌లో ఏకంగా 34 లీటర్ల భారీ అండర్ సీట్‌ బూట్‌స్పేస్‌ లభిస్తుంది. ఇందులో ఒకేసారి రెండు హెల్మెట్‌లు లేదా మీ ల్యాప్‌టాప్ బ్యాగ్‌, ఆఫీస్‌ సామాగ్రిని చాలా సులభంగా సర్దేయవచ్చు. అంతేకాకుండా ఫ్రంట్‌ భాగంలో ఒక ఓపెన్ యాక్సెస్‌ బాక్స్, యుఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ సౌకర్యం ఉంది. చేతక్‌లో కూడా 35 లీటర్ల స్టోరేజ్ లభిస్తున్నప్పటికీ లోపలి స్పేస్‌ డిజైన్ వల్లే ఆర్బిటర్‌‌ యూజబిలిటీ పరంగా కొంచెం ఎక్కువ ప్రాక్టికల్‌గా అనిపిస్తుంది. చేతక్‌లో ప్రీమియం గ్లోవ్‌ బాక్స్ ఉన్నప్పటికీ, ఆర్బిటర్‌ లాంగ్ ఫ్లాట్‌ఫార్మ సీట్‌ రైడర్, వెనుక కూర్చున్న వారికి ఎక్కువ స్పేస్ ఇస్తుంది. 
scootermodel

మైలేజ్‌ వార్‌లో విన్నర్ ఎవరు?

ఈవీ ప్రపంచంలో మొదట ఎదురయ్యే ప్రశ్న రేంజ్ ఎంత? అని. ఈ విషయంలో ఈ రెండు బ్రాండ్లు వేర్వేరుగా బ్యాటరీ ఆప్షన్లతో వేర్వేరు కస్టమర్‌ బేస్‌ను టార్గెట్‌ను చేస్తున్నాయి. ఆర్బిర్‌ వీ1లో 1.8Kwh లిథియం- అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్‌ ఛార్జ్‌పై 86km సర్టిఫైడ్ రేంజ్‌ ఇస్తుంది. ఇది కేవలం 2 గంటల 20 నిమిషాల్లో 0-80 శాతం ఛార్జ్  అవుతుంది. ఆర్బిటర్‌ వీ2లో పెద్దదైన 3.1kWh లిథియం -అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 158కి.మి.  సర్టిఫైడ్ రేంజ్‌ ఇస్తుంది. లాంగ్‌ రైడ్స్ వెళ్లే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్. దీని టాప్ స్పీడ్‌ 68km/h. బజాజ్ చేతక్‌ సాధారణంగా 2.5kWh నుంచి 3kWh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. దీని ఎంట్రీ - లెవల్‌ C2501వేరియల్‌ 113km రేంజ్‌ ఇస్తుండగా, హయ్యర్‌ వేరియంట్లు 127-131km వరకు రైడింగ్ రేంజ్ అందిస్తాయి. చేతక్‌ టాప్ స్పీడ్ 70km/h వరకు ఉండటంతో సిటీలో ఓవర్‌టేకింగ్స్ చేయం చాలా స్మూత్‌గా ఉంటుంది. 
scootermodel

టెక్నాలజీ అండ్ కనెక్టివిటీ

ఈ రోజుల్లో స్కూటర్‌ అంటే కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు. అదొక గ్యాడ్జెట్‌లా మారిపోయింది. ఈ విషయంలో టీవీఎస్‌ ఆర్బిటర్‌ టెక్‌ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటుంది. టీవీఎస్ స్మార్ట్‌ఎక్సోనెక్ట్‌లో 5.5 ఇంచ్‌లో కలర్‌ ఎల్‌సీడీ క్లస్టర్ ఉంది. బ్లూటూత్ ద్వారా మీ మొబైల్ యాప్‌కు కనెక్ట్‌ చేస్తే, టర్న్‌ బై టర్న్ నావిగేషన్, ఇన్‌కమింగ్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌, డిస్టెన్స్‌ టు ఎంప్టీ, ఓవర్‌ది ఓయిత్‌ అప్‌డేట్స్‌ స్క్రీన్ పైనే కనిపిస్తాయి. అదనంగా క్రాష్‌ అలర్ట్‌, ఫాలో అలర్ట్‌, యాంటీ థెప్ట్ ప్రోయాక్టివ్ సేఫ్టీ సిస్టమ్స్‌ ఉన్నాయి. చేతక్‌ బేస్‌ వేరియంట్‌లో బేసిక్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉండగా, టాప్ వేరియంట్లలో 5 ఇంచ్‌ల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీ్ లభిస్తుంది. ఇది కూడా యాప్ కనెక్టివిటీ,జీపీఎస్‌ నావిగేషన్, టైమ్‌ ఫెన్సింగ్‌, టోయింగ్‌ అలర్ట్స్‌ వంటి ప్రీమియం ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. 
scootermodel

రైడింగ్ కంఫర్ట్‌- వీల్స సైజ్‌లో తేడాలు 

టీవీఎస్‌ ఆర్బిటర్‌లో ముందు భాగంలో 14 ఇంచ్‌ల ఫ్రంట్‌ వీల్‌ , వెనుక భాగంలో 12 ఇంచ్‌ల రేర్‌ వీల్‌ ఇస్తున్నారు. సాధారణంగా మోటార్‌సైకిళ్లలో ఉండే పెద్ద వీల్స్‌ లాంటి ఈ 14 ఇంచ్ వీల్‌ వల్ల రోడ్డుపై ఉన్న గుంతలు, స్పీడ్‌ బ్రేకర్లను స్కూటర్ చాలా సులభంగా, ఎలాంటి జెర్క్స్‌ లేకుండా దాటేస్తుంది. స్టెబిలిటీ పరంగా ఇది నెక్ట్స్‌ లెవల్ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. 
scootermodel
 
సాంప్రదాయకమైన 12 ఇంచ్‌ వీల్స్‌తో వస్తుంది. దీనికి ముందు భాగంలో ఉన్న లీడింగ్‌ లింక్‌ లేదా టెలిస్కోపిక్‌ సస్పెన్షన్ మంచి కంఫర్ట్‌ను ఇస్తున్నప్పటికీ, రఫ్‌ రోడ్స్‌ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. అయితే చేతక్‌ స్టీల్‌ మెటల్ బాడీ రైడింగ్‌ చేసేటప్పుడు ఒక సాలిడ్ అండ్‌ హెవీ వెహికల్ ఫీల్‌ను, నమ్మకాన్ని ఇస్తుంది. 

జేబుకు ఏది లాభం ?

బడ్జెట్‌ కాన్షియస్‌ ఉన్న ఇండియన్ మార్కెట్‌లో టీవీఎస్‌ పెద్ద మాస్టర్ స్ట్రోక్‌ ప్లే అనొచ్చు. సరికొత్త బాస్ ప్రోగ్రామ్‌ ద్వారా, మీరు బ్యాటరీ ధర మినహాయించి కేవలం స్కూటర్ బాడీకి మాత్రమే 50వేల చెల్లించి కొనుగోలు చేయవచ్చు. బ్యాటరీ కోసం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ ఎంచుకోవచ్చు. దీని వల్ల ప్రారంభ కొనుగోలు భారం విపరీతంగా తగ్గుతుంది. బ్యాటరీ వారంటీ బాధ్యత పూర్తిగా కంపెనీదే అవుతుంది. ఒక వేళ బ్యాటరీతో కలిపి పూర్తిగా అప్‌ఫ్రంట్ కొనాలనుకుంటే ఆర్బిటర్‌ ధర 84, 500 నుంచి 1,14, 580 వరకు ఉంటుంది. 
 
బజాజ్‌ చేతక్ ఎటువంటి బాస్‌ సబ్‌స్క్రిప్షన్ లేకుండా సాంప్రదాయ పద్ధతిలో విక్రయిస్తారు. దీని ధర వేరియంట్లను బట్టి 1,11 లక్షల నుంచి 1.47 లక్షల వరకు ఉంటుంది. ప్రారంభ పెట్టుబడి కొంచెం ఎక్కువైనా, ఎలాంటి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ల టెన్షన్లు లేకుండా మెటల్‌  బాడీతో లైఫ్‌ లాంగ్‌ నమ్మకానికి చేతక్ ఇస్తుంది. 

Frequently Asked Questions

టీవీఎస్ ఆర్బిటర్ 'బాస్' ప్రోగ్రామ్ అంటే ఏమిటి?

ఈ ప్రోగ్రామ్ ద్వారా, మీరు స్కూటర్ బాడీకి మాత్రమే రూ. 50వేలు చెల్లించి కొనుగోలు చేయవచ్చు. బ్యాటరీని నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ ద్వారా పొందవచ్చు. ఇది ప్రారంభ కొనుగోలు భారాన్ని తగ్గిస్తుంది.

బజాజ్ చేతక్ మరియు టీవీఎస్ ఆర్బిటర్ డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీలో ప్రధాన తేడాలు ఏమిటి?

చేతక్ క్లాసిక్ రెట్రో, ప్రీమియం మెటల్ బాడీతో వస్తుంది. ఆర్బిటర్ ఫ్యూచరిస్టిక్, మినిమలిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంది, దీని వలన గాలి నిరోధకత తగ్గి రేంజ్ మెరుగుపడుతుంది.

టీవీఎస్ ఆర్బిటర్ మరియు బజాజ్ చేతక్ ఏ రేంజ్ మరియు బ్యాటరీ ఎంపికలను అందిస్తాయి?

ఆర్బిటర్ V1 86కి.మీ రేంజ్ (1.8Kwh బ్యాటరీ) మరియు V2 158కి.మీ రేంజ్ (3.1kWh బ్యాటరీ) అందిస్తుంది. చేతక్ 113కి.మీ (ఎంట్రీ-లెవల్) నుండి 131కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది.

నిల్వ స్థలం మరియు ఆచరణాత్మకత పరంగా ఈ రెండు స్కూటర్లలో ఏది మెరుగు?

టీవీఎస్ ఆర్బిటర్ 34 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్, ఫ్రంట్ ఓపెన్ బాక్స్, USB ఛార్జింగ్ పోర్ట్ అందిస్తుంది. చేతక్ 35 లీటర్ల స్టోరేజ్ ఉన్నప్పటికీ, డిజైన్ కారణంగా ఆర్బిటర్ ఎక్కువ ఆచరణాత్మకమైనది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Honda Upcoming Bikes:హోండా నుంచి టూవీల్స్ సునామీ! 151 కి.మి. రేంజ్ బైక్ నుంచి ఇ- క్లచ్‌ టెక్నాలజీతో రానున్న 10 మోడల్స్ ఇవే!
హోండా నుంచి టూవీల్స్ సునామీ! 151 కి.మి. రేంజ్ బైక్ నుంచి ఇ- క్లచ్‌ టెక్నాలజీతో రానున్న 10 మోడల్స్ ఇవే!
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
కియా సైరోస్ EV లాంచ్‌ - 526 km రేంజ్‌, ADAS, వెంటిలేటెడ్ రియర్ సీట్లు, BaaS స్కీమ్‌తో తక్కువ రేటు!
కొత్త కియా సైరోస్ EV మన మార్కెట్‌లోకి వచ్చేసింది - కేవలం కేవలం రూ.8 లక్షలకే 526 km రేంజ్!
2026 మారుతి బ్రెజ్జా సేఫ్టీలో ఫస్ట్‌ - పెద్దలు, పిల్లల భద్రతలో 5 స్టార్ భారత్ NCAP రేటింగ్
సేఫ్టీలో 5-స్టార్‌ రేటింగ్‌ సాధించిన 2026 మారుతి బ్రెజ్జా - మీ ఫ్యామిలీ భద్రతకు భరోసా!
Advertisement

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget