అన్వేషించండి

TVS Bikes 2026: టీవీఎస్‌లో సామాన్యుడి బడ్జెట్ నుంచి రేసింగ్ ట్రాక్ వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరల వివరాలు ఇవే?

TVS Bikes 2026: ప్రస్తుతం భారత మార్కెట్‌లో టీవీఎస్‌ బైకుల ధరలు 55, 400 నుంచి ప్రారంభమై, గరిష్టంగా 3, 10, 640 వరకు ఉన్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టీవీఎస్ బైకులు 55,400 నుండి 3,10,640 వరకు అందుబాటులో ఉన్నాయి.
  • మైలేజ్ ప్రియులకు స్పోర్ట్, స్టార్ సిటీ ప్లస్, రేడియన్ మోడళ్లున్నాయి.
  • యువతను ఆకట్టుకునే రైడర్, అపాచీ సిరీస్ బైకులు లభ్యం.
  • భవిష్యత్తులో ఎలక్ట్రిక్, హై పెర్ఫార్మెన్స్ బైకులపై టీవీఎస్ దృష్టి.

TVS Bikes 2026: భారతీయ టూవీలర్ రంగంలో నమ్మకానికి, సాంకేతికతకు మారుపేరుగా నిలిచిన టీవీఎస్ మోటార్స్ కంపెనీ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. 1911లో టీవీ సుందరం అయ్యంగార్ స్థాపించిన రవాణా సంస్థగా ప్రారంభమై నేడు ప్రపంచవ్యాప్తంగా 80కిపైగా దేశాలకు వాహనాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. బిల్ట్‌ టు ఫెర్ఫార్మ్‌ అనే ట్యాగ్‌లైన్‌తో దూసుకుపోతున్న సంస్థ సామాన్య మధ్యతరగతి ప్రజలకు అవసరమయ్యే తక్కువ ధర బైకుల నుంచి వేగాన్ని ఇష్టపడే యువత కోసం ప్రీమియం రేసింగ్ బైకుల వరకు అన్ని విభాగాల్లోనూ అద్భుతమైన ఆప్షన్లు అందిస్తోంది. 

ధరలు- వైవిధ్యం 

ప్రస్తుతం భారత మార్కెట్‌లో టీవీఎస్‌ బైకుల ధరలు 55, 400 నుంచి ప్రారంభమై, గరిష్టంగా 3, 10, 640 వరకు ఉన్నాయి. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కంపెనీ 6 కమ్యూటర్ మోడళ్లు, క్రూయిజర్, 1 రోడ్‌స్టర్‌, 2 స్పోర్ట్స్ నేక్డ్‌, 3 స్పోర్ట్స్‌, 1 అడ్వెంచర్ టూర్‌, 1 ఆఫ్‌రోడ్‌ బైకును విక్రయిస్తోంది. 

బడ్జెట్‌, మైలేజీ ప్రియుల కోసం..

నిత్యం ఆఫీసులకు, పనులకు వెళ్లే వారికి మైలేజ్ అనేది ప్రాధాన్యత. ఈ విభాగంలో టీవీఎస్ తనదైన ముద్రవేసింది. 

టీవీఎస్ స్పోర్ట్

ఇది కంపెనీలో అత్యంత చౌకైన బైకుగా నిలుస్తోంది.దీని ధర 55, 100 నుంచి 57, 100 మధ్య ఉంటుంది. 

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్‌

మైలేజీ విషయంలో ఇది రారాజు అని చెప్పవచ్చు. కంపెనీ పరీక్షల ప్రకారం ఇది నగరాల్లో లీటరుకు 83.09 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ధర సుమారు 72, 500 వరకు ఉంటుంది. 

టీవీఎస్ రేడియాన్

55, 400 ప్రారంభ ధరతో లభించే ఈ బైక్, సాధారణ ప్రయాణికులకు అత్యంత అనువైంది. 

యువత మనసు దోచిన టీవీఎస్ రైడర్ 

125సీసీ విభాగంలో టీవీఎస్ రైడర్ ఒక సంచలనంగా మారింది. స్టైలిష్ లుక్, ఆధునిక ఫీచర్లు కోరుకునే యువతను ఇది విపరీతం ఆకట్టుకుంటోంది. దీని ధర 82వేల నుంచి ప్రారంభమై సుమారు 93,800 వరకు ఉంటుంది. హైవేలై ఇది 75 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని రివ్యూలు చెబుతున్నాయి. 

అపాచీ సిరీస్‌

 టీవీఎస్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచిన ఘనత అపాచీ సిరీస్‌దే. రేసింగ్ ట్రాక్ అనుభవాన్ని సాధారణ రోడ్లపై అందించే ఈ బైకులు వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. 

అపాచీ ఆర్టీఆర్‌ 160 & 160 4v

వీటి ధరలు 1,11, 490 నుంచి రు. 1, 35, 840 మధ్య ఉన్నాయి రోజువారీ ప్రయాణాల్లో స్పోర్టీ లుక్ కోరుకునే వారికి ఇవి సరైన ఎంపిక. 

అపాచీ RTR 310

ఇది టీవీఎస్ ఫ్లాగ్‌షిప్‌ మోడల్. BMW మోటోరాడ్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ బైక్‌ ధర రూ. 2.57 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది రేసింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. 

కొత్త ప్రయోగాలు టీవీఎస్ రోనిన్- అపాచీ RTX

టీవీఎస్‌ రోనిన్‌

నియో రెట్రో స్టైల్‌లో ఉండే ఈ క్రూయిజర్‌ బైక్ రూ. 1, 26, 69 ప్రారంభ ధరతో లభిస్తుంది. ఇది అటు సిటీ రైడింగ్‌కు, ఇటు లాంగ్ టూరింగ్‌కు సౌకర్యవంతంగా ఉంటుంది. 

అపాచీ RTX 300 

ఇది టీవీఎస్‌నుంచి వచ్చిన మొదటి అడ్వెంచర్ బైక్. 299సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ ధర 1.99 లక్షల నుంచి 2.29లక్షల మధ్య ఉంది. 

భవిష్యత్‌లో వచ్చే మోడల్స్‌

టీవీఎస్ రానున్న కాలంలో ఎలక్ట్రిక్, హై పెర్ఫార్మెన్స్‌ విభాగాలపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది అక్టోబర్‌లో టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ లాంచ్ చేయనుంది. నార్టన్ భాగస్వామ్యంతో వీఎస్ అపాచీ RR 450 బైక్‌ను 450సీసీ విభాగంలో సుమారు 4.20 లక్షల బడ్జెట్‌లో తీసుకొస్తోంది. టీవీఎస్ టాంజెంట్‌ RR కాన్సెప్ట్‌తో ట్రాక్ రేసింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మోడల్ తీసుకురానుంది. 

వినియోగదారుల సేవల నెట్‌వర్క్ 

భారత్ అంతటా టీవీఎస్‌కు 6, 757 డీలర్‌ షోరూమ్‌లు, 2, 164 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ఇది వినియోగదారులకు అమ్మకాల తదుపరి సేవలను సులభతరం చేస్తోంది. జూపిటర్, ఎన్‌టార్క్ వంటి స్కూటర్లతోపాటు ఐక్యూబ్, వంటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ో టీవీఎస్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 

Frequently Asked Questions

TVS బైకుల ధరలు ఎంత నుండి ప్రారంభమవుతాయి?

TVS బైకుల ధరలు ప్రస్తుతం భారత మార్కెట్ లో 55,400 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. అత్యంత చౌకైన మోడల్ TVS స్పోర్ట్.

TVS Star City Plus ఎంత మైలేజ్ ఇస్తుంది?

TVS Star City Plus మైలేజ్ విషయంలో చాలా మంచిది. కంపెనీ పరీక్షల ప్రకారం, ఇది నగరాల్లో లీటరుకు 83.09 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

యువతను ఆకట్టుకునే TVS బైక్ ఏది?

125సీసీ విభాగంలో TVS Raider బైక్ యువతను బాగా ఆకట్టుకుంటోంది. దీని ధర 82వేల నుండి ప్రారంభమవుతుంది మరియు హైవేలలో 75 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

TVS Radeon బైక్ ఎవరికి అనుకూలం?

TVS Radeon బైక్, 55,400 రూపాయల ప్రారంభ ధరతో, సాధారణ ప్రయాణికులకు అత్యంత అనుకూలమైనది.

TVS అపాచీ సిరీస్ దేనికి ప్రసిద్ధి చెందింది?

TVS అపాచీ సిరీస్ రేసింగ్ ట్రాక్ అనుభవాన్ని రోడ్లపై అందిస్తుంది. ఈ సిరీస్ TVS బ్రాండ్ ఇమేజ్ ను పెంచింది.

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget